కన్నీటి పర్యంతమైన మాలియా ఒబామా! | Obama tribute to Michelle brought Malia to tears | Sakshi
Sakshi News home page

కన్నీటి పర్యంతమైన మాలియా ఒబామా!

Published Wed, Jan 11 2017 6:23 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

కన్నీటి పర్యంతమైన మాలియా ఒబామా! - Sakshi

కన్నీటి పర్యంతమైన మాలియా ఒబామా!

చికాగో: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వీడ్కోలు ప్రసంగంతో ఆయన పెద్ద కూతురు మాలియా (18) కన్నీటి పర్యంతమైంది. చికాగో నగరంలో 20,000 మందికి పైగా హాజరైన ఈ సమావేశంలో భార్య మిషెల్‌ను ఉద్దేశించి ఒబామా మాట్లాడుతూ ‘పాతికేళ్లుగా నువ్వు నా ప్రతి కష్టసుఖాల్లో తోడున్నావు. నువ్వు నా భార్యవి, నా బిడ్డలకు తల్లివి మాత్రమే కాదు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి. శ్వేత సౌధాన్ని అందరిదిగా మార్చావు. నేనే కాదు యావత్‌ దేశం గర్వపడేలా చేశావు’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో పెద్ద కూతురు మాలియా (18) ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టింది. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకున్న ఒబామా కూతుళ్లు మాలియా, సాషాలనుద్దేశించి మాట్లాడుతూ‘మీరిద్దరూ అందమైన, తెలివైన పిల్లలు. మీ ఇద్దరికీ మంచి అభిరుచి ఉంది. నావల్ల మీరు కొన్నిసార్లు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. మీ ఇద్దరి తండ్రిని అయినందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అని ఒబామా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement