మాలియానా... మజాకా..? | Malia Obama pictured at trendy Manhattan bar with a friend | Sakshi
Sakshi News home page

మాలియానా... మజాకా..?

Published Sun, Apr 9 2017 10:21 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

మాలియానా... మజాకా..? - Sakshi

మాలియానా... మజాకా..?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గారి పెద్దమ్మాయి మాలియా ఒబామా ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌తో కలసి న్యూయార్క్‌లోని ఒక బార్‌కు వెళ్లింది. మాన్‌హటన్‌ ప్రాంతంలోని ‘బి బార్‌ అండ్‌ గ్రిల్‌’ ప్రాంగణంలోకి ఆమె అడుగుపెడుతూనే అక్కడే ఉన్న కొందరు కెమెరాలకు పని చెప్పారు. మాలియా, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ బార్‌లో ఒక మూల ప్రశాంతంగా ఉన్నచోట కూర్చొని డిన్నర్‌ కానిచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా మాజీ అధ్యక్షుడి కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో కలసి బార్‌కు రావడంతో అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీసెస్‌ అధికారులు ఉరుకులు పెట్టారు.

ఆమె మాన్‌హట్టన్‌ బార్‌కు వచ్చిన సంగతి తెలిసినదే తడవుగా సీక్రెట్‌ సర్వీసెస్‌ అధికారులు ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాలియా చేరుకున్న కొద్ది సేపట్లోనే బార్‌ లోపలా, వెలుపలా సీక్రెట్‌ సర్వీసెస్‌ అధికారులు పెద్దసంఖ్యలో కనిపించినట్లు బార్‌ కస్టమర్లలో కొందరు చెప్పారు. చుట్టూ ఇంత హడావుడి జరుగుతున్నా మాలియా, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఏమీ పట్టించుకోకుండా డిన్నర్‌ పూర్తయ్యాక తాపీగా నిష్క్రమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement