Malia obama
-
కూతురి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పిన ఒబామా
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తను తాజాగా రాసిన పుస్తకం ‘ ఏ ప్రామిస్డ్ లాండ్’ను ప్రమోట్ చేసుకోవటంలో బిజీగా ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్ సమయంలో ఫ్యామిలీతో కలిసి హోం క్వారెంటైన్లో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా కుటుంబాల్లోలానే మేము కూడా ఓ నెల ఆటలు ఆడుకుంటూ, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటూ సరదాగా గడిపాము. మాలియా బాయ్‌ఫ్రెండ్ కూడా మాతో ఉన్నాడు. రాత్రి పూట కూడా ఆటలు ఆడుకునేవాళ్లం. కొద్దిరోజులకే వారు బోర్‌గా ఫీలయ్యారు. అప్పుడప్పుడు మాలియా, సాశ, మాలియా బాయ్‌ఫ్రెండ్‌కు కార్డ్సు(పేకలు) కూడా నేర్పించాను. మాలియా బాయ్‌ఫ్రెండ్ బ్రిటీష్ వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబంలోకి అతడ్ని ఆహ్వానించాము. మొదట నాకతడు నచ్చలేదు. కానీ, చాలా మంచి వ్యక్తి. మగపిల్లల తిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి వల్ల మా ఇంటి నిత్యావసరాల ఖర్చు 30 శాతం పెరిగింది.’’ అని అన్నారు. (నాకు మరణశిక్ష విధించినా సరే..) కాగా, ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను ఒబామా నెమరువేసుకున్నారు. తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. -
ప్రేమికుడితో మలియా ఒబామా చెట్టాపట్టాల్!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మలియా ఒబామా ప్రేమలో మునిగితేలుతున్నదంట. ఆమె తాజాగా తన కొత్త ప్రేమికుడు రోరి ఫర్కుహర్సన్‌తో న్యూయార్క్ నగరంలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కనిపించింది. రోరీ బ్రిటన్ వాసి. బ్రిటన్‌లో అత్యంత సంపన్నులు చదివే ప్రఖ్యాత రగ్బీ స్కూల్లో చదువుకొని స్కూల్ లీడర్‌గా వ్యవహరించాడు. రోరీ తండ్రి చార్లెస్ ఫర్కుహర్సన్ లండన్‌లోని ఓ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ గ్రూప్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్, డైరెక్టర్‌గా ఉన్నారు. మలియాతో సన్నిహితంగా రోరీ సిగరెట్ తాగుతూ కనిపించగా.. మలియా నవ్వులు చిందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 19 ఏళ్ల వయస్సులో ఉన్న మలియా, రోరీ హార్వర్డ్ యూనివర్సిటీలో కలిసి చదువుతున్నారని తెలుస్తోంది. హార్వర్డ్-యేల్ ఫుట్‌బాల్ గేమ్ సందర్భంగా ఈ ఇద్దరూ ఇష్టంగా ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు అప్పట్లో హల్చల్ చేశాయి. -
ప్రేమలో ఒబామా కుమార్తె..!
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాపై అమెరికన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఆమె ప్రేమలో ఉన్నదని, పొగతాగడం కూడా అలవాటు చేసుకుందని వాటి సారాంశం. కాగా, మలియాపై అలా వార్తలు రాయడాన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్ష కుమార్తెలు ఖండించారు. మలియాకు పర్సనల్ లైఫ్ ఉంటుందని మీడియా గుర్తు పెట్టుకుంటే బావుంటుందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియాలు హితవు పలికారు. సాధారణంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ప్రచురించడాన్ని అమెరికన్ మీడియా వ్యతిరేకిస్తుంది. అయితే మలియా విషయంలో అలా జరగకపోవడంతో ఇవాంకా ట్రంప్, చెల్సియా క్లింటన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ‘మలియా ఒబామా ఒక ప్రైవేట్ సిటిజన్. తన జీవితంపై గోపత్య పాటించే హక్కు ఆమెకు ఉంటుంది. మీడియా తన పరిమితులను దాటి ప్రవర్తించకుండా ఉంటే మంచిది.’ అని ఇవాంకా ట్వీట్ చేశారు. ‘ఒక యువతిగా, కాలేజీ విద్యార్థిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. తనకు నచ్చినట్లు ఉండటం ఆమెకు ఉన్న హక్కు. దానిపై మీడియా అతిగా స్పందించాల్సిన పని లేదు’ అని చెల్సియా క్లింటన్ ట్వీట్ చేశారు. -
ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారు
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం పెద్ద కుమార్తె మాలియా(19)ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్చినప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. మాలియాను వర్సిటీలో వదిలి వస్తుంటే తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నంత బాధ కలిగిందన్నారు. డెలావర్‌లోని బ్యూ బిడెన్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ విందు కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. మాలియాను హార్వర్డ్‌లో వదిలి వస్తున్న సమయంలో తనకు విపరీతంగా ఏడుపు వచ్చినప్పటికీ ఆమె ముందు ఏడ్వలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జో బిడెన్(మాజీ ఉపాధ్యక్షుడు) దంపతుల్ని ఉద్దేశించి ఒబామా అన్నారు. ఇందుకు తాను గర్వపడుతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు. తిరుగుప్రయాణంలో ముక్కు తుడుచుకుంటూ తాను చేసిన శబ్దాలు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి వినిపించినప్పటికీ వారు విననట్లే నటించారని చమత్కరించారు. జీవితంలో మనం ఎంత సాధించినా, చివరికి మనకు సంతోషాన్నిచ్చేది మాత్రం పిల్లలేనన్నారు. మళ్లీ అదే స్థాయి ఆనందం మనవళ్లు, మనవరాళ్ల వల్లే దక్కుతుందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాలియా ఐవీ లీగ్ స్కూల్లో చేరారు. -
తీవ్ర భావోద్వేగానికి లోనైన ఒబామా
వాషింగ్టన్ : తన కూతురును కాలేజీ చదువు నిమిత్తం ఇంటినుంచి పంపిస్తున్నప్పుడు తనకు డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్లుగా అనిపించిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బ్యూ బిడెన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద కూతురు మలియా ఒబామాను ఇటీవల ఉన్నతచదువుల నిమిత్తం హార్వర్డ్‌కు పంపాను. యూనివర్సిటీలో తనను చేర్పించి తిరిగొచ్చే సమయంలో తనకు బై చెబుతుంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగింది. తండ్రులు అందరికీ అలాగే ఉంటుదని భావిస్తున్నాను. మలియాకు తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. ఆ సమయంలో కూతురి ముందు కన్నీరు పెట్టుకోలేదు. నా కూతుళ్లు మలియా, సాశా నాకు మంచి స్నేహితులు. వారిలో ఒకరు నానుంచి కాస్త దూరంగా వెళ్లిపోతున్నారు. కానీ నాకు ఎందుకో చాలా దిగులుగా ఉంది. అయితే కొంతకాలం తర్వాత మా జీవితంలో వారే సంతోషం నింపుతారన్న నమ్మకం ఉందని' ఒబామా పేర్కొన్నారు. గతంలో చికాగోలో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. మీకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మలియా, సాశాలనుద్దేశించి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఒబామా ఓ సాధారణ తండ్రిగా వ్యవహరించి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు -
మాలియానా... మజాకా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గారి పెద్దమ్మాయి మాలియా ఒబామా ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌తో కలసి న్యూయార్క్‌లోని ఒక బార్‌కు వెళ్లింది. మాన్హటన్ ప్రాంతంలోని ‘బి బార్ అండ్ గ్రిల్’ ప్రాంగణంలోకి ఆమె అడుగుపెడుతూనే అక్కడే ఉన్న కొందరు కెమెరాలకు పని చెప్పారు. మాలియా, ఆమె బాయ్‌ఫ్రెండ్ బార్లో ఒక మూల ప్రశాంతంగా ఉన్నచోట కూర్చొని డిన్నర్ కానిచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా మాజీ అధ్యక్షుడి కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో కలసి బార్‌కు రావడంతో అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ఉరుకులు పెట్టారు. ఆమె మాన్‌హట్టన్ బార్‌కు వచ్చిన సంగతి తెలిసినదే తడవుగా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాలియా చేరుకున్న కొద్ది సేపట్లోనే బార్ లోపలా, వెలుపలా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు పెద్దసంఖ్యలో కనిపించినట్లు బార్ కస్టమర్లలో కొందరు చెప్పారు. చుట్టూ ఇంత హడావుడి జరుగుతున్నా మాలియా, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏమీ పట్టించుకోకుండా డిన్నర్ పూర్తయ్యాక తాపీగా నిష్క్రమించారు. -
కన్నీటి పర్యంతమైన మాలియా ఒబామా!
చికాగో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీడ్కోలు ప్రసంగంతో ఆయన పెద్ద కూతురు మాలియా (18) కన్నీటి పర్యంతమైంది. చికాగో నగరంలో 20,000 మందికి పైగా హాజరైన ఈ సమావేశంలో భార్య మిషెల్‌ను ఉద్దేశించి ఒబామా మాట్లాడుతూ ‘పాతికేళ్లుగా నువ్వు నా ప్రతి కష్టసుఖాల్లో తోడున్నావు. నువ్వు నా భార్యవి, నా బిడ్డలకు తల్లివి మాత్రమే కాదు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. శ్వేత సౌధాన్ని అందరిదిగా మార్చావు. నేనే కాదు యావత్ దేశం గర్వపడేలా చేశావు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద కూతురు మాలియా (18) ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టింది. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకున్న ఒబామా కూతుళ్లు మాలియా, సాషాలనుద్దేశించి మాట్లాడుతూ‘మీరిద్దరూ అందమైన, తెలివైన పిల్లలు. మీ ఇద్దరికీ మంచి అభిరుచి ఉంది. నావల్ల మీరు కొన్నిసార్లు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. మీ ఇద్దరి తండ్రిని అయినందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అని ఒబామా అన్నారు. -
మిషెల్లీ ఒబామా వైరల్ వీడియో!
భర్తను బాగా ఇమిటేట్ చేయడంలో భార్యలే ముందుంటారేమో.. తాజాగా మిషెల్లీ ఒబామా భర్త బరాక్‌ను చిలిపిగా ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఎనిమిదేళ్లు అధ్యక్షుడిగా అమెరికాకు సేవలు అందించిన ఒబామా త్వరలో ఈ పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బర్ట్ నిర్వహించే ’ద లేట్ షో’లో ఫ్లోటస్ మిషెల్లీ ముచ్చటించింది. వైట్‌హౌస్‌లో కుటుంబమంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో మిషెల్లీ ఈ సందర్భంగా వివరించింది. డిన్నర్ చేస్తున్నప్పుడు పెద్ద కూతురు మలియా తండ్రి ఒబామాను గ్లోబల్ వార్మింగ్ వంటి సీరియస్ ప్రశ్నలను అడుగుతూ ఉండేదని మిషెల్లీ చెప్తూ.. ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో ఒబామా ఎలా సమాధానమిస్తాడో ఇమిటేట్ చేసి మరీ చూపించింది. ’వెల్.. నువ్వు ఈ ప్రశ్న అడగడం సంతోషంగా ఉంది. మూడు పాయింట్లతో సమాధానాన్ని నీకు వివరిస్తాను. పాయింట్ 1, పాయింట్ 1a, పాయింట్ 1ab అంటూ’ ఒబామా వివరిస్తూ పోతారని ఆయనను అచ్చం ఇమిటేట్ చేస్తూ మిషెల్లీ ప్రేక్షకుల్లో ఆనందం నింపింది. తాను, చిన్న కూతురు సాషా మాత్రం ఫేవరెట్ పాటల గురించి చర్చించుకుంటామని చెప్పింది. బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో ఈ పెట్టిన ఈ వీడియో ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి వైరల్ గా మారింది. -
'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు'
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గారాలపట్టి 16 ఏళ్ల మలియా ఒబామాకు ఊహించని ప్రపోజల్ వచ్చింది. ఒబామా కూతురు తనను పెళ్లి చేసుకుంటే 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు కన్యాశుల్కంగా ఇస్తానని కెన్యాకు చెందిన లాయర్ ఫెలిక్స్ కిప్రోనొ చెబుతున్నాడు. విషయం ఏంటంటే ఫెలిక్స్ ఒబామా పెద్ద కూతురు మలియాతో వన్ సైడ్ లవ్ లో పడ్డాడు. మలియాను పేళ్లి చేసుకోవడమే తన ఆశయమని చెబుతున్నాడు. వచ్చే జూలైలో కెన్యా పర్యటనకు వెళ్లనున్న ఒబామాను స్వయంగా కలసి పెళ్లి విషయం మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని ఫెలిక్స్ అన్నాడు. తన ప్రేమ నిజమైనదని, ప్రేమకు డబ్బు ముఖ్యం కాదని ఈ యువ లాయర్ అంటున్నాడు. ఒబామా గనక తమ పెళ్లికి అంగీకరిస్తే కెన్యా సంప్రదాయరీతిలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 2008లోనే ఫెలిక్స్ మహాశయుడు మలియాతో ప్రేమలో పడ్డాడట. అప్పటి నుంచి తాను ఏ అమ్మాయితోనూ డేటింగ్ చేయలేదని చెప్పాడు. తన ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పానని, కన్యాశుల్కం ఇచ్చేందుకు సాయం కూడా చేస్తానన్నారని తెలిపాడు. ఒబామా కెన్యా పర్యటనకు వచ్చినపుడు తన ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తానని అంటున్నాడీ వీర ప్రేమికుడు. కెన్యా పర్యటనకు మలియాను కూడా వెంట తీసుకురావాల్సిందిగా ఒబామాకు లేఖ రాస్తానని వివరించాడు. తమది సాధారణ కుటుంబమని, పాలు పితకడం, ఉగాలి (కెన్యా వంటకం) వండటం గురించి మలియాకు నేర్పుతానని అప్పుడే కలలు కంటున్నాడు. -
ఒబామా కుమార్తె ఫొటో హల్చల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మలియా ఒబామా (16) ఫొటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించిన ఆమె పోని టెయిల్ హెయిర్‌తో నేరుగా ఫోజిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో ఎవరు తీశారు ? ఇంటర్నెట్లోకి ఎలా వచ్చిందో? అనే విషయం మాత్రం తెలియలేదు. అయితే అమెరిక అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఈ ఫొటోపై స్పందించలేదు.