
న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు బైడెన్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు.
బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment