న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ, దేశాన్ని ఏకం చేయటం కోసమే తాను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్న అనంతరం తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
‘‘ ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం. నేను అమెరికా అధ్యక్ష కార్యాలయాన్ని గౌరవిస్తాను. అంతకంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం.
.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుడిగా, అమెరికా భవిష్యత్తు కోసం రెండోసారి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే మెరిట్ నాకు ఉందని నమ్ముతున్నా. కానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించటంలో కూడా ఏది అడ్డురాకూడదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా’’అని బైడెన్ అన్నారు.
ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉపధ్యక్షురాలు కమలా హారిస్‌కు అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment