బుల్లితెరపై గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఆమెకు పాపులారిటీ పెరిగింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయ్యింది. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మృణాల్ పలు సినిమాలతో బిజీగా ఉంది.
చదవండి: షాకింగ్ సమంతకు గాయాలు, ఫొటో వైరల్
ఇక తెలుగులో నాని నెక్ట్స్ మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సోమవారం ట్విటర్ వేదికగా ఆమె ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్స్ నుంచి మృణాల్‌కు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఏకంగా ఓ అభిమాని పెళ్లి చేసుకుంటావా? అడిగాడు. దీనికి మృణాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చి నెటిజన్‌కు షాకిచ్చింది. కాగా నిన్న ఆస్క్‌మీ మృణాల్ పేరుతో ఆమె ట్విటర్ వేదికగా లైవ్ చాట్ నిర్వహించింది.
చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: అందాల తార రాజశ్రీ
ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘నా తరపు నుంచి పెళ్లి పక్కా’ అంటూ పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. ఇక దీనికి మృణాల్ స్పందిస్తూ ‘నా తరుపు నుంచి వద్దు అనుకుంటున్నా’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా ‘సెల్ఫీ’ మూవీలో ఓ సాంగ్ చేసిన మృణాలు.. ఇషాన్ కట్టర్‌తో ఓ సినిమా, ఆదిత్య కపూర్‌తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment