విద్యార్థిని మొహంపై యాసిడ్ పోశాడు
కోల్కత్తా : నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు కాలేజీ విద్యార్థి వెంట పడ్డాడు. సదరు యువకుడి ప్రతిపాదనను విద్యార్థి తిరస్కరించింది. అంతే తన వెంట తెచ్చుకున్న యాసిడ్తో ఆమె మొహంపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది... స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి ఎ.రవీంద్రనాథన్ తెలిపారు. నిందితుడు అభి షా (25)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
అయితే తనను పెళ్లి చేసుకోవాంటూ గత కొంత కాలంగా నిరుద్యోగి అభి షా కాలేజీ విద్యార్థి వెంట పడుతూ తరచు వేధించేవాడని రవీంద్రనాథన్ చెప్పారు. నిందితుడు అభి షాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.