'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు' | Lawyer offers SHEEP for marriage to President Obama's teen daughter | Sakshi
Sakshi News home page

'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు'

Published Wed, May 27 2015 5:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు'

'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు'

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారాలపట్టి 16 ఏళ్ల మలియా ఒబామాకు ఊహించని ప్రపోజల్ వచ్చింది. ఒబామా కూతురు తనను పెళ్లి చేసుకుంటే 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు కన్యాశుల్కంగా ఇస్తానని కెన్యాకు చెందిన లాయర్ ఫెలిక్స్ కిప్రోనొ చెబుతున్నాడు. విషయం ఏంటంటే ఫెలిక్స్ ఒబామా పెద్ద కూతురు మలియాతో వన్ సైడ్ లవ్ లో పడ్డాడు. మలియాను పేళ్లి చేసుకోవడమే తన ఆశయమని చెబుతున్నాడు. వచ్చే జూలైలో కెన్యా పర్యటనకు వెళ్లనున్న ఒబామాను స్వయంగా కలసి పెళ్లి విషయం మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని ఫెలిక్స్ అన్నాడు.  

తన ప్రేమ నిజమైనదని, ప్రేమకు డబ్బు ముఖ్యం కాదని ఈ యువ లాయర్ అంటున్నాడు. ఒబామా గనక తమ పెళ్లికి అంగీకరిస్తే కెన్యా సంప్రదాయరీతిలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 2008లోనే ఫెలిక్స్ మహాశయుడు మలియాతో ప్రేమలో పడ్డాడట. అప్పటి నుంచి తాను ఏ అమ్మాయితోనూ డేటింగ్ చేయలేదని చెప్పాడు. తన ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పానని, కన్యాశుల్కం ఇచ్చేందుకు సాయం కూడా చేస్తానన్నారని తెలిపాడు. ఒబామా కెన్యా పర్యటనకు వచ్చినపుడు తన ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తానని అంటున్నాడీ వీర ప్రేమికుడు. కెన్యా పర్యటనకు మలియాను కూడా వెంట తీసుకురావాల్సిందిగా ఒబామాకు లేఖ రాస్తానని వివరించాడు. తమది సాధారణ కుటుంబమని, పాలు పితకడం, ఉగాలి (కెన్యా వంటకం) వండటం గురించి మలియాకు నేర్పుతానని అప్పుడే కలలు కంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement