- మృతి చెందిన యువతి
- ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం
వేంసూరు : యువతి పెళ్లికి నిరాకరించటంతో ఓ మృ గాడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన సంఘటన సోమవారం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామానికి చెందిన కండెల్లి బాబూరావు, దేవమణిల కుమార్తె జయమౌనిక(19) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కొక్కెరగడ్డ మనోజ్‌కుమార్ జయమౌనికను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆమె నిరాకరించింది. సహనం కోల్పోయిన మనోజ్‌కుమార్ మార్చి 10న ఇంట్లో ఎవరూలేని సమయంలో జయమౌనికపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు వైద్యం కోసం సత్తుపల్లికి తరలిం చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జయమౌనిక ఆదివారం మృతి చెందింది.
జయమౌనిక వైరాలోని ఓ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో వరుసకు బంధువు అయిన మనోజ్‌కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తల్లి దేవమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం డీఎస్పీ జి.కవిత, సత్తుపల్లి రూరల్ సీఐ మోహన్‌రావులు దుద్దేపూడి గ్రామంలో విచారణ జరిపారు.