మ్యారేజ్ ప్రపోజల్....365 రోజులు | The 365 Day Wedding Proposal | Sakshi
Sakshi News home page

మ్యారేజ్ ప్రపోజల్....365 రోజులు

Published Mon, Mar 9 2015 5:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

మ్యారేజ్ ప్రపోజల్....365 రోజులు

మ్యారేజ్ ప్రపోజల్....365 రోజులు

ఫోనిక్స్: తొలిచూపులోనే చాలా మంది ప్రేమిస్తారు. తాము ప్రేమించిన అమ్మాయికిగానీ, అబ్బాయికీగానీ ఆ విషయాన్ని ఎలా బలంగా చెప్పాలో తెలియక తబ్బిబ్బవుతారు. తత్తరపడతారు. అలాగే అమెరికాలోని ఆరిజోన రాష్ట్రానికి చెందిన డీన్ స్మిత్ అనే అబ్బాయి, జెన్నీఫర్ కెసెల్ అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలా ? అని సుదీర్ఘంగా ఆలోచించాడు. తానుచేసే పెళ్లి ప్రతిపాదన కొత్తగానూ గమ్మతుగాను ఉండాలని అనుకున్నాడు.
  ‘జె న్నీఫర్, విల్ యూ మ్యారీ మీ’ అని అడుగుతూ తెల్లటి కార్డుబోర్డుపై తన ప్రతిపాదనను రాశారు. అలా ప్రతిరోజూ ఆ బోర్డును వివిధ భంగిమల్లో , వివిధ చోట్ల పట్టుకొని వీడియో తీయించుకున్నాడు. అలా వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, ఏకంగా ఏడాది కాలం...అంటే 365 రోజులు అలా చేస్తూ వాటిని వీడియోలో బంధించాడు.

 

ఈ విషయం జెన్నీఫర్ కెసెల్‌కు అసలు తెలియదు. కనీసం డీన్ స్మిత్ మొహం కూడా ఆమె ఏనాడు చూడలేదు. ఈ ఏడాదిలో జెన్నీఫర్ సోదరులు, బంధువులతో పరిచయం పెంచుకున్న డీన్ స్మిత్ ఏ రోజు ఆమె ముందుకు వెళ్ల లేదు. సరిగ్గా ఏడాది తర్వాత, అంటే 2015, జనవరి 7వ తేదీ సాయంత్రం, తెల్లారితే ఆమె పుట్టిన రోజునగా, ఆమెకు తన ప్రతిపాదనతో కూడిన వీడియోను బంధు, మిత్రుల సహకారంతో ఆమెవద్దకు పంపించాడు. అందుకని ఆమెను ఆరుబా బీచ్ వద్దకు కూడా రప్పించాడు. అక్కడే ఆమెకు వీడియో అందేలా జాగ్రత్త పడ్డాడు. ఈ ఏడాదిపాటు ప్రతిక్షణం తన తలపులతో ఎలా జీవించిందీ, ఎలా శ్వాసించిందీ ఆ వీడియోలో ఆమెకు తెలియజేశాడు. వీడియో చివరన ‘ఇంతకాలం నీ తలపుల్లో బతికిన నేను, ఇక ఇప్పుడు నీతో బతకాలనుకుంటున్నాను. నీవు వెనక్కి తిరిగితే నేనుంటా’ అనే సందేశంతో ముగించాడు. వెనక్కి చూసిన జెన్నీఫర్, స్మిత్ ప్రేమారాధనకు ముగ్ధులయ్యారు. వెంటనే అతని పెళ్లి ప్రతిపాదనను ఓకే చేశారు. ఇటీవలనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు  జెన్నీఫర్ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. దాని చూసినవారంతా ‘బెస్ట్ మ్యారేజ్ ప్రమోజల్ ఇన్ ది వరల్డ్ ఇన్ దిస్ ఇయర్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement