న్యూయార్క్: తాను జీవితాంతం అధ్యక్షుడు జో బైడెన్‌కు రుణపడి ఉంటానని అమెరికా అధ్యక్ష ఎన్నిక డెమొక్రాటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యలో చికాగోలో నాలుగు రోజుల పాటు జరనున్న డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ సమావేశాల్లో తొలిరోజు కమల మాట్లాడారు. అమెరికాకు జీవితకాలం సేవ చేసినందుకు జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
‘మీ (జో బైడెన్) నేతృత్వంలో ఈ సమావేశాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ చారిత్రాత్మక నాయకత్వం, అమెరికాకు జీవితకాలం మీరు సేవ చేసినందుకు ధన్యవాదాలు. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అమెరికాలోని నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారందరి తరఫున వచ్చే నవంబర్‌లో మేమంతా ఒకే గళాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచి మనమంతా ఒక్కటే గుర్తు చేసుకుందాం. పోరాడినప్పుడు మనమే విజయం సాధిస్తాం’ అని అన్నారు.
Democratic Convention erupts into cheers for Vice President Kamala Harris pic.twitter.com/94KB236X4F
— Kamala HQ (@KamalaHQ) August 20, 2024
నాలుగు రోజుల పాటు జగిగే ఈ సమావేశాల్లో చిరవరి రోజు (ఆగస్ట్ 22) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, ఆమె రన్నింగ్‌మేట్ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను అధ్యక్షుడు, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా డెమొక్రాటిక్ పార్టీ నామినేట్ చేయనుంది. అధ్యక్షడు జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తన డిప్యూటీ (కమల) సమర్థిస్తూ ప్రారంభ ప్రసంగంలో మాట్లాడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Vice President Harris: In November, we will come together and declare as one voice we are moving forward with optimism, hope, and guided by love of country pic.twitter.com/inLuiUKQUM
— Kamala HQ (@KamalaHQ) August 20, 2024
Comments
Please login to add a commentAdd a comment