ప్రేమలో ఒబామా కుమార్తె..! | Ivanka Trump And Chelsea Clinton Come To Malia Obama's Defense | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఒబామా కుమార్తె..!

Published Sat, Nov 25 2017 1:38 PM | Last Updated on Sat, Nov 25 2017 1:38 PM

Ivanka Trump And Chelsea Clinton Come To Malia Obama's Defense - Sakshi

బరాక్‌ ఒబామాతో కూతురు మలియా ఒబామా (ఫైల్‌ ఫొటో)

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కుమార్తె మలియాపై అమెరికన్‌ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఆమె ప్రేమలో ఉన్నదని, పొగతాగడం కూడా అలవాటు చేసుకుందని వాటి సారాంశం. కాగా, మలియాపై అలా వార్తలు రాయడాన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్ష కుమార్తెలు ఖండించారు. మలియాకు పర్సనల్‌ లైఫ్‌ ఉంటుందని మీడియా గుర్తు పెట్టుకుంటే బావుంటుందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కుమార్తె చెల్సియాలు హితవు పలికారు.

సాధారణంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ప్రచురించడాన్ని అమెరికన్‌ మీడియా వ్యతిరేకిస్తుంది. అయితే మలియా విషయంలో అలా జరగకపోవడంతో ఇవాంకా ట్రంప్‌, చెల్సియా క్లింటన్‌ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.

‘మలియా ఒబామా ఒక ప్రైవేట్‌ సిటిజన్‌. తన జీవితంపై గోపత్య పాటించే హక్కు ఆమెకు ఉంటుంది. మీడియా తన పరిమితులను దాటి ప్రవర్తించకుండా ఉంటే మంచిది.’ అని ఇవాంకా ట్వీట్‌ చేశారు. ‘ఒక యువతిగా, కాలేజీ విద్యార్థిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. తనకు నచ్చినట్లు ఉండటం ఆమెకు ఉన్న హక్కు. దానిపై మీడియా అతిగా స్పందించాల్సిన పని లేదు’ అని చెల్సియా క్లింటన్‌ ట్వీట్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement