అయ్యో పప్పా.. నాకు కూడా తెలుసు! | I know Recipe For Daal: Barack Obama | Sakshi
Sakshi News home page

అయ్యో పప్పా.. నాకు కూడా తెలుసు!

Published Fri, Dec 1 2017 4:38 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

I know Recipe For Daal: Barack Obama - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ మంది ఇష్టంగా తినే పప్పు కూర ఎలా చేయాలో తనకు తెలుసని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఒబామా ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్‌ కరణ్ థాపర్‌తో ఒబామా ముచ్చటించారు. ఇండియా ఫేవరెట్ డిష్ అయిన పప్పు ఎలా చేయాలో తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని తానే అని ఒబామా పేర్కొన్నారు.

గురువారం హోటల్లో ఉన్న సమయంలో మిగతా వంటకాలతో పాటూ పప్పును ఓ వెయిటర్ తనకు వడ్డించారని ఒబామా తెలిపారు. అంతేకాకుండా పప్పు ఎలా చేస్తారో చెప్పే ప్రయత్నం చేశాడని చెప్పారు. అది తనకు తెలుసని, తాను స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే ఓ ఇండియన్ రూమ్‌మేట్ ద్వారా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నానని ఒబామా చెప్పడం విశేషం. అంతేకాదు తాను కీమా కూడా బాగా చేస్తానని, చికెన్ కూడా వండటం వచ్చని తెలిపారు. మరి చపాతీ చేయడం వచ్చా అని కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించగా.. అది అస్సలు రాదు.. చపాతీ చేయడం చాలా కష్టమంటూ ఒబామా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement