న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తను తాజాగా రాసిన పుస్తకం ‘ ఏ ప్రామిస్డ్ లాండ్’ను ప్రమోట్ చేసుకోవటంలో బిజీగా ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లాక్‌డౌన్ సమయంలో ఫ్యామిలీతో కలిసి హోం క్వారెంటైన్‌లో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా కుటుంబాల్లోలానే మేము కూడా ఓ నెల ఆటలు ఆడుకుంటూ, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటూ సరదాగా గడిపాము. మాలియా బాయ్‌ఫ్రెండ్ కూడా మాతో ఉన్నాడు. రాత్రి పూట కూడా ఆటలు ఆడుకునేవాళ్లం. కొద్దిరోజులకే వారు బోర్‌గా ఫీలయ్యారు.
అప్పుడప్పుడు మాలియా, సాశ, మాలియా బాయ్‌ఫ్రెండ్‌కు కార్డ్సు(పేకలు) కూడా నేర్పించాను. మాలియా బాయ్‌ఫ్రెండ్ బ్రిటీష్ వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబంలోకి అతడ్ని ఆహ్వానించాము. మొదట నాకతడు నచ్చలేదు. కానీ, చాలా మంచి వ్యక్తి. మగపిల్లల తిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి వల్ల మా ఇంటి నిత్యావసరాల ఖర్చు 30 శాతం పెరిగింది.’’ అని అన్నారు. (నాకు మరణశిక్ష విధించినా సరే..)
కాగా, ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను ఒబామా నెమరువేసుకున్నారు. తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment