న్యూజిలాండ్ ప్రధానితో ఒబామా
ఆక్లాండ్ : బరాక్ ఒబామా అంటే అమెరికా మాజీ అధ్యక్షుడి గానే కాకుండా గొప్ప తండ్రి అని ప్రపంచానికి తెలుసు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కుమార్తెలు మాలియా, సాశాలను సాధారణ తండ్రిలాగే పెంచారు. అధ్యక్షుని బిడ్డలమనే గర్వం కూడా వారిలో ఎప్పుడూ కనిపించలేదు. అంతేకాకుండా అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒబామా కూతుళ్లు ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఎలా పెంచాలో ఒబామాకు బాగా తెలుసని ఆయన సన్నిహితులు చెబుతూ ఉండేవారు.
అధ్యక్ష పదవి కాలం ముగిసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న ఒబామా అప్పుడప్పుడు ప్రజలకు అవసరమయ్యే ప్రసంగాలు చేస్తుంటారు. తాజాగా ఓ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా న్యూజిలాండ్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒబామా.. ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్‌కు పిల్లల పెంపకంపై పాఠాలు చెప్పారు. జెసిందా గత జూన్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఒబామా చెప్పిన సూచనలు తనకు, తన బిడ్డ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని కివీస్ ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment