Radio City
-
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
హిట్ అండ్ రన్ : రేడియో జాకీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త మృతికి కారణమైన కేసులో రేడియో జాకీ (ఆర్జే) అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆర్జేని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేడియో సిటీ ఆర్జే అంకిత్ గులాటి తన కారును వేగంగా నడుపుతూ ఎల్జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ధీరజ్ కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలంనుంచి పారిపోయిన గులాటిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను శుక్రవారంపరామర్శించారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు గులాటిని అరెస్ట్ చేశారు. -
రేడియో సిటీ.. వీడియో సిటీగా కూడా
న్యూఢిల్లీ : రేడియో సిటీ సర్వీసులను ఇక వీడియో రూపంలోనూ పొందవచ్చు. రేడియో సిటీ శ్రోతలు ఇన్-స్టూడియో యాక్షన్‌ను చూసేలా 'వీడియో సిటీ' సర్వీసులను ప్రారంభించింది. ఆడియో నుంచి వీడియో రూపంలో శ్రోతలకు చేరుకోవడానికి 'వీడియో సిటీ' ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రైవేట్ రేడియో ఎఫ్ఎం స్టేషన్ రేడియో సిటీ తెలిపింది. ఎఫ్ఎం కంటెంట్లను మొత్తాన్ని ఇక శ్రోతలు వీడియో రూపంలో పొందవచ్చు. లైవ్ యాక్షన్, వీడియో కంటెంట్‌ను చూడటానికి శ్రోతల డివైజ్‌లకు వీడియో సిటీని అందజేయనున్నట్టు ఎఫ్ఎం ఛానల్ ప్రకటించింది. రేడియో సిటీ తీసుకునే సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, లైవ్ స్టూడియో యాక్షన్, ట్రాఫిక్ అప్డేట్లు, ప్లేలిస్టులు అన్ని రేడియో సిటీ వెబ్‌సైట్‌ను తిలకించవచ్చు. డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లడానికి ఇది ఎంతో సహకరిస్తుందని రేడియో సిటీ సీఈవో అబ్రహ్మం థామస్ తెలిపారు. తొలుత దీన్ని ముంబైలో ప్రారంభించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్‌లో రేడియో సిటీ ఓ భాగం. ప్రస్తుతం ఇది 39 స్టేషన్లను కలిగి ఉంది. ఫేస్ 3 యాక్షన్స్‌లో భాగంగా 11 కొత్త స్టేషన్లను కూడా లాంచ్ చేయబోతుంది. -
రెండు ఐపీఓలకు రూ.1.5 లక్షల కోట్ల బిడ్స్
న్యూఢిల్లీ: ఈ వారంలో పబ్లిక్ ఆఫర్లను జారీచేసిన రెండు కంపెనీలకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ రెండు ఐపీఓలూ పరిమాణంలో పెద్దవి కానప్పటికీ, రూ. 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్‌ను చేజిక్కించుకున్నాయి. రేడియో సిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహించే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, డి–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ వారంలో ఐపీఓకు వచ్చాయి. ఈ రెండింటి షేర్ల దరఖాస్తు కోసం ఇన్వెస్టర్లు బిడ్ చేసిన రూ.1.5 లక్షల కోట్లూ వారంరోజులపాటు బ్లాక్ అయిపోతాయి. ఏడు రోజుల తర్వాత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరుగుతుంది. అప్పటిదాకా ఈ సొమ్ములు ఆస్బా(ఆప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) ఖాతాలో ఉండిపోతాయి. ఈ నెల 14న మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, ఈ నెల 16న డి–మార్ట్ షేర్లను కేటాయిస్తాయి. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ 40 రెట్లు, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓ 104 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. రూ.400 కోట్ల మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓకు రూ.13,583 కోట్లు, రూ.1,870 కోట్ల అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓకు రూ.1.38 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. డి–మార్ట్ ఐపీఓకు బంపర్ స్పందన శుక్రవారంతో ముగిసిన డి–మార్ట్ ఐపీఓ 104.48 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.295–299 ధరల శ్రేణి ఉన్న ఈ ఇష్యూలో ఆఫర్ చేస్తున్న 4.43 కోట్ల షేర్లకు గాను 463.61 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు(క్విబ్)లకు కేటాయించిన వాటా 144.6 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 277.74 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.36 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. గత ఏడాది వచ్చిన అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఐపీఓ 116 రెట్లు, క్వెస్ కార్పొ ఐపీఓ 145 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్... ఈ నెల 21న అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. -
అదరగొట్టిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ
ముంబై: మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. పబ్లిక్ ఇష్యూ మొదలైన రెండో రోజు (మంగళవారం) మధ్యాహ్నానికే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ పబ్లిక్ ఇష్యూ ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. జాగరణ్ ప్రకాశన్ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ ఆఫర్లో భాగంగా 1.04 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 1.06 కో్ట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. మరోవైపు ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 146 కోట్లను సమీకరించింది. ధరల శ్రేణి రూ. 324-333 గా నిర్ణయించిన ఈ ఐపీవో బుధవారం ముగియనుంది. కాగా జాగ్రణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ రేడియో సిటీ ఎఫ్ఎం చానల్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఎఫ్ఎం చానళ్లను నిర్వహించే ఈ సంస్థ ఐపీవో సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్ కింద ఎఫ్ఎం ప్రసారాలందిస్తున్న సంస్థ ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లకు మించి నిధులను సమీకరించాలని భావించింది. ఇందులో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని మ్యూజిక్ బ్రాడ్కాస్ట్(ఎంబీఎల్) ప్రకటించిన సంగతి విదితమే. -
వచ్చే నెల 6 నుంచి రేడియో సిటీ ఎంబీఎల్ ఐపీఓ
⇒ కనీస రూ.400 కోట్ల సమీకరణ ⇒ ఇష్యూ ధర రూ.324–333 ! న్యూఢిల్లీ: మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 6న ప్రారంభం కానున్నది. జాగ్రణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ రేడియో సిటీ ఎఫ్ఎం చానల్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్ కింద ఎఫ్ఎం ప్రసారాలను ప్రసారం చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లకు మించి నిధులను సమీకరించనున్నది. ఈ నెల 8న ముగిసే ఈ ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని మ్యూజిక్ బ్రాడ్కాస్ట్(ఎంబీఎల్) తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డెబెంచర్ల ఉపసంహరణకు వినియోగిస్తామని వివరించింది. ఎంబీఎల్ షేర్లు మార్చి 17న లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.324–333 రేంజ్లో, మార్కెట్ లాట్ 45 షేర్లుగా ఉండొచ్చని సమాచారం. కాగా గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన కాలానికి ఎంబీఎల్ రూ.138 కోట్ల ఆదాయాన్ని, రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
రేడియో ‘స్టార్స్’
బంజారాహిల్స్: ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమా హీరో సునీల్, హీరోయిన్లు సుష్మారాజ్, రీచాపనయ్ గురువారం రేడియో సిటీలో సందడి చేశారు. వీరు శ్రోతలతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఫుల్ కామెడీతో వస్తున్న సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. -
ఎఫ్ఎంలో ముమైత్ జోరు..
బంజారాహిల్స్: ‘తిక్క’ సినిమాలో నా నృత్యం, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటిస్తున్నాన’ని సినీ నటి ముమైత్‌ఖాన్ చెప్పారు. బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ‘తిక్క’ శనివారం విడుదల కానున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. -
‘శ్రీరస్తు.. శుభమస్తు’
బంజారాహిల్స్: ప్రపంచ రేడియో చరిత్రలోనే అతిపెద్ద నిడివి గల కథను రేడియో సిటీ 91.1 ఎఫ్ఎంలో శ్రోతలకు వినిపించారు. ఈ కథా ప్రారంభాన్ని శ్రీరస్తు శుభమస్తు సినిమా హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి విన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం స్టూడియోలో వీరిద్దరూ సందడి చేశారు. ప్రపంచ అతిపెద్ద రేడియో స్టోరీని రేడియో సిటీలో వినడం ఎంతో బాగుందని వీరు తెలిపారు. ‘రేడియో సిటీ బ్లాక్ బస్టర్ కథ’ పేరుతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. నాలుగు రోజుల పాటు 96 గంటలు ఈ కథను శ్రోతలకు వినిపించనున్నారు. శ్రోతలకు, సినీ ప్రముఖులకు ఈ కథను అంకితం చేశారు. ప్రముఖ గేయ రచయితలు, ప్రముఖ తారలు ఈ కథలో పాల్పంచుకున్నారు. ఎఫ్ఎం చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టమని నిర్వాహకులు వెల్లడించారు. -
కృష్ణాష్టమితో ‘మలుపు’ ఖాయం..
తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం ఆనందంగా ఉందని సినీనటి నిక్కీ గర్లాని అన్నారు. సునీల్‌తో కలిసి ఆమె నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో సందడి చేశారు. ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. తాను నటించిన మరో చిత్రం ‘మలుపు’ కూడా రిలీజ్‌కు సిద్ధమైందని, రెండూ హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగళూరుకు చెందిన అమ్మాయినే అయినా ఈ చిత్రాల కోసం తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. - బంజారాహిల్స్ -
‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రేడియోసిటీ 91.1 ఎఫ్ఎం స్టేషన్లో నటి కేథరిన్ సందడి చేసింది. గురువారం సాయంత్రం రేడియో స్టేషన్‌కు విచ్చేసిన ఈ తార తాను నటించిన లేటెస్ట్ సినిమా ఎర్రబస్సు సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. - బంజారాహిల్స్ -
‘ఆగడు’ మూవీకి రేడియో సిటీ బ్లూకార్పెట్
రేడియో సిటీ శ్రోతల కోసం ‘ఆగడు’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం.. సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ‘ఆగడు’ మూవీ బ్లూకార్పెట్ స్క్రీనింగ్‌కు సిద్ధమవుతోంది. మూవీ విడుదలైన తొలి వారాంతంలోనే శ్రోతల కోసం ప్రత్యేకంగా ఈ మూవీ స్క్రీనింగ్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో రిలీజయ్యే వాటిలో మహేష్‌బాబు, తమన్నా తొలిసారి జంటగా నటిస్తున్న ‘ఆగడు’ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల సందర్భంగా బ్లూ కార్పెట్ స్క్రీనింగ్‌కు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో తరలివచ్చేలా రేడియో సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆగడు’ మూవీ టికెట్లు గెలుచుకునేందుకు శ్రోతలు రేడియో సిటీ ప్రసారాలను ఆలకించి, తేలికపాటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. రేడియో కార్పెట్ స్పెషల్ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు ‘సాక్షి’ పాఠకులు సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ‘సిటీప్లస్’లో రేడియో సిటీ ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది. మహేష్‌బాబు అభిమానులకు ప్రత్యేక అవకాశం మహేష్ బాబు ఉపయోగించిన బుల్లెట్ వాహనంతో ఫొటోలు దిగేందుకు రేడియో సిటీ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్లో ఉండే ఈ వాహనంతో ఫొటోలు దిగే అవకాశం ఆదివారంతో ముగుస్తుంది. -
విజయం: ఓ అపూర్వ గాథ!
అపూర్వ పురోహిత్.. దేశంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థల్ని నడుపుతున్న అతి కొద్ది మంది మహిళా సీఈవోల్లో ఒకరు! ‘‘మగాళ్లకేంటండీ.. ఏమైనా చేయగలరు.. మేం పిల్లల్ని కనాలి, పెంచాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలి... మేం ఎదగడానికి అడుగడుగునా అడ్డంకులే’’.. అని వాదించే మహిళలందరికీ అపూర్వ జీవితం ఓ పాఠం! ఆమె అందరు మహిళల్లాగే పెళ్లి చేసుకుంది.. పిల్లల్ని కంది.. వాళ్లను పెంచి పెద్ద చేసింది.. ఇంటి బాధ్యతలన్నీ చూస్తోంది! ఇన్నీ చేస్తూ కెరీర్లోనూ ఎదిగింది! పాతికేళ్లుగా మీడియా రంగంలో అనేక సంస్థల్లో పని చేస్తూ... గత ఎనిమిదేళ్లుగా ‘రేడియో సిటీ’ని నడిపిస్తున్న అపూర్వ కథ.. నిజంగా ఓ అపూర్వమైన విజయగాధ! ఎంచక్కా ‘రేడియో సిటీ’లో పాటలు వింటూ సేదదీరే కోట్లాది మంది శ్రోతలకు ఆ కార్యక్రమాల వెనుక ఎంత వ్యవహారం ఉంటుందో తెలియదు. వందలాది మంది నిపుణుల సృజనాత్మక ఆలోచనలు, శ్రమ కలిస్తేనే ఈ కార్యక్రమాలు. మధ్యలో వచ్చే ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలు.. ప్రచార కార్యక్రమాలు.. మార్కెటింగ్.. ఇలా తెర వెనుక చాలా బాధ్యతలుంటాయి. వీటన్నింటికీ నేతృత్వం వహించేది, మార్గనిర్దేశం చేసేది సీఈఓ. ఈ పనిని ఎనిమిదేళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు అపూర్వ. 4 కేంద్రాల్లో ఉన్న రేడియో సిటీని దేశవ్యాప్తంగా 20 నగరాలకు విస్తరించిన ఘతన ఆమెదే. వ్యూహాల ప్రణాళిక, బడ్జెట్, ప్రాడక్ట్ మేనేజ్మెంట్, కార్యక్రమాల రూపకల్పన.. రోజూ ఇన్ని వ్యవహారాలు చూస్తారామె. ఇవి కాక ఉద్యోగుల నియామకం కూడా ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఐతే రేడియో సిటీ సీఈఓ పదవి అపూర్వకు తేలిగ్గా దక్కలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల పాటు మీడియా, టెలివిజన్ రంగంలో ఆమె పడిన శ్రమే ఆమెనీ స్థాయికి చేర్చింది. చండీగఢ్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అపూర్వ దేశంలోని అనేక ప్రాంతాల్లో తన చదువు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తరచుగా బదిలీ అయ్యేవారు. స్కూల్ చదువు ముంబయిలో పూర్తి చేసి, చెన్నైలో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ తర్వాత బెంగళూరులోని ఐఐఎంలో పీజీ డిప్లమా చేశారు. మార్కెటింగ్ ఉద్యోగం వచ్చినా కాదనుకుని, ‘రెడిఫ్యూజన్’ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేరారు. తర్వాత ఎఫ్‌సీబీ ఉల్కా అడ్వర్టైజింగ్ సంస్థలో మీడియా బయింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. ఇక్కడే టీవీ రంగంలో ఆమె కెరీర్‌కు పునాది పడింది. అప్పటికి టీవీ ఛానెల్స్‌లో సమయాన్ని కొనడం, ప్రోగ్రామ్స్ రూపొందించడం, ప్రకటనలు సంపాదించడం.. ఈ వ్యవహారాలన్నీ కొత్త! ఈ పనులన్నీ సమర్థంగా చేసి తానేంటో నిరూపించుకున్నారు అపూర్వ. క్రమంగా మీడియా బయింగ్ కన్సల్టన్సీలు పెరగడంతో అపూర్వకు అవకాశాలు పెరిగాయి. పదేళ్ల పాటు వివిధ కంపెనీల్లో పని చేశారు. ఈ అనుభవం ఆమెకు 2002లో జీ టీవీకి ప్రెసిడెంట్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అక్కడా తనదైన ముద్ర వేశారు అపూర్వ. జీ ఛానెల్ సంప్రదాయ కార్యక్రమాల్ని ఆపి.. అస్తిత్వ, చౌషాంత పన్నె వంటి కొత్త కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. వీటికి ఆదరణ వచ్చింది. తర్వాత టైమ్స్ గ్రూప్ 2004లో ‘జూమ్’ ఛానెల్‌ను ప్రారంభించే పనిని అపూర్వకే అప్పగించింది. ఏడు నెలల్లో ఛానెల్‌ను లాంచ్ చేయించడంలో అపూర్వ కీలక పాత్ర పోషించింది. ఐతే కొన్ని కారణాల వల్ల అందులోంచి బయటికి వచ్చేశారు. తర్వాత రేడియో సిటీ సీఈఓ పదవి వరించింది. మహిళా సాధికారత గురించి అపూర్వ ‘లేడీ, యు ఆర్ నాట్ ఎ మేన్’ అనే పుస్తకం రాశారు. పురుషులతో సమానంగా మహిళలు ఎలా ఎదగగలరో విశదీకరించారీ పుస్తకంలో. మహిళాలోకానికి ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహిళా సాధికారత గురించి కేవలం లెక్చర్లతో సరిపెట్టకుండా చేతల్లోనూ చూపిస్తున్నారు. ‘రేడియో సిటీ’లోని సీనియర్ మేనేజర్లలో సగం మంది మహిళలే. మిగతా ఉద్యోగాల్లోనూ మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారామె. జీ ఛానెల్ సంప్రదాయ కార్యక్రమాల్ని ఆపి.. అస్తిత్వ, చౌషాంత పన్నె వంటి కొత్త కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. వీటికి ఆదరణ వచ్చింది. - ప్రకాష్ చిమ్మల