మీతో పెళ్లికి రెడీ.. మా ఆయన కూడా.. | Man proposes marriage to Mrs. Tisca Chopra, she says yes! | Sakshi
Sakshi News home page

మీతో పెళ్లికి రెడీ.. మా ఆయన కూడా..

Published Sun, Oct 16 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

మీతో పెళ్లికి రెడీ.. మా ఆయన కూడా..

మీతో పెళ్లికి రెడీ.. మా ఆయన కూడా..

ముంబై: బాలీవుడ్ అందాలతార టిస్కా చోప్రాకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ అభిమాని నుంచి ఆమెకు ఊహించని ప్రతిపాదన వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరుతూ ట్విట్టర్లో అతగాడు టిస్కాకు ప్రపోజ్ చేశాడు.

కాగా 42 ఏళ్ల టిస్కాకు పెళ్లి అయ్యింది. ఆమె సంజయ్ చోప్రాను వివాహం చేసుకుంది. ఆయన ఎయిరిండియాలో పైలట్. వీరిద్దరికీ ఓ పాప ఉంది. పాపం అభిమానికి ఈ విషయాలు తెలియవో లేక తెలిసి కూడా పెళ్లి ప్రపోజల్ చేశాడో కానీ.. టిస్కా మాత్రం సీరియస్ కాకుండా కొంటెగా సమాధానం ఇచ్చింది. 'మాట్లాడాలని ఎదురు చూస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రపోజల్కు నేను రెడీ. దయచేసి మీ వివరాలన్ని నాకు పంపండి. నేను ఎవరి కోసం వెళతానో అతన్ని చూడాలని నా భర్త కూడా కోరుకుంటున్నాడు' అంటూ టిస్కా సమాధానం ఇచ్చింది. టిస్కా దెబ్బకు అభిమాని సైలెంట్ అయిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement