marriage proposal
-
మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!
బాలావుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే బుట్టబొమ్మ పూజా హేగ్డేతో కలిసి కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ అంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు(ఐఫా) అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని బాలీవుడ్ స్టార్ హీరోకు ఈవెంట్లో ఓ మహిళా అభిమాని ఊహించని ప్రశ్నతో సర్ప్రైజ్ ఇచ్చింది. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ సల్మాన్‌ఖాన్‌కు ప్రపోజ్ చేసింది ఓ అభిమాని. 'సల్మాన్ ఖాన్ నిన్ను ఇష్టపడుతున్నా. ఈ విషయం చెప్పేందుకే హాలీవుడ్ నుంచి ఇక్కడి దాకా వచ్చా. నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డా' అంటూ తన ప్రేమను వెల్లడించింది. దీనికి సల్మాన్ ఖాన్ చమత్కారంగా సమాధానమిచ్చారు. మీరు షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారా? అంటూ జోక్ చేశారు. (ఇది చదవండి: సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?) లేదు.. మిమ్మల్నే ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటారా? అని మరోసారి అడగ్గా.. మీరు 20 ఏళ్ల నన్ను కలిసి ఉండాల్సిందని సరదాగా బదులిచ్చారు. కాగా.. సల్మాన్‌ఖాన్‌కు గతంలో పలు బ్రేకప్ స్టోరీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మహిళను చంపి, ముక్కలుగా నరికి..
శ్రీనగర్: ఢిల్లీలో అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణాన్ని గుర్తుకు తెచ్చే ఘటన ఇది. జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో షబీర్ అహ్మద్ వనీ(45) అనే వ్యక్తి కార్పెంటర్ ఓ మహిళ(30)ను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు. మార్చి 7వ తేదీన కోచింగ్ క్లాస్‌కని వెళ్లిన తన సోదరి కనిపించకుండా పోయిందంటూ షోయిబుగ్‌కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ సెల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహన్‌పురా ఒంపొరాకు చెందిన వనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మహిళ శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానంటూ వనీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై పగబట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!
బుల్లితెరపై గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఆమెకు పాపులారిటీ పెరిగింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయ్యింది. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మృణాల్ పలు సినిమాలతో బిజీగా ఉంది. చదవండి: షాకింగ్ సమంతకు గాయాలు, ఫొటో వైరల్ ఇక తెలుగులో నాని నెక్ట్స్ మూవీలో ఆమె హీరోయిన్గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సోమవారం ట్విటర్ వేదికగా ఆమె ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్స్ నుంచి మృణాల్‌కు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఏకంగా ఓ అభిమాని పెళ్లి చేసుకుంటావా? అడిగాడు. దీనికి మృణాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చి నెటిజన్‌కు షాకిచ్చింది. కాగా నిన్న ఆస్క్‌మీ మృణాల్ పేరుతో ఆమె ట్విటర్ వేదికగా లైవ్ చాట్ నిర్వహించింది. చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: అందాల తార రాజశ్రీ ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘నా తరపు నుంచి పెళ్లి పక్కా’ అంటూ పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. ఇక దీనికి మృణాల్ స్పందిస్తూ ‘నా తరుపు నుంచి వద్దు అనుకుంటున్నా’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్గా ‘సెల్ఫీ’ మూవీలో ఓ సాంగ్ చేసిన మృణాలు.. ఇషాన్ కట్టర్‌తో ఓ సినిమా, ఆదిత్య కపూర్‌తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’
క్రైమ్: అతనొక దివ్యాంగుడు. వైకల్యాన్ని లెక్కచేయకుండా.. బాగా చదువుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని.. జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. అయితే వయసు మూడు పదులు దాటడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని పాలిట మరణ శాసనం అయ్యింది. వివాహం చేసుకోవాలని ఉందని చెప్పినందుకు ఓ దివ్యాంగుడిని.. సవతి తల్లి, అతని తండ్రి సాయంతోనే కడతేర్చింది. ఒడిషా నయాగఢ్ జిల్లా పథరాపుంజ గ్రామం దసపల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది. బాధితుడు విజయ్ ప్రధాన్(35).. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం ఉంది. తన పిల్లలను బాగా చూసుకుంటూ.. విజయ్ను రాచిరంపాన పెడుతూ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయినా విజయ్ మాత్రం పట్టించుకోకుండా బాగా చదువుకుని.. స్థానికంగా ఓ చిన్నకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వివాహం చేసుకోమని అతని మేనత్త, మేనమామలు సూచించారు. వాళ్ల కోరిక ప్రకారం స్థిరపడాలనుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం విజయ్ లాక్కెళ్లిపోతాడేమోనని ఆ సవతి తల్లి భయపడింది. అతని వివాహానికి ససేమీరా చెప్పింది. అయినా విజయ్ మేనత్త సంబంధాలు చూడసాగింది. ఇది ఆ సవతి తల్లికి కోపం తెప్పించింది. శనివారం ఈ విషయంపై ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో సవతి తల్లి, విజయ్ తండ్రి, వాళ్ల పిల్లల సాయంతో.. విజయ్ను కర్రలతో కొట్టి చంపారు. ఈ మేరకు విజయ్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో 17 ఏళ్ల అమ్మాయిని బెదిరించాడు ఓ యువకుడు. పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో ముక్కలు ముక్కలుగా నరికేస్తానని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఆకతాయి పేరు ఫయాజ్. చాలా కాలంగా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆమె స్కూల్‌కు వెళ్లే సమయంలో వెంటపడి తరచూ ఇబ్బందిపెడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వాళ్లు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ అతని బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే అమ్మాయి అందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫయాజ్ ఆమెను భయపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులను అశ్రయించారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు ఫయాజ్ ఇంటికి వెళ్లగా.. కుటుంబసభ్యులు వాళ్లతో గొడవకు దిగారు. పలితంగా మరికొంత మంది పోలీసులను పిలిపించి అధికారులు ఫయాజ్ను అరెస్టు చేశారు. అతడిపై అక్టోబర్ 16న పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు తెలిపారు. చదవండి: కోటిన్నర నగలు కొట్టేశారు -
పెళ్లికి నిరాకరించిందని హత్య
ఖిల్లాఘనపురం: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ప్రియుడు మాట్లాడుకుందామని పిలిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపు రం మండలం మానాజీపేటలో ఈ నెల 5న జరగగా 8వ తేదీ సాయంత్రం వెలుగు చూసింది. మానాజీపేటకు చెందిన బత్తని అంజన్న 20 ఏళ్లుగా కుటుంబంతో కలిసి శంషాబాద్ దగ్గర జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు శ్రీశైలంకు మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పడంతో అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో సాయిప్రియ శంకర్‌తో మాట్లాడటం మానేసింది. తర్వాత కరోనా ప్రభావంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం కుటుంబం మానాజీపేటకు వెళ్లింది. మళ్లీ మాటలు కలిసి.. మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. ఈ క్రమంలో నెల 5న సాయిప్రియ భూత్పూర్ వరకు రాగా అక్కడి నుంచి శంకర్ బైక్‌పై మానాజీపేటలోని తన షెడ్ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శంకర్ సాయిప్రియ మెడలోని చున్నీతో గొంతు నులిమి చంపాడు. తన బంధువు శివతో కలిసి సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. మిస్సింగ్ కేసు విచారణతో.. సాయిప్రియ ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనాస్థలానికి చేరుకుని తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. -
పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి... ఆ తర్వాత అతను
పెళ్లి చేసుకుందామంటూ ఆమె వెంటపడ్డాడు. ఐతే ఆమె అందుకు అస్సలు అంగీకరించటం లేదు. దీంతో ఆమె పై పలుమార్లు కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని 20 ఏళ్ల యువతిని బబ్లు అనే వ్యక్తి పెళ్లి చేకుందామంటూ వేధించసాగాడు. ఐతే ఆ యువతి అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన బబ్లు ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉన్నసమయంలో కత్తితో దాడి చేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, సదరు యువతిని చికిత్సి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి వివేక్ సింగ్ తెలిపారు. నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులకు బబ్లు ఖడ్వాలోని ఇందిరా సాగర్ డ్యామ్ సమీపంలో శవమై కనిపించాడని తెలిపారు. బహుశా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి సోదరి బబ్లు అనే వ్యక్తి పక్కనే ఉన్న గ్రామంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తుంటాడని తెలిపింది. ఐతే ఆ బబ్లు అనే వ్యక్తి తన అక్కను పెళ్లి చేసుకోవాలని పదే పదే బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. వాళ్ల అమ్మనాన్నలు ఊరెళ్లడంతో తామిద్దరమే ఇంట్లో ఉన్నామని, ఆ సమయంలోనే బబ్లు వచ్చి అక్క పై దాడి చేసి వెళ్లిపోయాడని చెప్పింది. తాను ఆ సమయంలో ఇంటి బయట బకెట్లో నీళ్లు నింపుతుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి చెల్లెలు చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనపై తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు. (చదవండి: కుడి చేతిపై లవ్ సింబల్.. భార్య ప్రవర్తనతో భర్త షాక్.. చివరికి ఏం చేశాడంటే?) -
అప్పటికే ఇద్దరు భార్యలు, అయినా హీరోయిన్‌కు సింగర్ పెళ్లి ప్రపోజల్
Urvashi Rautela Says Egyptian Singer With 2 Wives Proposed Her: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల 'ది లెజెండ్' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు ఊర్వశీ ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో 'బ్లాక్ రోజ్' సినిమాలో నటించిన ఈ గ్లామర్ క్వీన్ తాజాగా తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా 'మీకు ఎప్పుడైన ఇబ్బందికర మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందా?' అని అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యే సమాధానం ఇచ్చింది ఊర్వశీ. 'నాకు చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. అందులో మీరు చెప్పినటువంటి ప్రతిపాదన ఒకటి ఉంది. దుబాయ్‌లో ఈజిప్ట్‌కు చెందిన స్టార్ సింగర్ ఒకరిని కలిశాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది మన సాంస్కృతికి, సాంప్రదాయానికి విరుద్ధం. మనం మన కుటుంబం గురించి ఆలోచించగలగాలి. అలాగే ఒక మహిళ తన జీవితం గురించిన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు' అని తెలిపింది. చదవండి: ఆ హీరోయిన్‌కు రూ. 20 కోట్ల పారితోషికం !.. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం అయితే ఈజిప్టు సింగర్ పేరును ఊర్వశీ రౌటేలా చెప్పలేదు. కానీ ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో 'అతని పేరు మహ్మద్ రమదాన్' అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఎందుకంటే 2021లో విడుదలైన 'వెర్సాస్ బేబీ' అనే మ్యూజిక్ వీడియోలో ఈజిప్షియన్ యాక్టర్, సింగర్ మహ్మద్ రమదాన్‌తో కలిసి ఊర్వశీ నటించింది. ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం ఈ మ్యూజిక్ వీడియోలో ఊర్వశీ అత్యంత ఖరీదైన దుస్తులు వేసుకుందని సమాచారం. ఆమె దుస్తులకు రూ. 15 కోట్లు ఖర్చు అయ్యాని టాక్. చదవండి: చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం
ఇటాలియన్ టెన్నిస్ స్టార్ మాటియో బెరెట్టిని సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఏటీపీ 500 క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా శనివారం డచ్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్పై 6-4, 6-3 తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. బెరెట్టిని గ్రాస్ కోర్టులో తాను చివరగా ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఇది 19వ విజయం కావడం విశేషం. ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా వింబుల్డన్ ఫైనల్. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బెరెట్టిని పరాజయం పాలయ్యాడు. కాగా మ్యాచ్ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో భాగంగా బెరెట్టినికి వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఒక యువతి.. ''మాటియో.. నన్ను పెళ్లి చేసుకుంటావా'' అని గట్టిగా అరిచింది. దీంతో షాక్ తిన్న బెరెట్టిని.. ఆ తర్వాత చిరునవ్వుతో ''ఈ విషయం గురించి ఆలోచించి చెబుతా'' అని సూపర్ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక ఫైనల్లో బెరెట్టిని సెర్బియాకు చెందిన ఫిలిప్ క్రాజినోవిక్తో తలపడనున్నాడు. A post-match marriage proposal for @MattBerrettini 👀 💍#cinchChampionships pic.twitter.com/IzQiIG1EYG — Tennis TV (@TennisTV) June 18, 2022 చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు' Nick Kyrgios: 'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన -
పెళ్లి చేసుకుంటే రూ. 20 కోట్లు
-
ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన ఆసీస్ మహిళ.. ఎలాగో చూడండి..!
పెర్త్: ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సాఫ్ట్ బాల్ టోర్నీ సందర్భంగా ఓ మహిళా క్రీడాకారిణి.. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్ చేసింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో గాయపడినట్లు నటించి ప్రియురాలి ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచింది. పిచ్‌పైనే తనను మనువాడాలని కోరి మైదానంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. Wait for it… pic.twitter.com/gZ3tTxnJ9w — Rex Chapman🏇🏼 (@RexChapman) December 10, 2021 వివరాల్లోకి వెళితే.. సారా రియో, జసింతా కమాండే రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రొఫెషనల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణులైన ఈ ఇద్దరు ఓ లీగ్ గేమ్‌లో ఆడుతుండగా.. సారా రియో స్టాండ్స్‌లో ఉన్న ప్రేయసి జసింతా ముందు వెరైటీగా పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. సారా మ్యాచ్ మధ్యలో గాయపడినట్లు నటించడంతో స్టాండ్స్‌లో ఉన్న జసింతా మైదానంలోని పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటివరకు పడిపోయినట్లు నటించిన సారా.. జసింతా రావడంతోనే మోకాళ్లపై నిల్చోని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఊహించని ఈ పరిణామంతో జసింతా సహా మైదానంలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం తేరుకున్న జసింతా ప్రేయసి సారాను హత్తుకోవడంతో మైదానం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. కాగా, టోర్నీలోని కీలక మ్యాచ్ కావడంతో సారా తన మిత్రులు, కుటుంబ సభ్యులనందరీని ఆహ్వానించి మరీ వారందరి సమక్షంలోనే ఇష్ట సఖి ముందు పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. -
పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి
Kerala Married Woman Pours Acid On Man For Rejecting To Marriage Her: వివాహం చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తిపై యాసిడ్‌తో దాడి చేసింది ఓ వివాహిత. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి షీబా అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అప్పటికే షీబాకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయిన షీబా పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. షీబా వివాహిత అని తెలియని అరుణ్ ఆమెతో ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలో ఓ రోజు షీబాకు వివాహం అయి.. ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అరుణ్‌కు తెలిసింది. దాంతో అతడు తమ బంధానికి ముగింపు పలకాలని భావించాడు. కానీ షీబా అందుకు అంగీకరించలేదు. తనను వివాహం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. తమ బంధం గురించి నలుగురికి చెప్తానని బెదిరించి.. అరుణ్ కుమార్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయసాగింది. (చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ) ఈ క్రమంలో నవంబర్ 16న అరుణ్ కుమార్ తన అన్న, మరో స్నేహితుడితో కలిసి... తిరువనంతపురంలో ఉన్న చర్చికి వెళ్లాడు. షీబా అడిగిన మొత్తాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆ సమయంలో ఇరువురి మధ్య వివాహం గురించి మరో సారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలో అరుణ్ కుమార్.. షీబాను వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పాడు. అరుణ్‌కుమార్‌పై ఆగ్రహంతో ఉన్న షీబా.. చర్చి వద్దకు వచ్చేటప్పుడే తనతో పాటు యాసిడ్ తీసుకుని వచ్చింది. (చదవండి: నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేయగానే..) అరుణ్ కుమార్ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ అతడిపై పోసి.. అక్కడ నుంచి పరారయ్యింది. ప్రస్తుతం అరుణ్ కుమార్‌కు తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పటిల్‌లో చికిత్స జరగుతుంది. యాసిడ్ దాడిలో అరుణ్ కుమార్ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. షీబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో షీబాకు కూడా గాయాలయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: ప్రియురాలి యాసిడ్ దాడి, ప్రియుడి మృతి -
అఫ్గాన్ బోర్డర్ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!
కాబుల్: అఫ్గానిస్తాన్ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు. చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా -
కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు: అఫ్రిదికి కాబోయే అల్లుడు
లాహోర్: పాకిస్తాన్ యువ సంచలనం.. బౌలర్ షాహిన్ అఫ్రిది తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. కెరీర్లో ఇంకా చాలా ఎదగాల్సి ఉందని.. పెళ్లికి ఇప్పుడేం తొందర లేదని తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురు అక్సా అఫ్రిదితో వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లి జరగబోయేది నిజమేనని.. ఎప్పుడు చేయాలనేది మా రెండు కుటుంబాలు మాట్లాడుకుంటామని షాహిద్ అఫ్రిది కూడా మీడియాకు గతంలోనే వెల్లడించాడు. తాజాగా షాహిన్ అఫ్రిది తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి చెక్ పెట్టాడు. ''నా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. కెరీర్లో ఇది నాకు కీలక సమయం. అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ బౌలర్‌గా మారుతున్న సమయం. ఇలాంటి దశలో ఎలా ముందుకు వెళ్లాలన్నది మాత్రమే ఆలోచిస్తున్నా. బౌలింగ్‌లో రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టు తరపున ఆడామా.. మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టామా.. గెలిపించామా అన్న చందంగా నా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా. బౌలింగ్‌లో మంచి ఫాం కనబరిస్తే రికార్డులు వాటంతట అవే వస్తాయి. నాకు తెలిసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటూ జట్టుకు సుధీర్ఘ కాలం పాటు సేవలందించాలని అనుకుంటున్నా. ఇక రమీజ్ రజాను పీసీబీ చైర్మన్‌ను చేయడంపై సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక షాహిన్ అఫ్రిది ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మంచి ఫామ్ కనబరుస్తున్న షాహిన్ ఇటీవలే విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు తీసిన అఫ్రిది మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా షాహిన్ అఫ్రిది పాకిస్తాన్ తరపున 19 టెస్టుల్లో 76 వికెట్లు, 28 వన్డేల్లో 53 వికెట్లు, 30 టీ20ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్ మాజీ క్రికెటర్ CPL 2021: షెఫర్డ్ అద్భుత స్పెల్.. సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ -
పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి..
సాక్షి,పశ్చిమగోదావరి: పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిగూడెంకు చెందిన 15 ఏళ్ల బాలికకు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్ బుద్దాల అంజిబాబుతో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్టు నమ్మించి, పెళ్లి చేసుకుంటానని ఈనెల 19న బాలికను ద్వారకాతిరుమలకు రప్పించాడు. అనంతరం ఒక లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత బస్టాండ్‌కు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. తనకు పెళ్లైందని, ఇంటికి వెళ్లిపోమని చెప్పి అంజిబాబు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, స్థానిక పోలీస్టేషన్లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రొఫైల్ పెడితే.. రూ.25 వేలు మాయం -
పెళ్లి సంబంధం చూసిన నెటిజన్.. శ్రీముఖి షాకింగ్ రిప్లై!
ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా, మరో వైపు వెండితెరపై నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది అందాల ముద్దు గుమ్మ శ్రీముఖి. ఇక బుల్లితెరపై పటాస్ షో శ్రీముఖిని టాప్ ప్లేస్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇటీవల నెటిజన్లతో పర్శనల్ విషయాలను షేర్ చేసుకుంటూ, వారి కామెంట్లకు తనదైన శైలిలో సమాధానాలిస్తోంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌తో ముచ్చటిస్తుండగా శ్రీముఖికి ఓ వింత ప్రశ్న ఎదురైంది. గత కొన్నేళ్ల నుంచి తరచూ శ్రీముఖికి సంబంధించిన పెళ్లి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందుకు ఆమె పలు షోలలో చేసిన కామెంట్లు కూడా ఇలాంటి వార్తలు రావడానికి కారణమవుతున్నాయి. యాంకర్‌గా పటాస్ షో తరువాత ఈ అమ్మడు చేసిన షోలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదనే చెప్పాలి. ఇటీవల ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌తో ముచ్చటిస్తుండగా.. ఆ వ్యక్తి శ్రీముఖికి పెళ్లి సంబంధం చూసినట్టుగా చెప్పుకొచ్చాడు. ‘అక్క నీకు ఒక మంచి మ్యాచ్ ఉంది మాట్లాడమంటావా.. నీకు సరిగ్గా సరిపోతాడని తెలిపాడు. దీనకి శ్రీముఖి నవ్వుతూ ఎవరిదంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఈ ప్రపోజల్ తెచ్చిన నెటిజన్ ఎవరనేది చెప్పకపోవడంతో శ్రీముఖికి నెటిజన్ చూసిన సంబంధంపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
నాలుగేళ్లుగా ప్రేమ, సహజీవనం, పెళ్లి ప్రస్తావన తేవడంతో!
సాక్షి, ఖమ్మం: నాలుగేళ్లుగా ప్రేమించానంటూ కలిసి తిరిగి, జల్సాలకు డబ్బులు వాడుకుని తీరా పెళ్లి ప్రస్తావన తేగానే ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు పూనుకున్న సంఘటన బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతలకు చెందిన వేణు(22) ఆదే మండలంలోని చిరునోములకు చెందిన సింధు(21) గత నాలుగేళ్గుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వేణు, సింధును వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా చేర్చి అక్కడే ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఆమెకొచ్చే జీతంతో జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. కొద్ది రోజుల క్రితం వేణు సింధుకు చెప్పకుండా స్వంత గ్రామానికి వచ్చాడు. సింధు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో శుక్రవారం సింధు రావినూతల వచ్చి ప్రియుడిని గట్టిగా నిలదీయగా పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పా డు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ కొండలరావు సంఘటనా స్థలానికి చేరకుని యువతితో మాట్లాడి న్యాయం చేస్తామని ఇరు కుటుంబాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించింది. చదవండి: సాక్షి, ఎఫెక్ట్: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు -
నిన్ను పెళ్లాడాలంటే ఏం చేయాలి? హీరోయిన్‌కు ప్రపోజల్
హీరోలకే కాదు హీరోయిన్లకూ వీరాభిమానులు ఉంటారు. కాకపోతే అభిమాన తారలను దగ్గరనుంచి చూడాలని మురిసిపోయే వారు కొందరైతే, కుదిరితే ఆ తారలతో సెల్ఫీ దిగాలని, మరీ కుదిరితే ఏకంగా ఆమె చేయి పట్టుకుని నడవాలని పగటికలలు కనేవాళ్లు మరికొందరు. ఇక్కడ కూడా ఓ నెటిజన్.. తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ తన ప్రేమను ఆమెకు ఎలా వ్యక్తం చేయాలి? ఆమెను ఎలా బుట్టలో వేసుకోవాలి? అసలు పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతమయ్యాడు. దీనికి పరిష్కారం సూచించమని సదరు హీరోయిన్నే సూటిగా ప్రశ్నించాడు. "మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి" అని సోషల్ మీడియాలో అడిగేశాడు. దీనికి సదరు నటి స్పందిస్తూ.. "నాతో ప్రయాణం అంటే కొత్తవారికి కొంత కష్టమే! కాబట్టి మీకు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలన్న విషయం తెలియకపోతేనే మంచిది, సురక్షితం కూడా! అని బదులిచ్చింది. కాగా న్యూస్‌రీడర్‌గా పని చేసిన ప్రియాభవానీ శంకర్ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత వెండితెరవైపు అడుగులు వేసిన ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్లుగా ఆమె రాజవేల్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. కానీ దీనిపై ప్రియా భవానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె చివరగా బ్లాక్‌బస్టర్ మూవీ 'మాఫియా'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మంచు మనోజ్ సరసన 'అహం బ్రహ్మాస్మి'లోనూ ప్రియాభవానీ నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్ ఎంతంటే.. -
బుల్లితెర యాంకర్ రాములమ్మకు పెళ్లి ప్రపోజల్
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు రాములమ్మ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. ఎప్పటిలాగే తిరిగి యూట్యూబ్ వీడియోలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయండన్న అభిమానుల కోరికకు పచ్చజెండా ఊపింది. ఇక ఓ నెటిజన్ ధైర్యం చేసి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని మనసులోని మాట బయటపెట్టడంతో అవాక్కైన శ్రీముఖి 'వద్దురా, సోదరా, పెళ్లంటే నూరేళ్ల మంటరా..' పాటను గుర్తు చేస్తూ కుదరదని తేల్చి చెప్పింది. పోనీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావ్ అన్న మరొకరి ప్రశ్నకు దానికి సమాధానం తన దగ్గర లేదని బదులిచ్చింది. మీమర్స్ అంటే ఎంతో ఇష్టమన్న శ్రీముఖి ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధిస్తే మీమ్స్ మిస్ అవుతానని బాధపడింది. 'మీరు మళ్లీ బిగ్‌బాస్ సీజన్లోకి రండి అక్క, అప్పుడే మాకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది' అన్న రిక్వెస్ట్‌కు యాంకర్ దిమ్మతిరిగిపోగా.. మంచిది అంటూ దాటవేసింది. తనకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంటే క్రష్ అని చెప్పింది. ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, దయచేసి తనను నమ్మండి అని కోరింది. ఇదిలా వుంటే తను కూడా ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యానని, కానీ దాన్నుంచి కోలుకుని రెట్టింపు స్ట్రాంగ్‌గా తయారయ్యానని చెప్పింది. ఇక చాలామంది శ్రీముఖి తమ్ముడు సుష్రుత్ గురించి అడిగారు. అతడంటే చాలా ఇష్టమని, పెళ్లి చేసుకోవాలనుందంటూ తమ కోరికను బయటపెట్టారు. ఇది చూసిన శ్రీముఖి.. సుష్రుత్తో యూట్యూబ్ వీడియోలు చేయాలంటేనే భయంగా ఉంది అని కామెంట్ చేసింది. చదవండి: న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్..షేర్ చేసిన యాంకర్ శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా! -
నెలకు రూ.లక్ష పైనే, నన్ను పెళ్లి చేసుకుంటావా?
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ల ముద్దుల కూతురు సుహానా ఖాన్ నిన్న(మే 25న) 21వ వడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రత్యేక విషెస్ తెలియజేసింది. 'నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సుహానా బర్త్‌డే అని తెలియగానే చాలామంది అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఓ అభిమాని మాత్రం ఏకంగా పెళ్లి ప్రపోజల్ తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'గౌరీ మేడమ్.. నేను నెలకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తాను. నాకు సుహానాను ఇచ్చి పెళ్లి చేయండి' అంటూ చేతులెత్తి వేడుకుంటున్న ఎమోజీని జత చేశాడు. అయితే అతడి ప్రపోజల్‌ను గౌరీ పట్టించుకుందో లేదో కానీ నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. నీ లక్ష రూపాయలు వారికి ఏ మూలకూ సరిపోవు అంటూ కామెంట్లు చేస్తున్నారు. Gauri mam meri shadi Suhana ke saath karwado 🙏 🤗 Meri monthly payment 1lakh+ hai — SUHAIB صہیب 🇮🇳 (@SRKmania_) May 21, 2021 ఇదిలా వుంటే సుహానా ఖాన్ న్యూయార్క్‌లో విద్యనభ్యసిస్తోన్న విషయం తెలిసిందే. సెకండ్ లాక్డౌన్ విధించగానే గౌరీ ఖాన్ తన కొడుకు ఆర్యన్‌ను తీసుకుని కూతురి దగ్గరకు వెళ్లిపోయింది. అంటే షారుక్ మినహా కుటుంబం అంతా న్యూయార్క్‌లోనే సేద తీరుతోంది. View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) చదవండి: ఈ ఫోటోలో ఉన్న స్టార్ కిడ్స్‌ని గుర్తుపట్టారా? -
'ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి'
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత మార్చిలో పాక్ యంగ్ క్రికెటర్ షాహిన్ అఫ్రిదికి.. షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిదికి షాదీ జరగనుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. షాహిన్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ అక్సా ఇంటికి వెళ్లి మాట్లాడాడని.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నాయంటూ పలు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే వీటిపై షాహిద్ అఫ్రిది మాత్రం ఏనాడు స్పందించలేదు. కానీ తాజాగా షాహిద్ అఫ్రిది తన కూతురు పెళ్లిపై తొలిసారి స్పందించాడు. ''నా కూతురు పెళ్లి త్వరలోనే షాహిన్ అఫ్రిదితో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు చర్చించుకున్నాం. కానీ ఈ ప్రొపోజల్‌కు ముందు నా కూతురు అక్సా, షాహిన్‌లు రిలేషన్ ఉన్నారన్నది అబద్దం. ఇది పెద్దల అంగీకారంతో జరుగుతున్న పెళ్లి. షాహిన్ తండ్రి నా కూతురు తన కోడలు కావాలని ఇంటికి వచ్చి అడగడంతో కాదనలేకపోయా. అయితే నా కూతురు అక్సా డాక్టర్ చదువుతుంది.. త్వరలోనే విదేశాలకు వెళ్లాలనుకుంటుంది. షాహిన్ కూడా తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. కాబట్టి ఇద్దరు తమ కెరీర్లో స్థిరపడ్డాకే నిఖా అనుకుంటున్నాం.. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించడం జరిగిపోయింది. ఇంతకాలం వచ్చిన రూమర్లకు ఇక చెక్ పెట్టండి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా షాహిన్ అఫ్రిది ఇప్పుడిప్పుడే పాకిస్తాన్‌కు కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. షాహిన్ అఫ్రిది ఇప్పటివరకు పాకిస్తాన్ తరపున 17 టెస్టుల్లో 58 వికెట్లు.. 25 వన్డేల్లో 51 వికెట్లు.. 25 టీ20ల్లో 27 వికెట్లు తీశాడు. కరోనాతో వాయిదా పడ్డ పాకిస్థాన్ సూపర్ లీగ్ 6వ సీజన్లో అఫ్రిదీతో కలిసి షహీన్ ఆడాడు. షాహీన్ లాహోర్ క్యూలాండర్స్‌కు.. షాహిద్ ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చదవండి: అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది నిశ్చితార్థం! 'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి' -
బ్రిటీష్ యువతికి పెళ్లి పేరిట వల.. ఆపై దారుణం
ఇస్లామాబాద్: బ్రిటీష్ దేశానికి చెందిన యువతి పాకిస్తాన్లో ఉంటుండగా ఇద్దరు యువకులు ఆమెను ఇష్టపడ్డారు. వారిద్దరూ ఆమెకు లవ్ ప్రపోజల్స్ చేశారు. అయితే వారు ప్రపోజల్ చేసిన కొన్నాళ్లకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పాకిస్తాన్లో కలకలం రేపింది. ఆ యువతి మరణం మిస్టరీగా మారింది. దీనిపై అక్కడి పోలీసులతో పాటు బ్రిటీష్ అధికారులు కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెల్జియంకు చెందిన లా విద్యార్థి మైరా జుల్ఫికర్ (25) పాకిస్తాన్‌లోని లాహోర్‌లో తన స్నేహితురాలు ఇఖ్రాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మూడు నెలల కిందట బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సాద్ అమీర్ భట్, జాహీద్ జడూన్ పరిచయమయ్యారు. ఆ ఇద్దరు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే వారిని తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తుపాకీ తూటాలకు బలైంది. లాహోర్‌లో నివసించే ఆమె బాబాయి మహ్మద్ నాజీర్ విషయం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె హత్య విషయమై ఫిర్యాదు చేశాడు. మైరాకు ఇద్దరు పెళ్లి ప్రతిపాదన చేయగా దాన్ని తిరస్కరించినప్పటి నుంచి ఆమెకు ప్రాణహాని పొంచి ఉందని ఫిర్యాదులో ఆమె బాబాయి పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మెడ వద్ద.. తొడ భాగాన రెండు బుల్లెట్లను గుర్తించారు. అయితే వారిద్దరూ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోణంలో విచారణ చేయగా.. వారిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుంటే బ్రిటన్ వీసా లభిస్తుందనే ఆశించారట. అయితే ఆమె పెళ్లికి నిరాకరించిందనే ఆక్రోశంతో ఆమెపై కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మైరా జుల్ఫీకర్ హత్యలో అమీర్ భట్ హస్తం ప్రధానంగా ఉందని పోలీస్ అధికారి సిద్రా ఖాన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్‌లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ అధికారులు కూడా ఆరా తీశారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు -
నిన్ను డైరెక్టర్ చేస్తా.. ఆపై పెళ్లి చేసుకుంటా
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులోని గేటెడ్ కమ్యూనిటీల్లో హౌస్ కీపింగ్ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నానని నమ్మించి.. అవసరార్థం వ్యాపార విస్తరణ, వైద్యావసరాల కోసమంటూ ఓ వితంతును వంచించి రూ.మూడు లక్షల వరకు కొల్లగొట్టిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ బి.ప్రకాష్ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన రాజ్‌వన్స్ ఇండియన్ మేనేజ్మెంట్ స్టడీ పూర్తయ్యాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఆ తర్వాత మైనింగ్‌తో పాటు టీకప్‌ల తయారీ పరిశ్రమను నిర్వహించాడు. అయితే ఈ వ్యాపారాల్లో నష్టం రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయకులను మోసగించి డబ్బులు సంపాదించేందుకు ఓ ఆన్లైన్ డేటింగ్ సైట్లో తన వివరాలు నిక్షిప్తం చేశాడు. అయితే 2019 మార్చి నుంచి ఓ వితంతువు రాజ్‌వన్స్‌తో పరిచయం పెంచుకుంది. ఈ సమయంలో తనకు కూడా విడాకులయ్యాయని, అయితే బెంగళూరులో బాగా లాభాలు చేకూర్చే హౌస్ కీపింగ్ సంస్థను నిర్వహిస్తున్నానంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన కంపెనీలో డీలర్షిప్, డైరెక్టర్‌షిప్‌తో పాటు మీ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మి తన వ్యాపార విస్తరణకు, వైద్యం కోసం డబ్బులు అవసరమంటూ చెప్పడంతో బాధితురాలు దఫాదఫాలుగా రూ.మూడు లక్షలు రాజ్‌వన్స్ పంపిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత నుంచి అతడు స్పందించలేకపోవడంతో మోసపోయానని తెలిసి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీ సులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక సాక్ష్యాలతో నిందితుడు రాజ్‌వన్స్‌ను బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు. చదవండి: ఉద్యోగం ముసుగులో వ్యభిచారం -
'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి'
కరాచీ: పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ షాహిన్ అఫ్రిది.. ఆ జట్టు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇంటి అల్లుడిగా అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్రిది పెద్ద కూతురు అక్సాను షాహిన్‌కు ఇచ్చి చేయనున్నారని.. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందనే పుకార్లు కూడా ఉన్నాయి. షాహిన్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ షాహిద్ కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చారని.. అందుకు వారి కుటుంబం అంగీకరించారంటూ కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. ఈ విషయంపై షాహిద్ తన ట్విటర్లో స్పందించాడు. ''వారు సంప్రదించిన మాట నిజమే.. కానీ ఇంకా చర్చల దశలోనే ఉంది.'' అంటూ తెలిపాడు. ఇదిలా ఉండగా.. కాబోయే మామ, అల్లుడిపై మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా షాహిద్ అఫ్రిది ముల్తాన్ సుల్తాన్‌కు, షాహిన్ అఫ్రిది క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఒక మ్యాచ్ సందర్భంగా.. షాహిన్ వేసిన ఒక ఓవర్లో షాహిద్ అఫ్రిది సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే అఫ్రిది షాహిన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ సన్నివేశాన్ని అభిమానులు తమదైన శైలిలో మీమ్ చేశారు. బాలీవుడ్ హిట్ సినిమా దుల్హే రాజాలోని ''సునో సస్రూజీ అబ్ జిద్ చాడో'' అంటూ సాగిన పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టారు. ''మామా.. ఇప్పటికైనా మీ మొండితనాన్ని వదిలేయండి'' అనేది ఈ పాట అర్థం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది నిశ్చితార్థం! sound on🔊#ShaheenAfridi #ShahidAfridi pic.twitter.com/ExRtP43UEx — Zakria (@Zakr1a) March 6, 2021 -
అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది నిశ్చితార్థం!
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ అఫ్రిది త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురు క్రికెటర్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే పాకిస్తానీ లోకల్ మీడియా అందించిన వివరాలు ప్రకారం.. షాహిద్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ పెళ్లి విషయమై షాహిద్ కుటుంబం వద్ద ప్రస్తావించారని..అందుకు వారు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే షాహిన్ ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడని.. మా కూతురు అక్సా ఇంకా చదువుతుందని.. ఇప్పట్లో ఎంగేజ్మెంట్ ప్రస్తావన లేదని ఆఫ్రిది కుటుంబవర్గం తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని.. వారి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదంటూ ట్విటర్లో వార్తలు వచ్చాయి. దీనిపై పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్ స్పందిస్తూ.. ‘షాహిన్ ఆఫ్రిది, అక్సా అఫ్రిది నిశ్చితార్థం నిజమే.. రూమర్లు కాదని.. ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయి. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. అయితే పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగనుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా షాహిన్ అఫ్రిదితో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. షాహిన్ లాహోర్ క్యూలాండర్స్‌కు.. షాహిద్ అఫ్రిది ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా షాహిన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: వారు సహకరిస్తే బాగుండు.. సుందర్ తండ్రి ఎమోషనల్ దేవుడా.. పెద్ద గండం తప్పింది The reason behind this tweet is to clarify the suspicion caused by social media. Respect to both families; please do await their own official announcements as they are currently in talks.I would like to request all individuals to respect their privacy during this auspicious time. https://t.co/65IRygDxUw — Ihtisham Ul Haq (@iihtishamm) March 6, 2021 -
అది పోవాలంటే రాహుల్ పెళ్లి చేసుకోవాలి: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కులతత్వం పోవాలంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ దళిత మహిళను పెళ్లి చేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సలహా ఇచ్చారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. రాహుల్ ఇచ్చిన నినాదం ‘హమ్ దో హమారే దో’ ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్లో వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అథవాలే తప్పుపట్టారు. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ‘హమ్ దో హమారే దో’ అనే నినాదం గురించి ఆయన మాట్లాడుతున్నారని, నిజానికి ఈ నినాదం గతంలో కుటుంబ నియంత్రణ గురించి వాడేవారని గుర్తుచేశారు. అందుకే ముందుగా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయన దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆయన మహాత్మా గాంధీ కలలను నిజం చేసినవాడవుతాడని పేర్కొన్నారు. ఆయన పెళ్లితో కులపిచ్చికి అంతం పలకవచ్చు అని పేర్కొన్నారు. ఇలా చేస్తే దేశ యువతకు రాహుల్ మార్గనిర్దేశకుడు అవుతారని ఎద్దేవా చేశారు. గతంలోనూ మంత్రి అథవాలే రాహుల్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ గాంధీ కులాంతర వివాహం చేసుకుంటే, ఆయనకు కులాంతర వివాహం పథకం కింద రూ.2.5 లక్షలు ఇస్తానని తెలిపారు. -
తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్
బాలీవుడ్ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్‌ప్రీత్ సింగ్ వివాహం అక్టోబర్ 24న స్వల్ప అతిథుల మధ్య ఘనంగా జరిగింది. అయితే మరీ ఇంత తొందరగా పెళ్లి చేసుకునేందుకు రోహన్ రెడీగా లేరట. కానీ ఓ రోజు మాత్రం పూటుగా మద్యం తాగి పెళ్లి చేసుకుందాం అని తన ప్రియురాలు నేహాకు మెసేజ్ పెట్టాడట. మొదట దీన్ని నేహా నమ్మలేదట, కానీ తర్వాత నమ్మక తప్పలేదు. మరి ఇంతలోనే అంత మార్పు రావడానికి కారణమేంటో నేహా మాటల్లోనే తెలుసుకుందాం.. పెళ్లి కుదరదన్నాడు "ఓ రోజు షూటింగ్ పూర్తయ్యాక రోహన్ నా స్నాప్‌చాట్ ఐడీ అడిగాడు. అలా మా మధ్య మాటలు కలిశాయి. ప్రేమ పాఠాలు కూడా నడిచాయి. జీవితంలో సెటిల్ అవ్వాల్సిన సమయం వచ్చిందనిపించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దీనికి అతడు ససేమీరా ఒప్పుకోలేదు. నాకింకా పాతికేళ్లే.. అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరం మాట్లాడుకోవడమే మానేశాం. అలా కొంతకాలం గడిచింది. సడన్‌గా ఓ రోజు నేహూ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పాడు. నాకెందుకో నమ్మాలనిపించలేదు" (చదవండి: రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!) తాగిన మత్తులో ప్రపోజ్ చేశాడనుకున్నా "ఎందుకంటే అప్పుడే రెండు, మూడు బీర్లు తాగాడు. తాగిన మత్తులో ఇలాంటి డైలాగులు కొడుతున్నాడు, కానీ తెల్లారేసరికి మర్చిపోతాడు అని లైట్ తీసుకున్నాను. తర్వాతి రోజు నేను షూటింగ్ కోసం ఛండీఘర్ వెళ్లాను. రోహన్ అక్కడ నా రూమ్‌కు వచ్చి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? అని అడిగాడు. నువ్వు తాగితే నేనెందుకు మర్చిపోతాను అని చెప్పాను. కానీ ఆ క్షణమే అర్థమైంది. రోహన్ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యాడని! వెంటనే నేను మా అమ్మతో మాట్లాడమని చెప్పాను. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అని నేహా చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య నెట్టింట నేహా బేబీ బంప్ ఫొటోలు దర్శనమివ్వడంతో ఆమె తల్లి కాబోతుందంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే అదంతా లేటెస్ట్ సాంగ్ 'ఖ్యాల్ రఖ్యా కర్' కోసమేనని తెలియడంతో అభిమానులు అవాక్కయ్యారు. డిసెంబర్ 22న విడుదలైన ఈ సాంగ్ జనాలను ఆకట్టుకుంటోంది. (చదవండి: నేహా కక్కర్-రోహాన్ ప్రీత్‌సింగ్‌ల పెళ్లి) -
సిడ్నీ నగరంలో... సిగ్గే పడుతూ...
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సుదీర్ఘ కాలంగా మైదానంలో ఉన్న వైరంపై సాగిన చర్చలోనే వారిద్దరి మధ్య పరిచయం, ఆపై స్నేహం మొదలైంది. అది అలా పెరిగి ప్రేమగా మారింది. అయితే తర్వాతి అడుగు వేసేందుకు ఇద్దరూ వెనుకాడుతున్న వేళ... అబ్బాయే కాస్త చొరవ చూపించాడు. పెళ్లి ప్రతిపాదన చేసేందుకు తాము ఇష్టపడే క్రికెట్ స్టేడియంకంటే సరైన వేదిక... అందులోనూ భారత్–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌కు మించిన సందర్భం ఏదీ లేదని భావించాడు. అందుకే వేల మంది ప్రేక్షకుల సమక్షంలో మోకాలిపై కూర్చొని తన మనసులో భావాన్ని వెల్లడించాడు. అటు గ్యాలరీల్లో ప్రేక్షకులు, ఇటు టీవీల్లో లక్షల మంది చూస్తుండగా అమ్మాయీ ‘ఎస్’ అనేసింది. క్రికెటర్లు మొదలు కామెంటేటర్ల వరకు అందరూ ఆ జోడీని అభినందిస్తూ ఆశీర్వదించారు! బెంగళూరుకు చెందిన దీపేన్ మాండలియా ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే జెట్‌స్టార్ సంస్థలో ప్రాజెక్ట్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మెల్‌బోర్న్‌కే చెందిన రోజ్ వింబుష్‌ని అతను ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తున్నాడు. ‘ఆమె కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించింది కానీ నాకు అంతకంటే సరైన సమయం లేదనిపించింది’ అని దీపేన్ చెప్పగా... ‘నిజంగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయా. కానీ ఇది నన్ను చాలా ఆనందంలో ముంచెత్తింది’ అని రోజ్ స్పందించింది. ఈ ఘటన తర్వాత ఇద్దరి ఫోన్లు ‘కంగ్రాట్స్’ మెసేజ్‌లతో హోరెత్తిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
పెళ్లికి నిరాకరించిందని నటిపై కత్తితో దాడి
ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాల్వీని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని యోగేశ్‌కుమార్ మహిపాల్ సింగ్‌గా గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉత్తర ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీపై నిందితుడు యోగేశ్ కుమార్ కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్లో యోగేశ్ కుమార్ తనకు ఏడాదిగా తెలుసని.. ఇద్దరం స్నేహితులమని తెలిపింది. ఈ క్రమంలో యేగేశ్ మాల్వీని వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక అతడితో మాట్లాడటం మానేసింది’ అని తెలిపారు. (చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ) ఈ నేపథ్యంలో సోమవారం కేఫ్ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీని యోగేశ్ అడ్డగించాడు. ఎందుకు తనతో మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని.. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఇక యోగేష్.. ఫేస్బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యాడని పోలీసులు వెల్లడించారు. తనను తాను నిర్మాతగా చెప్పుకుని మాల్వీతో పరిచయం ఏర్పరచుకున్నాడన్నారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. -
పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్ చెయ్!
లండన్ : ఏ పని చేసినా.. అందులో తమ ప్రత్యేకతను చాటుకుంటారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ఈ స్టోరీలోని ప్రేమికుడు. తన ప్రియురాలిని ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్, గ్రేట్ యార్మౌత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రేట్ యార్మౌత్కు చెందిన 33ఏళ్ల స్మిటెన్ బ్రూనో నివెస్ తన ప్రియురాలు పాట్రికా కలాడో 34ను పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు. అయితే తన పెళ్లి ప్రపోజల్‌ను ఎలా ఆమెకు చెప్పాలో తెలియలేదు. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ ఓ ట్యాటూలు వేసే షాపు దగ్గరకు వెళ్లారు. పాట్రికా బయట ఉండగా.. స్మిటెన్ లోపలికెళ్లి ట్యాటూ వేయించుకోసాగాడు. ( పార్లమెంటులో పోర్న్ ఫొటోలు చూసిన ఎంపీ ) స్మిటెన్, పాట్రికాల జంట ఓ 45 నిమిషాల తర్వాత బయటకొచ్చిన స్మిటెన్ ఆమె దగ్గరకెళ్లి తన ఛాతిపై ఉన్న ‘‘ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని రాసి ఉన్న అక్షరాలను చూపించాడు. ఆ అక్షరాల కింద ఎస్, నో అన్న రెండు గడులు కూడా ఉన్నాయి. ‘ పెళ్లికి ఓకే అంటే ఇక్కడ టిక్ చేయ్!.. లేదంటే..’ అన్నాడు. మొదట ఏమీ అర్థంకాక చూస్తూ ఉండిపోయిన ఆమె ఆ వెంటనే తేరుకుని ఎస్ అని ఉన్న గడి మీద పెన్నుతో రాసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, ఇద్దరికీ ఇది వరకే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ భాగస్వాములతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. వచ్చే ఆగస్టులో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. -
వర్జిన్, వెజిటేరియన్ అంటూ పెళ్లి ప్రపోజల్
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ తిలోత్తమ షోమ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందుకు నటి షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ కారణంగా నిలిచింది. ఇటీవల తిలోత్తమకు తనను పెళ్లి చేసుకుంటానంటూ ఓ వ్యక్తి నుంచి వింతైన ప్రపోజల్ వచ్చింది. అయితే ఈ ప్రపోజల్ ఏ గులాబి పువ్వుతోనో, ప్రేమ లేఖ ద్వారానో కాదు. సోషల్ మీడియాలో మెసేజ్ ద్వారా తిలోత్తమ అంటే ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కోరాడు. ‘ఐ లవ్ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. జీవితాంతం మీతో కలిసి ఉంటాను. నేను వర్జిన్. అలాగే వెజిటేరియన్ కూడా. అంతేగాక లై- డిటెక్టర్, నార్కో టెస్టు, వర్జినిటి, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ మెసేజ్ చేశారు. (‘అంతకంటే ముందు నేను ఓ పని చేయాలి’) View this post on Instagram ये कैसा शाकाहारी मज़ाक हैं भाई? No thanks. Bye bye Tata bata alvida। A post shared by Tillotama Shome (@tillotamashome) on Jul 5, 2020 at 11:27pm PDT దీనిపై స్పందించిన తిలోత్తమ ‘బ్రదర్ జోక్‌గా ఉందా.. అవసరం లేదు ధన్యవాదాలు.. బై బై’ అంటూ ఈ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక ఈ పోస్టుపై నటి ఇషా చోప్రా కామెంట్ చేశారు. తనకు కూడా ఇలాంటే మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. కాగా ‘మాన్సూన్ వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన తిలోత్తమ షోమ్ అంతకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. చివరగా ఆంగ్రేజీ మీడియంలో కనిపించారు. (‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’) -
రవీనా.. నన్ను పెళ్లి చేసుకుంటారా?
పలు భాషల్లో నటిస్తూ అగ్రకథానాయికగా వెలుగొందిన నటి రవీనా టండన్. 2004లో సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె చాలా తక్కువ సినిమాల్లో నటించింది. పిల్లలు (దత్తత తీసుకుంది), కుటుంబం అంటూ కెరీర్‌కు సరైన ప్రాధాన్యతనివ్వలేదు. అయితే కొన్నాళ్ల నుంచి ఆమె తిరిగి ఫార్మాట్లోకి వచ్చింది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా వుంటే అప్పటికీ ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. "రవీనా టండన్ తన ఫస్ట్ క్రష్" అని బాహుబలి హీరో ప్రభాస్ కూడా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. (శానిటైజర్‌తో సీట్లను తుడిచిన స్టార్ నటి!) తాజాగా ఆమె గతంలో వేసవి కాలంలో మంచు ప్రదేశాల్లో సేద తీరుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలకు మంత్రముగ్ధులైన అభిమానులు "మేడమ్ సార్.. మేడమ్ అంతే.." అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో అభిమానైతే ఓ అడుగు ముందుకేసి "రవీనా మేడమ్.. వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా?" అని మనసులో మాటను కక్కేశాడు. దీనికి నటి స్పందిస్తూ.. "మన్నించాలి, ఇప్పటికే ఏడుగురికి బుక్ అయిపోయింది" అంటూ వచ్చే జన్మ కూడా ఖాళీగా లేదని అర్థం వచ్చేలా సరదాగా సమాధానమిచ్చింది. ఆమె చమత్కార శైలికి ఆశ్చర్యపోయిన అభిమానులు 'ఆమె ఎప్పటికీ క్వీన్' అంటూ కితాబిస్తున్నారు. (ప్రభాస్ సీక్రెట్ క్రష్.. ఓ బాలీవుడ్ హీరోయిన్!) -
వెరైటీ ప్రపోజల్: వెంటనే పెళ్లి కూడా ఖరారు
బెర్లిన్: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. అయితే ప్రేమను వ్యక్తపరిచే కళ అందరికీ ఉండదు. ఎన్నెన్నో అనుకున్నా ఎదురుగా ప్రేయసి/ ప్రేమికుడు తారసపడేసరికి మాత్రం నోరు మూగబోతుంది. అందుకే కొందరు నేరుగా కాకుండా మెసేజ్‌లోనో, కాల్ చేసో, ఉత్తరం రాసో, ఫ్రెండ్ ద్వారానో ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ మనసులోని మాటను ఇష్టసఖికి చేరవేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తను ప్రేమించిన అమ్మాయికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు.(ప్రేమకు అసలైన నిర్వచనం ప్రేమలేఖలే) జర్మన్‌కు చెందిన స్టీఫెన్ స్క్వార్జ్ తన ప్రేమను గెలిపించుకోడానికి పొలాన్నిమార్గంగా ఎంచుకున్నాడు. పొలంలో మొక్కజొన్న పంటను యంత్రసహాయంతో ఒక క్రమపద్ధతిలో నాటాడు. అది ఏరియల్ వ్యూ ద్వారా చూస్తే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని జెర్మన్ భాషలో కనిపిస్తుంది. ఇది అక్కడి జనాలను ఎంతగానో అబ్బుపరిచింది. ఈ ప్రపోజల్ సరాసరి గూగుల్ మ్యాప్‌లో ప్రత్యక్షం కావడమే ఈ ఆశ్యర్యానుభూతులకు ప్రధాన కారణం. ఇక అనతికాలంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతమందికి నచ్చాక ప్రేయసి పడిపోకుండా ఉంటుందా.. ఈ స్పెషల్ ప్రపోజల్‌తో అతని ఒళ్లో వాలిపోవడమే కాదు.. ఏకంగా జూన్‌లో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారీ జంట. (కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు!) చదవండి: గర్భిణీకి కరోనా, మరి శిశువుకు? -
పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్
ఆదాశర్మ పెళ్లికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. తనకో పెళ్లి కొడుకు కావాలంటూ పెళ్లి కూతురు గెటప్‌లో తయారై ఉన్న ఫోటోను షేర్ చేశారు. కాకపోతే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే వాడు ఎలా ఉండాలనే విషయంలో కొన్ని షరతులను విధించింది. 'అతను ఉల్లిపాయలు తినకూడదు. కులం, రంగు, మతం, కండలు తిరిగిన దేహం, స్విమ్మింగ్, వీసా, జాతకం లాంటి విషయాలు పట్టించుకోను. కాకపోతే అతను మూడు పూటలా నవ్వుతూ వండిపెట్టాలి. ఇంట్లో జీన్స్ ధరించినా పర్లేదు కానీ బయటకు వెళ్లేటప్పుడు మాత్రం భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. నేనే స్వయంగా రోజుకు 5లీటర్ల మంచినీరు అందిస్తా.. కానీ ఇంటా బయట మద్యం, మాంసాహారం ముట్టుకోవద్దు. క్రమం తప్పకుండా షేవ్ చేసుకోవాలి. అలాగే అతనికి భారతదేశంలోని అన్ని భాషా చిత్రాల మీద గౌరవం కలిగి ఉండాలి' అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆదాశర్మ చేసిన ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆదా ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో, ఆమె పెట్టిన షరతులను చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆదాశర్మ ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆదా కమాండో 3, బైపాస్ రోడ్, మ్యాన్ టు మ్యాన్ హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. WANTED : Groom who does'nt eat onions.Caste, colour, religion, shoe size, visa, swimming abilities, bicep size, instagram followers, horoscope no bar He should be willing to cook 3 times a day with a smiling face and shave regularly. Cont'd... pic.twitter.com/rqYh1dzFGv — Adah Sharma (@adah_sharma) September 21, 2019 -
కత్రినా.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. పెళ్లి చేసుకో!
‘కత్రినా.. నిన్ను నేను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నన్ను పెళ్లి చేసుకో. నీ నెంబర్ ఇవ్వు’ .. ఇది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్. ఓ వెబ్ షోలో పాల్గొన్న కత్రినా ఈ ట్వీట్‌కు పాజిటివ్‌గా స్పందిస్తూ.. ‘ ఈ రోజుల్లో కూడా ఇంతటి బలమైన భావోద్వేగాలు గల మనుషులు ఉన్నారని తెలియడం ఆనందం కలిగిస్తోంది. ఈ రోజుల్లో అందరూ పరిస్థితులకు అనుగుణంగా ఉండిపోతూ.. ఏదీ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. నటుడు ఆర్బాజ్ ఖాన్ నిర్వహించే వెబ్ షో ‘పించ్’లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో నటులు, సెలబ్రిటీలపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్లు వారికి చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో వచ్చిన పెళ్లి ప్రతిపాదనను చూపించగా.. కత్రినా ఒకింత ఉద్వేగంగానే స్పందించారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడారు. రణ్‌బీర్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత సింగిల్‌గానే ఉంటున్న ఆమె.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఏమో ఐడియా లేదు. ఒకరోజు పెళ్లి చేసుకుంటాను. జీవితం ఊహించలేనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు’ అని బదులిచ్చారు. వైవాహిక వ్యవస్థపై నమ్మకముందా? అని ప్రశ్నించగా.. ‘ఒక వ్యక్తిగా నాకు పెళ్లి, పిల్లలపై నమ్మకముంది. ఒకరోజు నేను పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపారు. -
భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో మ్యారేజ్ ప్రపోజల్
లండన్ : లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని తన గర్ల్‌ఫ్రెండ్‌కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఈ చర్యతో కాసింత సిగ్గుపడిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్‌ను అంగీకరించింది. అతడు ఇచ్చిన రింగ్‌ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి. కామెంటేటర్స్ కూడా దీనిపై తమదైన శైలిలో స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్ చాహల్ కూడా క్లాప్స్ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఆ వ్యక్తి ప్రపోజ్ చేసిన సమయంలో ‘డెసిషన్ పెండింగ్’ అంటూ.. ఆమె అతని ప్రపోజల్ అంగీకరించిన తర్వాత ‘షీ సెడ్ యస్’ అంటూ టీవీ స్ర్కీన్‌పై ప్లాష్ నిచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ ప్రపోజల్‌ను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరిని కామెంటేటర్స్ బాక్స్‌లోకి పిలిచిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ అధికారులు వారికి చిన్నపాటి బహుమతి కూడా అందజేసినట్టు సమాచారం. గతంలో కూడా క్రికెట్ మ్యాచ్‌లు జరగుతున్న సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. -
మ్యాచ్‌లో మ్యారేజ్ ప్రపోజల్..వైరల్!
-
సల్మాన్ పెళ్లి చేసుకుంటా అని అడిగితే..
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల బంధం ఓపెన్ సీక్రెట్. చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో కానీ 2009లో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ చెప్పుకుని వేరే పెళ్లిళ్లు చేసుకున్నారా? అంటే అదీ లేదు. మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌గా సల్మాన్ ఖాన్ ఉండగా.. ఇటు మాజీ ప్రేయసి కత్రినా కూడా పెళ్లి ప్రస్తావ ఏమీ లేకుండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికీ వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగానే మెలుగుతున్నారు కూడా. సల్మాన్‌తో డేటింగ్లో ఉండగానే కత్రినాను కరణ్ జోహార్ తన చాట్ షోలో ఓ ప్రశ్న అడిగారు. ఒకవేళ సల్మాన్ తనను పెళ్లి చేసుకోమని అడిగితే ఏం చెబుతావ్ అని కరణ్ కత్రినాను ప్రశ్నించారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం కాస్త దిమ్మతిరిగేలానే ఉంది. ‘ఇది చాలా అన్యాయం. నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నాను పూర్తిగా మోసం’ అంటూ సమాధానమిచ్చారు. అయితే ఇలా సల్మాన్ తనను అడిగినప్పుడు ఉంటుందని అన్నారు. సల్మాన్, కత్రినాలు దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. చెట్టపట్టాలేసుకుని తిరిగారు. కానీ 2009లో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటూ అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. 2017లో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ గువహటిలో కత్రినా... సల్మాన్‌ను అందలానికి ఎత్తేశారు. సల్మాన్ చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. అదేవిధంగా సల్మాన్ కూడా కత్రినాకు తక్కువేమీ కాకుండా.. స్వీటెస్ట్ గర్ల్స్‌లో ఆమె ఒకరంటూ ప్రశంసలు కురిపించారు. టైగర్ జిందా హై సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లను వసూలు చేసింది. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనదీక్ష
కామేపల్లి: మండల పరిధిలోని పొన్నెకల్లు గ్రామపంచాయతీ పరిధిలోని బర్లగూడెం గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనదీక్ష చేపట్టిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కామేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్‌కు చెందిన అమ్మాయి భూక్య పద్మ, బర్లగూడెం గ్రామానికి చెందిన నూనావత్ కిశోర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కిషోర్ పాల్వంచ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పద్మ బీఈడీ చదువుతోంది. అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి ఒప్పుకొని కట్నంగా రూ.15 లక్షలు ఇస్తామని చర్చలు జరిపారు. కొంతకాలంగా కిశోర్ ముఖం చాటేయడంతోపాటు, వేరే సంబంధాలు చూస్తుండటంతో పద్మ కిషోర్ ఇంటి ఎదుట దీక్షను చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. -
పెళ్లి ఇష్టంలేక ప్రియుడు..మనస్తాపంతో ప్రియురాలు
మంచాల (ఇబ్రహీంపట్నం): విషం తాగి ప్రేమికులు వేర్వేరుగా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని యువతి తరఫు బంధువులు యువకుడిపై ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో గురువా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం డాకు తండాకు చెందిన అఖిల గత రెండు నెలలుగా ఎల్లమ్మ తండాలోని తమ బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఎల్లమ్మతండాకు చెందిన సపావట్ శ్రీకాంత్ ఆదిబట్లలోని టాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కుల పెద్దలు పెండ్లి చేయాలని ఇరువురి పిలిచి అడిగారు. అయితే శ్రీకాంత్ మాత్రం అఖిలను పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని చెప్పాడు. ఆమెను ప్రేమించావు గనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని యువతి తరఫు బందువులు శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో శ్రీకాంత్ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అఖిల కూడా విషం తాగింది. ఆమెను కూడా ఇబ్రహీంపట్నంలోని మరో ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇద్దరి ఆత్మహత్య లేఖలు లభ్యం ఆత్మహత్యకు ముందు అఖిల ఉత్తరం రాసింది. శ్రీకాంత్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. కానీ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొంది. తన మృతికి శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు కారణమంటూ వారి పేర్లు ఉత్తరంలో రాసింది. అదే విధంగా శ్రీకాంత్ కూడా ఆత్మహత్యకు ముందు లేఖరాశాడు. తన మృతికి అఖిల బంధువులే కారణమంటూ లేఖలో ఆరోపించాడు. తనకు ఇష్టం లేకున్నా అఖిలతో పెళ్లి చేసేందుకు ఆమె బంధువులు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. -
నన్నుపెళ్లి చేసుకుంటావా.?
ఇస్తాంబుల్: రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాకు వింత అనుభవం ఎదురైంది. ఈ మాజీ నెం1 ర్యాంకర్ మ్యాచ్ ఆడుతుండగా ఓ అభిమాని పెళ్లి ప్రపోజల్ చేశాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం స్టేడియంలో ఉన్న వారందరికీ నవ్వులు పూయించింది. ఐదు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న షరపోవా.. వచ్చే గ్రాండ్‌స్లామ్ సీజన్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇస్తాంబుల్‌లోని సినాన్ ఎర్దేం హాల్లో స్థానిక ప్లేయర్ కాగ్ల బైకుకాకేతో మ్యాచ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగింది. అప్పుడే బాల్ సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న షరపోవాను 'మరియా... నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ అభిమాని రష్యన్ భాషలో గట్టిగా అరిచాడు. దీనికి ఏమాత్రం విసుగు చెందని షరపోవా ఓ రెండు క్షణాలు ఆలోచించి...'ఏమో!' అని సమాధానమిచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
షరపోవాకు అభిమాని పెళ్లి ప్రపోజల్
-
పెళ్లంటూ చేసుకుంటే మోదీనే..
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లంటూ చేసుకుంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీనే చేసుకుంటానని ఓ మహిళ అంటుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెంది శాంతి శర్మ అనే 40 ఏళ్ల మహిళ గత నెల రోజులుగా(సెప్టెంబర్ 8 నుంచి) దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తోంది. మోదీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనను మోదీ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందని మీడియాకు ఆమె తెలిపింది. అంతేకాదు ఇక్కడి నుంచి తనను పంపిస్తే నేరుగా ఆయన ఇంటి ముందు ఆందోళన దిగుతానని చెప్పింది. శాంతి శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు 1989లో వివాహం జరిగింది. పెళ్లైయిన సంవత్సరానికే ఆమెను భర్త విడిచిపెట్టాడు. ఆ తరువాత ఆమెను చేసుకుంటామని చాలా మంది ముందుకొచ్చినా నిరాకరించింది. అయితే ప్రస్తుతం తాను నరేంద్ర మోదీని పెళ్లి చేసుకుని ఆయనకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నానని.. ప్రధాని సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. మోదీ తనను చేసుకుంటే తన ఆస్తి మొత్తం అమ్మి రెండు కోట్ల రుపాయలను కట్నంగా ఇస్తానని చెబుతోంది. ఇదివరకే మోదీకి యశోదా బెన్‌తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. పెళ్లైయిన కొద్ది కాలం నుంచే వారు వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం యశోదా బెన్ గుజరాత్‌లోని తన సొంత గ్రామంలోనే ఉంటున్నారు. -
కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్
సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో కోహ్లీకి క్రేజ్ మామూలు రేంజ్లో ఉండదు. ఎంత అంటే డానియెల్లి యాట్ సైతం విరాట్‌ను పెళ్లి చేసుకోమని కోరింది. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఈసారి పాకిస్తాన్ నుంచి వచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో తనను పెళ్లి చేసుకోమని ఓ పోస్టర్ పట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియా ట్విట్టర్లో వైరల్ అయింది. ఇక ఇటీవల పాకిస్తాన్లో ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు పర్యటించింది. ఇందులో ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు పాల్గొన్నారు. అయితే ఇందులో భారత్ నుంచి ఏఒక్కరు ఆడలేదు. దీంతో పాక్‌లోని కోహ్లీ, ధోని అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను వ్యక్త పరిచారు. భారత ఆటగాళ్లు కోహ్లీ, ధోని ఈ మ్యాచ్‌ల్లో ఆడుంటే పాకిస్తాన్ క్రికెట్‌కు మరింత ప్రభావం ఉండేదన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో చాలా మంది అభిమానులు 'వీ మిస్ ధోని, కోహ్లీ' అనే ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. అందులో ఒకరు 'కోహ్లి మేరీ మీ' ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు. -
ప్రియుడు మోసం చేశాడని.. కోసి పారేసింది!
న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివిగా అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని మంగోల్‌పురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రవి(35) ఓ చిరు వ్యాపారి. స్థానిక మంగోల్‌పురిలో నివాసం ఉండే 23 ఏళ్ల యువతిని గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో యువతి ఇతడిని పట్టించుకోలేదు. కానీ క్రమంగా వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంటకు పెళ్లి విషయంలో విభేదాలొచ్చాయి. యువతి తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించగా, ప్రియుడు రవి మాత్రం విషయం వచ్చేసరికి దాటవేసేవాడు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి యువతి ఇంటికి రవి వెళ్లగా.. పెళ్లి చేసుకోవాలంటూ యువతి గట్టిగా నిలదీసింది. మా ఇంట్లో వాళ్లు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తనని మరిచిపోవాలిని సూచించగా యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాలుగేళ్లుగా తనవెంట తిప్పుకుని మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇంట్లో వాళ్లకు కొద్దిసేపు బయటకు వెళ్లమని సూచించిన ఆ యువతి.. ఈ ఒక్కసారి తనతో శృంగారం చేస్తే పెళ్లి మాట ఎత్తనని ప్రియుడిని నమ్మించింది. చివరకు అతడిని నగ్నంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న చాకుతో ప్రియుడి పురుషాంగాన్ని కోసిపారేసింది. నొప్పిని భరించలేక అతడు సాయం చేయాలని అరుస్తూ బటయకు పరిగెత్తాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడు రవిని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సర్జరీ చేసిన వైద్యులు పేషెంట్‌ను జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. యువతి సహా ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన మంగోల్‌పురి పోలీసులు తెలిపారు. -
చార్మీని పెళ్లాడడానికి రెడీ...
నటి చార్మీని పెళ్లాడడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏంటీ నమ్మబుద్ధికా వడం లేదా? అయితే ఇది చదవండి. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న త్రిష గురువారం 33వ ఏటలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో నటి చార్మీ కూడా ఉంది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష. త్వరగా తిరిగి రా.. పార్టీ చేసుకుందాం. అలాగే నేను చేసిన పెళ్లి ప్రతిపాదనను ఈ ఏడాదైనా పరిగణనలోకి తీసుకో..’ అంటూ ట్విటర్లో చార్మీ ట్వీట్ చేసింది. త్రిష స్పందిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన రోజే సమ్మతం తెలిపాను. లవ్ యూ’ అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని గుర్తు చేస్తున్నా.. నెటిజన్లు తమదైన ప్రచారాలతో దుమ్ముదులుపుతున్నారు. కాగా పౌర్ణమి చిత్రంలో త్రిష, చార్మి కలిసిన నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారారు. త్రిష తన తల్లి ఉమాకృష్ణన్ తో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లింది. అక్కడే తన పుట్టినరోజును స్నేహితుల సమక్షంలో జరుపుకుంది. -
పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి
జగిత్యాల: పెళ్లికి అంగీకరించలేదని ఆగ్రహించిన యువకుడు బాలికపై కత్తితో దాడిచేసి గాయపరచిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను(16) పెళ్లి చేసుకోమని తరుచుగా వేధిస్తూండేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన రాకేష్ ఆదివారం ఉదయం ఒంటరిగా ఉన్న బాలికపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రాకేష్ పరారయ్యాడు. గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. -
ఆ సీనియర్ నటిని పెళ్లి చేసుకుంటాడట!
సినీ నటీమణులకు ఈ మధ్య సోషల్ మీడియాలో చిత్రమైన ప్రపోజల్స్ వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ యువకుడు బాలీవుడ్ అందాల నటి టిస్కా చోప్రాపై మనస్సు పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ట్విట్టర్లో బహిరంగంగా ప్రతిపాదన పంపాడు. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న 42 ఏళ్ల టిస్కా కూడా ఏం తక్కువ తినలేదు. ‘నేను పెళ్లికి రెడీ. వివరాలు పంపు. మా ఆయన కూడా ఎవరి కోసం నేను వెళుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు అంతకంటే సీనియర్ నటికి ట్విట్టర్లో పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ‘బాగ్ మిల్కా బాగ్’, ‘వీర్ జరా’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సీనియర్ నటీమణి దివ్యాదత్తాను పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. ట్విట్టర్లో అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ఆమెకు పెళ్లి ప్రతిపాదన పెట్టాడు కానీ.. వచ్చిరానీ ఇంగ్లిష్‌లో అతను ఏం చెప్పాడో ఎవరికీ అర్థం కాలేదు. ‘Divya Like you and I want to marry you very extraordinary amount Tume Hu Khus marry me I will swear’ అంటూ ట్వీట్ చేశాడు. అతని భావాల బట్టి ‘దివ్యా.. నువ్వు నాకు ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా.. ఒట్టు’ అని అన్నట్టు భావిస్తున్నారు. అయితే, అతడి ఇంగ్లిష్ అర్థం కాక సీనియర్ నటి దివ్యాదత్తా కూడా తికమక పడ్డారు. ‘ఏమంటున్నావు అన్నా.. కాస్తా అర్థమయ్యేట్టు చెప్పు’ అని ఆమె అడిగారు. ఇక, అతడి వచ్చిరానీ ఇంగ్లిష్ మీద నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లిష్ భాష ఇప్పుడే ప్రశాంతంగా చనిపోయిందని ఒకరు కామెంట్ చేయగా.. మీ మీద ధ్యాసతో ఏం టైప్ చేస్తున్నాడో తెలియక తప్పులు టైప్ చేసి ఉంటాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా గూగుల్ ట్రాన్స్‌లేటర్ పొరపాటే అయి ఉంటుందని ఒకరు.. కన్సోలేషన్ ప్రైజ్ కింద స్పోకెన్ ఇంగ్లిష్ బుక్ అతనికి కానుకగా ఇవ్వండని మరొకరు ఛలోక్తులు విసిరారు. @divyadutta25 @Armanma19175530 English just died a Peaceful death! — Shilpacious (@shilpa11m) October 21, 2016 -
నటికి సోషల్ మీడియాలో మ్యారేజ్ ప్రపోజల్!
ముంబై: సెలబ్రిటీలను పెళ్లిచేసుకునేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు కొందరు యువతులు తమ అభిమాన హీరో ఇంటి ఎదుట బైఠాయించి.. పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తుండటం మన గమనిస్తుంటాం. ఇక్కడ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ యువకుడు తన అభిమాన నటిని పెళ్లి చేసుకుంటావా అని సోషల్ మీడియాలో అడిగాడు. ఆ వివరాలిలా ఉన్నాయి. బాలీవుడ్ నటి టిస్కా చోప్రాకు ఓ వ్యక్తి సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. ఇందుకు టిస్కా చోప్రా కూడా స్పందిస్తూ.. ఆ అభిమానికి షాక్ ఇచ్చింది. మొదటగా పెళ్లి ప్రతిపాదనకు థ్యాంక్స్ చెప్పిన టిస్కా.. పూర్తి వివరాలు పంపించాలని అభిమానికి ఓ ట్వీట్ చేసింది. తన భర్తను ఈ పెళ్లి గురించి పర్మిషన్ తీసుకోవాలని, ఏ వ్యక్తి తనతో జీవితాన్ని కోరుకుంటున్నారో ఆయనకు తెలియాలి కదా అని చమత్కరించింది. టిస్కా నుంచి ఇలాంటి రిప్లై ఊహించని ఆ వ్యక్తి కంగుతిని ఉంటాడు. తారే జమీన్ పర్, కిస్సా, రహస్య మూవీలతో వెండితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న టిస్కా పలు టీవీ షోలతో పాటు కహానీ ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా లాంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'చట్నీ' అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉంది. -
పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..!
ఇస్లామాబాద్: పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో బుధవారం చోటుచేసుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబ్ కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్(19) అనే స్కూల్ టీచర్ పై కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ముందుగా యువతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె అంకుల్ తెలిపారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సదాఖత్ నేడు చనిపోయిందని తెలిపారు. సదాఖత్ ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్ గా పనిచేస్తుందని, ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు. పెళ్లికొడుకు వయసు తనకంటే రెట్టింపు ఉందని, అతడు అది వరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీస్ అధికారి మజార్ ఇక్బాల్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
విద్యార్థిని మొహంపై యాసిడ్ పోశాడు
కోల్కత్తా : నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు కాలేజీ విద్యార్థి వెంట పడ్డాడు. సదరు యువకుడి ప్రతిపాదనను విద్యార్థి తిరస్కరించింది. అంతే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌తో ఆమె మొహంపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది... స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి ఎ.రవీంద్రనాథన్ తెలిపారు. నిందితుడు అభి షా (25)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. అయితే తనను పెళ్లి చేసుకోవాంటూ గత కొంత కాలంగా నిరుద్యోగి అభి షా కాలేజీ విద్యార్థి వెంట పడుతూ తరచు వేధించేవాడని రవీంద్రనాథన్ చెప్పారు. నిందితుడు అభి షాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
పెళ్లి పేరుతో వైద్యురాలికి రూ. 48 లక్షలు టోకరా
న్యూఢిల్లీ: పెళ్లి పేరుతో ఓ మహిళా డాక్టర్‌ను మోసం చేసి ఆమె నుంచి 48 లక్షల రూపాయలు కాజేశారు. హైదరబాద్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆర్నెళ్ల క్రితం అభిషేక్ మోహన్ అనే వ్యక్తి తాను ఇంగ్లండ్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానని, తగిన వధువు కావాలని ఓ వెబ్సైట్లో వివాహ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ మోహన్‌తో సంప్రదించింది. భారత్ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడినని మోహన్ ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత రోజూ ఆన్లైన్లో చాటింగ్ చేసుకునేవారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్ ఫోన్ నెంబర్లతో పాటు భారత్‌కు చెందిన ఓ సిమ్‌తో మాట్లాడేవాడని మహిళా డాక్టర్ చెప్పింది. డిస్కౌంట్ ధరతో వైద్య పరికరాలు కొన్నానని, ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సహకరించినందుకు ఇరాక్ ప్రభుత్వం బంగారు నగలను బహుమతిగా ఇచ్చిందని మోహన్ చెప్పాడు. వీటి విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని తెలిపాడు. భారత్‌లో ఉన్న తన బంధువులపై నమ్మకంలేదని, మహిళా డాక్టర్ ఇంటికి పంపుతానని చెప్పాడు. గత ఏప్రిల్ 7న మహిళా డాక్టర్‌కు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకున్న ఆ వ్యక్తి.. మోహన్ పంపిన వస్తువులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాయని, వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉన్నందున పన్ను కట్టాలని చెప్పాడు. అభిషేక్ మహిళా డాక్టర్‌కు ఫోన్ చేసి కస్టమ్స్ ఫీజు కట్టాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె 20 లక్షల రూపాయలను ఓ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత వేర్వేరు పన్నుల పేరుతో మహిళా డాక్టర్ నుంచి మరో 28 లక్షలు వసూలు చేశారు. ఆమె తన స్నేహితుల దగ్గర కొంత, బ్యాంక్‌లో లోన్ చేసి ఈ మొత్తం చెల్లించింది. ఆ తర్వాత అభిషేక్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా అలాంటి పార్సిల్ ఏమీ రాలేదని చెప్పారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్‌కు బదిలీ చేశారు. ఢిల్లీ పోలీసులు విచారణ జరిపి గుర్గావ్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అభిషేక్ మోహన్‌గా ప్రకటన ఇచ్చిన వ్యక్తి పెళ్లి పేరుతో చాలా మంది అమ్మాయిలతో పరిచయం చేసుకున్నాడని, ఏదో కారణం చెప్పి డబ్బు కావాలంటూ కొందరి ప్రపోజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. -
'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు'
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారాలపట్టి 16 ఏళ్ల మలియా ఒబామాకు ఊహించని ప్రపోజల్ వచ్చింది. ఒబామా కూతురు తనను పెళ్లి చేసుకుంటే 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు కన్యాశుల్కంగా ఇస్తానని కెన్యాకు చెందిన లాయర్ ఫెలిక్స్ కిప్రోనొ చెబుతున్నాడు. విషయం ఏంటంటే ఫెలిక్స్ ఒబామా పెద్ద కూతురు మలియాతో వన్ సైడ్ లవ్ లో పడ్డాడు. మలియాను పేళ్లి చేసుకోవడమే తన ఆశయమని చెబుతున్నాడు. వచ్చే జూలైలో కెన్యా పర్యటనకు వెళ్లనున్న ఒబామాను స్వయంగా కలసి పెళ్లి విషయం మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని ఫెలిక్స్ అన్నాడు. తన ప్రేమ నిజమైనదని, ప్రేమకు డబ్బు ముఖ్యం కాదని ఈ యువ లాయర్ అంటున్నాడు. ఒబామా గనక తమ పెళ్లికి అంగీకరిస్తే కెన్యా సంప్రదాయరీతిలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 2008లోనే ఫెలిక్స్ మహాశయుడు మలియాతో ప్రేమలో పడ్డాడట. అప్పటి నుంచి తాను ఏ అమ్మాయితోనూ డేటింగ్ చేయలేదని చెప్పాడు. తన ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పానని, కన్యాశుల్కం ఇచ్చేందుకు సాయం కూడా చేస్తానన్నారని తెలిపాడు. ఒబామా కెన్యా పర్యటనకు వచ్చినపుడు తన ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తానని అంటున్నాడీ వీర ప్రేమికుడు. కెన్యా పర్యటనకు మలియాను కూడా వెంట తీసుకురావాల్సిందిగా ఒబామాకు లేఖ రాస్తానని వివరించాడు. తమది సాధారణ కుటుంబమని, పాలు పితకడం, ఉగాలి (కెన్యా వంటకం) వండటం గురించి మలియాకు నేర్పుతానని అప్పుడే కలలు కంటున్నాడు. -
పెళ్లికి ఒప్పుకోలేదని నిప్పంటించిన మృగాడు
మృతి చెందిన యువతి ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం వేంసూరు : యువతి పెళ్లికి నిరాకరించటంతో ఓ మృ గాడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన సంఘటన సోమవారం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామానికి చెందిన కండెల్లి బాబూరావు, దేవమణిల కుమార్తె జయమౌనిక(19) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కొక్కెరగడ్డ మనోజ్‌కుమార్ జయమౌనికను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆమె నిరాకరించింది. సహనం కోల్పోయిన మనోజ్‌కుమార్ మార్చి 10న ఇంట్లో ఎవరూలేని సమయంలో జయమౌనికపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు వైద్యం కోసం సత్తుపల్లికి తరలిం చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జయమౌనిక ఆదివారం మృతి చెందింది. జయమౌనిక వైరాలోని ఓ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో వరుసకు బంధువు అయిన మనోజ్‌కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తల్లి దేవమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం డీఎస్పీ జి.కవిత, సత్తుపల్లి రూరల్ సీఐ మోహన్‌రావులు దుద్దేపూడి గ్రామంలో విచారణ జరిపారు. -
పెళ్లి చేసుకోమన్నందుకు విషం తాగించాడు..
నారాయణపేట : రెండేళ్లపాటు ప్రేమిస్తున్నానంటూ వెంటతిరిగాడు... తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చే సరికి విషం తాగమన్నాడు. బలవంతంగా ఆమెకు పురుగులమందు తాగించి పరారయ్యాడు. వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల తండాకు చెందిన పేరపళ్ల గురుమూర్తి అనే యువకుడు.. అదే తండాకు చెందిన యువతితో రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వారి పొలాలు తండాకు దగ్గరలో పక్కపక్కనే ఉన్నాయి. సదరు యువతి ఇటీవల గురుమూర్తి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా మొహం చాటేశాడు. ఆమె ఈ విషయమై గట్టిగా నిలదీస్తుండటంతో తప్పించుకునేందుకు ఆదివారం రాత్రి పథకం ప్రకారం పొలంలోకి తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చిన పురుగులమందును ఆమెకు బలవంతంగా తాగించి పరారయ్యాడు. ఆ యువతి కేకలు వేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాధితురాలిని సోమవారం ఉదయం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య చికిత్సల అనంతరం యువతి కోలుకుంది. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకొని యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రంగనాయకులు మంగళవారం తెలిపారు. -
మ్యారేజ్ ప్రపోజల్....365 రోజులు
ఫోనిక్స్: తొలిచూపులోనే చాలా మంది ప్రేమిస్తారు. తాము ప్రేమించిన అమ్మాయికిగానీ, అబ్బాయికీగానీ ఆ విషయాన్ని ఎలా బలంగా చెప్పాలో తెలియక తబ్బిబ్బవుతారు. తత్తరపడతారు. అలాగే అమెరికాలోని ఆరిజోన రాష్ట్రానికి చెందిన డీన్ స్మిత్ అనే అబ్బాయి, జెన్నీఫర్ కెసెల్ అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలా ? అని సుదీర్ఘంగా ఆలోచించాడు. తానుచేసే పెళ్లి ప్రతిపాదన కొత్తగానూ గమ్మతుగాను ఉండాలని అనుకున్నాడు. ‘జె న్నీఫర్, విల్ యూ మ్యారీ మీ’ అని అడుగుతూ తెల్లటి కార్డుబోర్డుపై తన ప్రతిపాదనను రాశారు. అలా ప్రతిరోజూ ఆ బోర్డును వివిధ భంగిమల్లో , వివిధ చోట్ల పట్టుకొని వీడియో తీయించుకున్నాడు. అలా వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, ఏకంగా ఏడాది కాలం...అంటే 365 రోజులు అలా చేస్తూ వాటిని వీడియోలో బంధించాడు. ఈ విషయం జెన్నీఫర్ కెసెల్కు అసలు తెలియదు. కనీసం డీన్ స్మిత్ మొహం కూడా ఆమె ఏనాడు చూడలేదు. ఈ ఏడాదిలో జెన్నీఫర్ సోదరులు, బంధువులతో పరిచయం పెంచుకున్న డీన్ స్మిత్ ఏ రోజు ఆమె ముందుకు వెళ్ల లేదు. సరిగ్గా ఏడాది తర్వాత, అంటే 2015, జనవరి 7వ తేదీ సాయంత్రం, తెల్లారితే ఆమె పుట్టిన రోజునగా, ఆమెకు తన ప్రతిపాదనతో కూడిన వీడియోను బంధు, మిత్రుల సహకారంతో ఆమెవద్దకు పంపించాడు. అందుకని ఆమెను ఆరుబా బీచ్ వద్దకు కూడా రప్పించాడు. అక్కడే ఆమెకు వీడియో అందేలా జాగ్రత్త పడ్డాడు. ఈ ఏడాదిపాటు ప్రతిక్షణం తన తలపులతో ఎలా జీవించిందీ, ఎలా శ్వాసించిందీ ఆ వీడియోలో ఆమెకు తెలియజేశాడు. వీడియో చివరన ‘ఇంతకాలం నీ తలపుల్లో బతికిన నేను, ఇక ఇప్పుడు నీతో బతకాలనుకుంటున్నాను. నీవు వెనక్కి తిరిగితే నేనుంటా’ అనే సందేశంతో ముగించాడు. వెనక్కి చూసిన జెన్నీఫర్, స్మిత్ ప్రేమారాధనకు ముగ్ధులయ్యారు. వెంటనే అతని పెళ్లి ప్రతిపాదనను ఓకే చేశారు. ఇటీవలనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు జెన్నీఫర్ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దాని చూసినవారంతా ‘బెస్ట్ మ్యారేజ్ ప్రమోజల్ ఇన్ ది వరల్డ్ ఇన్ దిస్ ఇయర్’ అని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!
లండన్: ఓ తీయని ప్రియుని ప్రేమ కబురు ప్రియురాలి ప్రాణాలను తీసింది. పెళ్లి చేసుకుంటాననే ప్రియుడి తీపి వార్త కాస్తా ఓ యువతికి శాపంగా మారింది. లండన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకునితో ప్రేమలో పడింది. ఆ క్రమంలో గత కొంతకాలంగా వారు ప్రేమలో విహరిస్తున్నారు. ఇక పెళ్లి సమయం వచ్చేసిందని భావించిన ఆ ప్రియుడు పెళ్లి ప్రస్తావనను ప్రియురాలి చెంతకు చేరవేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిని ఆహ్వానించాడు. ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్న ఒక కొండపై కలిశారు. కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకున్న అనంతరం తన మనసులో మాటను చెప్పాడు ఆ యువకుడు.'నిన్ను నేను త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు సిద్ధమేనా'అని ఆ యువకుడు ప్రియురాలికి తన మనసులో విషయాన్ని చెప్పాడు. దీంతో ఆ యువతి ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఊహల్లో తేలియాడింది. ఇక అది కొండ కావడంతో అదుపు తప్పి కిందకు జారింది.ఆ కొండ 60 ఏడుగులు ఎత్తు కావడంతో ఆమె తీవ్రంగా గాయపడటమే కాకుండా గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది.