న్యూఢిల్లీ : రేడియో సిటీ సర్వీసులను ఇక వీడియో రూపంలోనూ పొందవచ్చు. రేడియో సిటీ శ్రోతలు ఇన్-స్టూడియో యాక్షన్‌ను చూసేలా 'వీడియో సిటీ' సర్వీసులను ప్రారంభించింది. ఆడియో నుంచి వీడియో రూపంలో శ్రోతలకు చేరుకోవడానికి 'వీడియో సిటీ' ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రైవేట్ రేడియో ఎఫ్‌ఎం స్టేషన్ రేడియో సిటీ తెలిపింది. ఎఫ్‌ఎం కంటెంట్లను మొత్తాన్ని ఇక శ్రోతలు వీడియో రూపంలో పొందవచ్చు. లైవ్ యాక్షన్, వీడియో కంటెంట్‌ను చూడటానికి శ్రోతల డివైజ్‌లకు వీడియో సిటీని అందజేయనున్నట్టు ఎఫ్‌ఎం ఛానల్ ప్రకటించింది.
రేడియో సిటీ తీసుకునే సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, లైవ్ స్టూడియో యాక్షన్, ట్రాఫిక్ అప్‌డేట్లు, ప్లేలిస్టులు అన్ని రేడియో సిటీ వెబ్‌సైట్‌ను తిలకించవచ్చు. డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లడానికి ఇది ఎంతో సహకరిస్తుందని రేడియో సిటీ సీఈవో అబ్రహ్మం థామస్ తెలిపారు. తొలుత దీన్ని ముంబైలో ప్రారంభించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్‌లో రేడియో సిటీ ఓ భాగం. ప్రస్తుతం ఇది 39 స్టేషన్లను కలిగి ఉంది. ఫేస్ 3 యాక్షన్స్‌లో భాగంగా 11 కొత్త స్టేషన్లను కూడా లాంచ్ చేయబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment