barrack obama
-
ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్టీ–ఇన్ నోటీసు ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మోసపూరిత ట్వీట్లు, లింక్‌లను దర్శించిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హ్యాకింగ్‌ను అడ్డుకునేందుకు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న జో బిడెన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తదితరుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. భారత్‌లోనూ పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లోకి దుండగులు ప్రవేశించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఈఆర్టీ–ఇన్ స్పందించింది. -
థన్‌బెర్గ్‌ను కలవడం ఆనందం కలిగించింది : ఒబామా
వాషింగ్టన్ : స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తనను కలసిన థన్‌బెర్గ్‌ను ట్విటర్ వేదికగా అభినందించారు. అంత చిన్న వయసులో పర్యావరణ పరిరక్షణ గురించి థన్‌బెర్గ్ పోరాడడం గొప్ప విషయమని, ఆమెను కలవడం ఆనందం కలిగించిందని ఒబామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒబామా థన్‌బర్గ్‌ను కలిసిన వీడియోనూ ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది. '' మీరు, నేను ఒక టీంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు పిడికిళ్లు బిగిద్దామని'' ఒబామా పేర్కొన్నారు. దీనికి థన్‌బెర్గ్ అనుకూలంగా స్పందిస్తూ ... ప్రపంచాన్ని ఎవరు ప్రభావితం చేయలేరని, వాతావరణం పట్ల సృజనాత్మకంగా వ్యవహరిస్తూ మీకు నచ్చినది చేయొచ్చని, అందుకు నా సహకారం తప్పక ఉంటుందని పేర్కొన్నారు . వాతావరణ మార్పుల తీవ్రతను ఇప్పటి యువతరం భరిస్తుందని, అందులోనూ పర్యావరణం కోసం పరితపిస్తున్న థన్‌బెర్గ్ లాంటివారు అసలే భయపడరని ఒబామా పేర్కొన్నారు. గత శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ ముందు నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో థన్‌బెర్గ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాషింగ్టన్లో ఉన్న బరాక్ ఒబామాను తన్బెర్గ్ కలుసుకున్నారు. కాగా, సెప్టెంబర్ 20 న న్యూయార్క్‌లో జరగనున్న '' గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్'' లో ఇతర నిరసనకారులతో కలిసి ఆమె పాల్గొననున్నారు. -
ప్రేమలో ఒబామా కుమార్తె..!
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాపై అమెరికన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఆమె ప్రేమలో ఉన్నదని, పొగతాగడం కూడా అలవాటు చేసుకుందని వాటి సారాంశం. కాగా, మలియాపై అలా వార్తలు రాయడాన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్ష కుమార్తెలు ఖండించారు. మలియాకు పర్సనల్ లైఫ్ ఉంటుందని మీడియా గుర్తు పెట్టుకుంటే బావుంటుందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియాలు హితవు పలికారు. సాధారణంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ప్రచురించడాన్ని అమెరికన్ మీడియా వ్యతిరేకిస్తుంది. అయితే మలియా విషయంలో అలా జరగకపోవడంతో ఇవాంకా ట్రంప్, చెల్సియా క్లింటన్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ‘మలియా ఒబామా ఒక ప్రైవేట్ సిటిజన్. తన జీవితంపై గోపత్య పాటించే హక్కు ఆమెకు ఉంటుంది. మీడియా తన పరిమితులను దాటి ప్రవర్తించకుండా ఉంటే మంచిది.’ అని ఇవాంకా ట్వీట్ చేశారు. ‘ఒక యువతిగా, కాలేజీ విద్యార్థిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. తనకు నచ్చినట్లు ఉండటం ఆమెకు ఉన్న హక్కు. దానిపై మీడియా అతిగా స్పందించాల్సిన పని లేదు’ అని చెల్సియా క్లింటన్ ట్వీట్ చేశారు. -
మోదీకి ఒబామా ఫోన్.. ఏం చెప్పారు?
-
అమెరికా అధ్యక్షుడిగా హిందువు?
అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని, ఇక్కడ భవిష్యత్తులో కేవలం మహిళలే కాక హిందువులు, లాటినోలు, యూదులు కూడా అధ్యక్షులయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. వైట్ హౌస్‌లో తన చిట్ట చివరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రతి జాతికి, మతానికి, ఈ దేశంలో ప్రతి మూలకు చెందిన ప్రతిభావంతులు ఎదుగుతున్నారని, అదే అమెరికా అసలైన బలమని ఆయన అన్నారు. ఈ అవకాశాలను మనం ప్రతి ఒక్కరికీ ఇవ్వడం కొనసాగిస్తే, త్వరలోనే ఒక మహిళ అధ్యక్షురాలవుతుందని చెప్పారు. అలాగే ఒక లాటినో, యూదు, హిందూ అధ్యక్షులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అన్ని రకాల అధ్యక్షులు వస్తారని, ఆ సమయానికి వాళ్లను ఏమని పిలవాలో ఎవరికీ సరిగ్గా తెలియదంటూ నవ్వేశారు. దేశానికి ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అయినప్పుడు.. అలాంటిది మళ్లీ జరిగే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఒబామా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అమెరికాలో చాలామంది తమకు గుర్తింపు లేదని భావించారని, వాళ్లే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఓటేశారని చెప్పారు. తమను చిన్నచూపు చూస్తున్నారని వాళ్లు అనుకున్నారని, తమకు వచ్చిన అవకాశాలు తమ పిల్లలకు వస్తాయో రావోనని భయపడ్డారని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు వెళ్తారు. తాజాగా మీడియా మీద కూడా ట్రంప్ విరుచుకుపడిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఒబామా ప్రస్తావించారు. మీడియా ఉండటం వల్లే తాము నిజాయితీగా ఉండగలుగుతూ, మరింత కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. వాస్తవానికి వైట్‌హౌస్ నుంచి మీడియాను దూరంగా ఉంచాలని ట్రంప్ భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒబామా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. -
మోదీకి ఒబామా ఫోన్.. ఏం చెప్పారు?
మరొక్క రోజులో తన పదవీకాలం పూర్తయిపోతోందనగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. భారత్ - అమెరికా దేశాల మధ్య గల సంబంధాలను పెంపొందించడంలో భాగస్వామ్యం వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా రక్షణ రంగం, పౌర-అణు ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు తదితర విషయాలపై ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగ ప్రాధాన్యాలు, భారతదేశాన్ని అమెరికాకు ప్రధాన రక్షణ రంగ భాగస్వామిగా గుర్తించడం, వాతావరణ మార్పు తదితర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. నరేంద్రమోదీ 2014 సంవత్సరంలో భారత ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఆయనకు ఫోన్ చేసి అభినందించిన వారిలో బరాక్ ఒబామా అందరికంటే ముందున్నారు. అప్పుడే ఆయన మోదీని వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా. 2014 సెప్టెంబర్‌లో ఒబామా, మోదీ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లిద్దరి మధ్య ఎనిమిది సార్లు సమావేశాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ఇన్నిసార్లు వాళ్ల పదవీకాలంలో కలవడం ఇదే మొదటిసారి. ఇద్దరి మధ్య చాలా దృఢమైన బంధం ఉందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇద్దరికీ పరస్పరం గౌరవం ఉందని, ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటారని ఆమె చెప్పారు. -
ఒబామా సాధించినది ఏమిటి?
అమెరికా అధ్యక్షపదవి నుంచి దిగిపోతున్న బరాక్ ఒబామా మంగళవారం అమెరికా ప్రజలనుద్దేశించి ఆఖరిసారి భావోద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. మేధావి, మంచి వక్తగా గుర్తింపు పొందిన ఒబామా తన భావోద్వేగ మాటలతో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తారనే విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా ఆయన నోబెల్ శాంతి బహుమతిని ఆమోదిస్తూ చేసిన ప్రసంగం, చార్లెస్టాన్లో క్రైస్తవ కార్యక్రమంలో చేసిన ప్రసంగం చరిత్రలో ఎప్పటికి మిగిలిపోతాయని అమెరికా రాజకీయ, సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. మార్పు, ఆశ అనే నినాదాలతో ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఒబామా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత మేరకు మార్పు సాధించగలిగారు, ప్రజల ఆశలను ఎంత మేరకు తీర్చగలిగారనే అంశాలపై ఇప్పుడు ఇంటా, బయటా చర్చ జరుగుతోంది. జార్జి బుష్ తర్వాత అధికారంలోకి వచ్చిన ఒబామా, అప్ఘానిస్తాన్, ఇరాక్‌ల నుంచి అమెరికా సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకొస్తానని, గ్వాటెమాలాలోని సైనిక స్థావరాన్ని మూసేస్తానని హామీ ఇచ్చారు. సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి రప్పించలేకపోయారు. గ్వాటెమాలాలోని స్థావరాన్ని మూసివేయలేకపోయారు. కరేబియన్ జైలును కూడా ఎత్తివేయలేకపోయారు. దేశీయంగా అన్ని జాతుల వారిని ఏకం చేస్తానని, జాతి విద్వేషాలను నిర్మూలిస్తానని పలుసార్లు ప్రకటించారు. ఇందులోనూ ఆయన వైఫల్యం చెందారు. ఇటీవలనే ఇద్దరు నల్లజాతీయులను శ్వేతపోలీసులు కాల్చివేయడం వల్ల అమెరికాలో అల్లర్లు కూడా చెలరేగాయి. వ్యక్తిగతంగా జాతి విద్వేషాలకు వ్యతిరేకించే ఒబామా, అన్యాయంగా చనిపోయిన నల్లజాతీయుల కుటుంబాలను పరామర్శించకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. ప్రజలందరికి ఆరోగ్య సౌకర్యం కల్పిస్తానంటూ 2010లో ఒబామా తీసుకొచ్చిన హెల్త్‌కేర్ పథకం ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఇంటా బయటా, అంటే ఇటు డెమోక్రట్లతో విభేదించి, అటు రిపబ్లికన్లతో గట్టిగా విభేదించి హెల్త్‌కేర్ స్కీమ్‌ను తీసుjiరావడంతో ఆ స్కీమ్‌కు ఒబామా హెల్త్‌కేర్ అని పేరు కూడా వచ్చింది. ఎంతో చిత్తశుద్ధితో ఆయన ఈ ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ పథకం నుంచి పెద్ద ఆరోగ్య బీమా కంపెనీలు ఎప్పుడో తప్పుకున్నాయి. తాను అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను ఎత్తివేస్తానన్న అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్పుడే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా సౌమ్యుడు, మంచి పాలనాదక్షుడు, మంచి ఫ్యామిలీ మేన్ అని పేరు తెచ్చుకున్న ఒబామా ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిన గొప్ప మేలేమీ లేదు. కాకపోతే నాటి బుష్ కన్నా మంచి పాలన అందించారన్న పేరుతో పాటు తన పాలనలో అవినీతి మరక అంటకుండా దిగిపోవడం కూడా విశేషమే. యూరప్, ఆసియా పసిఫిక్, ఉత్తర అమెరికాలో గతేడాది చివరిలో నిర్వహించిన ఓ సర్వేలో కూడా అమెరికా అధ్యక్షుడిగా ఒబామాను 54 శాతం మంది కోరుకుంటున్నారని ‘ప్యూ’ రిసెర్చ్ సెంటర్ వెల్లడించడం గమనార్హం. రెండు గొప్ప విజయాలు విదేశాంగ విధానంలో బరాక్ ఒబామా రాణించలేకపోయారనే విమర్శలు ఉన్నా అంతర్జాతీయంగా రెండు గొప్ప విజయాలు సాధించారు. అందులో ఒకటి ఇరాన్‌తో అణు నియంత్రణ ఒప్పందం కాగా, మరోటి ఆగర్భ శత్రుదేశమైనా క్యూబాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడం. ఈ కారణంగా ఈ రెండు దేశాలపైనా ఆర్థిక ఆంక్షలను ఎత్తేశారు. మధ్యప్రాచ్యంలో, గల్ఫ్‌లో అమెరికా నిర్వహిస్తున్న సైనిక, వైమానిక స్థావరాలను గత అమెరికా అధ్యక్షులలాగానే ఒబామా కూడా కొనసాగించారు. సిరియా పౌరులపై సైన్యం రసాయనిక దాడులకు దిగినా ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను వెనకేసుకరావడం పట్ల కూడా ఒబామాపై విమర్శలు వెల్లువెత్తాయి. -
మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా.. రష్యాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ విషయం నేరుగా ప్రకటించకపోయినా.. దేశాధ్యక్షుల ప్రకటనలు, వాళ్ల సూచలను బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నందున వెంటనే తిరిగి వచ్చేయాలని అన్నారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి చెడిపోతున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పుకోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వీటో చేసేందుకు తమను లాగుతోందని పుతిన్ ఆరో్పించారు. ఆ తర్వాతి నుంచి రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి. అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలయగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడంతో.. ఆయనతో జరగాల్సిన భేటీని పుతిన్ రద్దుచేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే పెద్ద యుద్ధం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ అన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని రష్యా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవ్‌గెనీ బుజిన్స్కీ చెప్పారు. సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో.. పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. -
మా ఆవిడతో కలిసి తాజ్‌మహల్ చూడాలి: ఒబామా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గడిచిన రెండేళ్లలో ఈ ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇది ఎనిమిదోసారి. లావోస్‌లో జరిగిన ఏసియాన్ సదస్సుకు మోదీతో పాటు ఒబామా కూడా హాజరయ్యారు. త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఒబామా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మోదీ ఆయనను మరోసారి భారతదేశానికి ఆహ్వానించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా భారత్ రావాలని చెప్పారు. దానికి ఒబామా కూడా సానుకూలంగా స్పందించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను తాను ఇంతవరకు తన భార్య మిషెల్‌తో కలిసి చూడలేదని, ఒకసారి దాన్ని చూడాలని ఉందని, అందుకోసం తప్పకుండా వస్తానని చెప్పారు. 2008 నాటి ముంబై ఉగ్రదాడులతో పాటు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఈ జనవరిలో జరిగిన దాడికి కారకులను పాకిస్థాన్ గుర్తించి శిక్షించాలని ఏషియాన్ సదస్సు సందర్భంగా ఒబామా, మోదీ ఇద్దరూ గట్టిగా డిమాండ్ చేశారు. తమ పొరుగున ఉన్న ఒక దేశం ఉగ్రవాదాన్ని తయారుచేసి, ఎగుమతి చేస్తోందని పాకిస్థాన్ పేరు చెప్పకుండానే నరేంద్రమోదీ అన్నారు. అలాంటి దేశాల మీద ఆంక్షలు విధించి, వాటిని ఒంటరి చేయాలని చెప్పారు. జి20 సదస్సులో సైతం.. ఒకే ఒక్క దేశం దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని మోదీ అన్నారు. కాగా, జీఎస్టీ బిల్లును ఆమోదించినందుకు ప్రధాని మోదీని బరాక్ ఒబామా అభినందించారు. -
ఒబామాకు దుబాయ్‌లో ఉద్యోగం ఆఫర్
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న బరాక్ ఒబామా.. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎటూ ఖాళీగా ఉంటారు కదా అని ఆయనకు దుబాయ్‌లో ఉద్యోగం ఇస్తానంటూ ఓ లాయర్ ఆఫర్ చేశాడు. తన లా కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, దానివల్ల ఇస్లాం మతంపైన, సహనంపైన ఆయనకు మరింత అవగాహన వస్తుందని ఆ లాయర్ అన్నాడు. ఇస్లాం పట్ల సహనం అంటే అర్థం ఏంటో మరింత బాగా తెలుసుకోడానికి ఈ ఉద్యోగం ఆయనకు ఉపయోగపడుతుందని ఎమిరేటీ లాయర్ ఎయిసా బిన్ హైదర్ ట్వీట్ చేశారు. మంగళవారం నాటికి ఒబామా పదవీ కాలం ఇంకా 247 రోజులు ఉంటుంది. కొత్త అధ్యక్షుడు 2017 జనవరి 20వ తేదీన పదవీ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతంతో పాటు ఉండేందుకు ఇల్లు, అరబ్ దేశాలు తిరిగి రావడానికి టికెట్లు కూడా ఇస్తానని ఆ లాయర్ ఆఫర్ చేశారు. అమెరికన్, పాశ్చాత్య మీడియా ఎప్పుడూ ఇస్లాంను ఉగ్రవాదానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే అది పూర్తి అవాస్తవమని... ఇస్లాం అంటేనే సహనానికి, క్షమాగుణానికి, అర్థం చేసుకోడానికి మారుపేరని చెప్పారు. పాశ్చాత్యులు ఇస్లాంను అర్థం చేసుకుని, ఆమోదించడానికి ఏకైక మార్గం వాళ్లొచ్చి తమతో కలిసి ఉండటమేనని, ఒబామా వైట్‌హౌస్‌ను వదలగానే ఆయనకు తన సంస్థలో ఉద్యోగం ఆఫర్ ఇస్తానని తెలిపారు. అరబ్బులు, ముస్లింలతో కలిసి ఉంటే ఆయనకు సహనానికి అసలైన అర్థం తెలుస్తుందని చెప్పారు. -
90 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖాతాలో మరో రికార్డు చేరనుంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొని చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆయన తాజాగా క్యూబా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే మార్చిలో క్యూబా రాజధాని హవానాలో పర్యటించనున్నారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు మరోసారి క్యూబా గడ్డపై అడుగుపెడుతున్నారు. అమెరికా 30వ అధ్యక్షుడైన కావిన్ కూలిడ్జ్ 1928లో పర్యటించారు. ఒబమా పర్యటన ప్రదర్శన ఉద్దేశం ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడమే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయి దాదాపు 54 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ ప్రతిష్టంభనకు ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, ఒబామా కలిసి 2014 డిసెంబర్లో చరమగీతం పాడారు. మరికొద్ది రోజుల్లో బబామా పదవి ముగియనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
అతడి తల విలువ రూ.33 కోట్లుపైనే!
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది అబు మహ్మద్ అల్ షిమాలి అలియాస్ తిరద్ అల్ జర్బాపై అమెరికా భారీ మొత్తంలో రివార్డు ప్రకటించింది. అతడి సమాచారం తెలిపిన వారికి దాదాపు రూ.33 కోట్లకుపైగా చెల్లిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా గత రాత్రి ఆమోదం తెలిపారు. జర్బా అమెరికా, యూరప్ దేశాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు నిధులను సేకరించడంలో కీలకమైనవాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అల్ కయిదా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేసిన 2005 సంవత్సరం నుంచి జర్బా ఇస్లామిక్ స్టేట్ లో చేరాడు. అప్పటి నుంచి సిరియాలో ఉన్న తమ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగే విదేశీ సైన్య వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో నష్టాన్ని అంఛనా వేసి ఆ మేరకు భర్తీ చేయగలగడంలో మంచి నేర్పరి. ఓ రకంగా ఉగ్రవాదులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి ఇతడే కారణమని కూడా అమెరికా బలగాలు నమ్ముతున్నాయి. అంతేకాదు, ఇతర దేశాలపైకి దాడులకు వెళ్లాలనుకున్నప్పుడు ఏయే ప్రాంతాలనుంచి వెళ్లాలనే విషయాలను చెప్పడంతోపాటు ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు కూడా జర్బానే చూసుకుంటాడట. అందుకే, అతడిని గుర్తించి మట్టుబెడితే ఇస్లామిక్ స్టేట్ కు గండికొట్టినట్లవుతుందని అమెరికా భావిస్తోంది. -
ఫేస్బుక్లో చేరిన ఒబామా
-
ఫేస్బుక్లో చేరిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్బుక్లో చేరారు. తన సొంత దేశంలోనే ఈ సోషల్ మీడియా ప్రారంభమైనా ఇంతకాలం అందులో లేని ఒబామా, తొలిసారి అందులో చేరి.. వాతావరణ మార్పుల గురించి వీడియోను తొలి పోస్టుగా పెట్టారు. దాన్ని ఇప్పటివరకు ఏకంగా 15.25 లక్షల మంది చూశారు. వైట్ హౌస్ బ్యాక్ యార్డులో నడుస్తూ మన అందమైన గ్రహాన్ని రక్షించాలంటూ చెప్పిన వైనాన్ని వీడియో తీయించి.. దాన్ని పోస్ట్ చేశారు. తన తర్వాత వచ్చే అధ్యక్షులు కూడా ఇలాగే పచ్చిక బయళ్లలో నడవాలని కోరుకుంటున్నానని, వాళ్లతో పాటు అమెరికన్లందరూ కూడా మంచి నేషనల్ పార్కులు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, కొండలు, సముద్రాలు అన్నింటినీ ఎంజాయ్ చెయ్యాలనే భావిస్తున్నట్లు అందులో చెప్పారు. ప్రతి నలుగురు పెద్దవాళ్లలో ముగ్గురు ఫేస్బుక్లో ఉంటున్నారని, అలాంటప్పుడు అందరితో భావాలు పంచుకోడానికి ఇదే మంచి సాధనమని భావించి చేరానని అన్నారు. బరాక్ ఒబామా పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంటుకు 4.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ అకౌంటును ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్ అనే సంస్థ నిర్వహిస్తుంది. మే నెలలోనే ట్విట్టర్లో చేరిన ఒబామా, తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా మారారు. -
బాంబులు కురిపించడం, క్షమాణలు చెప్పడమా!
విదేశాల్లోని పౌరకేంద్రాలపై గుడ్డిగా దాడులు జరపడం, అమాయక ప్రజలను బలి తీసుకోవడం, ఆనక తీరిగ్గా క్షమాపణలు చెప్పడం అమెరికా పాలకులకు ఆనవాయితీగా మారిపోయింది. అనేక ఘటనల్లో కనీసం క్షమాపణలు చెప్పకుండా గుడ్డిగా సమర్థించుకున్న సందర్భాలూ ఉన్నాయి. ప్రపంచ పౌరహక్కుల సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన సందర్భాల్లో మాత్రమే అమెరికా పాలకులు క్షమాపణలు చెప్పారు. అలాగే అఫ్ఘానిస్తాన్‌లోని కుందజ్ పట్టణంలో అక్టోబర్ 3న అమెరికా సైనికులు ఓ ఆస్పత్రిపై బాంబులు కురిపించి 22 మంది అమాయకులను బలితీసుకున్న సంఘటనకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పారు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం. 1991, జనవరి 21: బాగ్దాద్ శివారు, అబూ గ్రాహిబ్లోని 'ఇన్‌ఫ్యాంట్ ఫార్ములా ప్రొడక్షన్ ప్లాంట్' పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణసేనలు బాంబుల వర్షం కురిపించి శిశు పాల ఉత్పత్తి కేంద్రాన్ని సమూలంగా ధ్వంసం చేశాయి. ప్రాణనష్టం వివరాలు తెలియలేదు. అది జీవ రసాయన ఆయుధాల ఉత్పత్తి కేంద్రం అవడం వల్లనే దాడులు జరిపామని అప్పటి హెచ్‌డబ్లూ బుష్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1991, ఫిబ్రవరి 13: బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలోని పౌరశిబిరంపై అమెరికా సైన్యం లేజర్ గైడెడ్ బాంబులను కురిపించగా 408 మంది ఇరాకీ పౌరులు మరణించారు. ఆ శిబిరం వద్ద ఇరాక్ సీనియర్ నాయకులు, సైనిక కమాండర్లు కనిపించడం వల్లనే దాడులు జరిపామని అమెరికా పాలకులు సమర్ధించుకున్నారు. 1998, ఆగస్టు 20: సూడాన్‌లోని అల్ షిఫా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీపై అమెరికా క్రూయిజ్ క్షిపణులతో దాడులు జరిపింది. అందులో ఒక పౌరుడు మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఒసామా బిన్ లాడెన్‌తో ఆ ఫ్యాక్టరీకి సంబంధం ఉన్న కారణంగానే తాము దాడులు జరిపామని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1999, ఏప్రిల్ 12: కొసోవో యుద్ధం సందర్భంగా సెర్బియాలోని గ్రెడిలికా వద్ద ఓ రైలుపై అమెరికా ఎఫ్-15ఈ యుద్ధ విమానం క్షిపణులు ప్రయోగించగా 14 మంది పౌరులు మరణించారు. ఆనక 'పొరపాటు' జరిగిందంటూ అమెరికా యంత్రాంగం క్షమాపణలు చెప్పింది. 1999, ఏప్రిల్ 23: కొసోవో యుద్ధం సమయంలోనే సెర్బియా బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రంపై అమెరికా బాంబులు కురిపించింది. 16 మంది ఉద్యోగులు మరణించారు. సెర్బియా అధ్యక్షుడు స్లొబోడన్ మిలోసెవిక్ కమాండ్, కంట్రోల్ కేంద్రం అవడం వల్లనే సైన్యం దాడులు జరిపిందని అప్పటి బిల్ క్లింటన్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1999, మే7: సెర్బియాలోని చైనా ఎంబసీపై అమెరికా యుద్ధ విమానం బాంబులు కురిపించడంతో ముగ్గురు ఎంబసీ సిబ్బంది మరణించారు. 20 మందికి పైగా మరణించారు. 'ఇది ఘోర తప్పిదం. పాత మ్యాప్‌ను ఆధారం చేసుకోవడం వల్ల పొరపాటు జరిగింది' అని అప్పటి అమెరికా రక్షణ మంత్రి విలియం కొహెన్ వివరణ ఇచ్చారు. 2001, అక్టోబర్ 16-26: కాబుల్‌లోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ కాంప్లెక్స్‌పై అమెరికా బాంబుదాడులు. 55వేల మందికి సరిపడా ఆహారం, బ్లాంకెట్లు, ఇతర సామాగ్రి ధ్వంసం. 2003, ఏప్రిల్ 8: బాగ్దాద్‌లోని అల్ జజీరా కార్యాలయంపై దాడి. ఓ జర్నలిస్ట్ మరణించగా, మరో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అక్కడికి సమీపంలో, విదేశీ జర్నలిస్టులు బసచేసిన ఓ పాలస్తీనా హోటల్‌పై అమెరికా బాంబుల దాడి జరపగా ఇద్దరు రిపోర్టర్లు మరణించగా, రాయిటర్స్‌కు చెందిన ఓ కెమెరామన్ మరణించారు. -
మోదీ రాష్ట్రపతి అయ్యారా..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి అయ్యారా..? మనకైతే ఈ విషయం తెలియదు గానీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాత్రం తెలిసిపోయినట్లుంది. అందుకే ఆయన మోదీని 'ప్రెసిడెంట్ మోదీ' అన్నారు. సోమవారం నాడు తమ సమావేశం ముగిసిన తర్వాత ఓ ప్రకటన చేసే సందర్భంలో ఒబామా పొరపాటున ఈ మాట అనేశారు. వైట్ హౌస్ వెబ్సైట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఈ మాట ఉంది. ''ప్రెసిడెంట్ మోదీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది'' అని ఒబామా చెప్పారు. ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో గుప్పుమంది. దాంతో ఆ తర్వాత వైట్‌హౌస్ సిబ్బంది నాలుక కరుచుకుని, దాని రాతప్రతిని విడుదల చేస్తూ.. అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు. -
డియర్ పోటస్.. హేపీ బర్త్‌డే!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ఈ సంవత్సరం మీకు చాలా బాగుండాలని, నూరేళ్లు చల్లగా బతకాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ఆయన ఆశించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు దేశాధినేతలకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు పంపడం మోదీకి అలవాటు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత సందర్శించిన దేశాల అధినేతలకు కూడా ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. Dear @POTUS, wishing you a Happy Birthday! Have a great year ahead. I pray for your long life & may you remain in good health. — Narendra Modi (@narendramodi) August 4, 2015 -
ఆ దాడి మన చరిత్రలో చీకటి అధ్యాయం
వాషింగ్టన్: దక్షిణ కరోలినాలోని చారిత్రక చర్చిపై దాడిపట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా స్పందించారు. అమెరికాలో తుపాకీ సృష్టిస్తున్న విద్వంసాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాన్ని దశలవారిగా చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో నిర్మూలించుకోవాలని కోరారు. 'ఇది ఎంతో విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భం.. అలాగే నిర్మూలించాల్సిన సమయం' అని ఒబామా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ కరోలినాలోని ఎమ్మాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్టు చర్చిపై ఓ శ్వేత జాతీయుడు దాడి చేసి తొమ్మిదిమందిని పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం శ్వేత సౌదం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేయడంతోపాటు శ్వేత జాతీయులు చేస్తున్న చర్యలను విమర్శించారు. ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలకు స్వస్థిపలకాల్సిన అవసరంఉందని, అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఈ మధ్య కాలంలోనే ప్రజలపై తుపాకీ దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. తక్షణమే వీటి విషయంలో వెనక్కి తిరగి చూసుకొని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రికార్డుల ప్రకారం ఇది పద్నాలుగో దాడి అని.. తాజాగా నల్లజాతీయుల చర్చిపై జరిగిన దాడి అందరినీ ప్రశ్నింపజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అమెరికాలో చరిత్రలో మచ్చగా ఉంటుందని, చీకటి అధ్యాయంలాంటిదని చెప్పారు. -
ఒబామా గిన్నిస్ రికార్డు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ట్విట్టర్లో ఖాతా తెరిచిన ఐదు గంటల్లోనే ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించి, ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. @POTUS అనే పేరుతో ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరుమీద తెరిచిన అకౌంట్‌కు కేవలం ఐదు గంటల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చిన విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇంతకుముందు నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22 నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. ఒబామాకు ఇంతకుముందే @BarackObama అనే ఐడీతో ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అధికారిక ఖాతా కోసం దీన్ని కొత్తగా తెరిచి, అంతలోనే పనిలో పనిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించేశారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. ఇది కేవలం బరాక్ ఒబామాది మాత్రం కాదు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేసేస్తామని వైట్‌హౌస్ ఇంటర్నెట్ స్ట్రాటజీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెక్స్ వాల్ తెలిపారు. -
లోకేశ్‌ను కలవొద్దు.. ఒబామాకు ఎన్నారైల లేఖ
భారతదేశం నుంచి వస్తున్న నారా లోకేశ్‌కు అపాయింట్మెంట్ ఇవ్వొద్దంటూ అమెరికాలోని ఎన్నారైలు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. అమెరికాలో ఉన్న కొంతమంది వద్ద డబ్బు సేకరించి, ఆ మొత్తాన్ని డెమొక్రాటిక్ పార్టీకి విరాళం రూపంలో ఇవ్వడానికి వస్తున్నట్లుగా వచ్చేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని.. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని బహిరంగ లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి కొడుకుగా తప్ప లోకేశ్‌కు వేరే ఏ అర్హతా లేదని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులను అత్యంత క్రూరంగా నిర్మూలిస్తున్నారని, ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకుంటున్నారని లేఖలో ఆరోపించారు. ఇక పార్టీ కార్యకర్తల నిధికి చీఫ్ కోఆర్డినేటర్ పదవిలో ఉంటూ.. ప్రపంచవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నుంచి భారీమొత్తంలో డబ్బు సేకరించారని అట్లాంటాకు చెందిన గురవారెడ్డి అనే ఎన్నారై తెలిపారు. ఫండ్ రైజింగ్ ఈవెంట్లో 10 వేల డాలర్లు ఇచ్చి అమెరికా అధ్యక్షుడితో షేక్‌హ్యాండ్ కొనేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని, మళ్లీ స్వదేశానికి వెళ్లాక ఒబామాయే స్వయంగా తనను ఆహ్వానించినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తారని కూడా ఆయనా లేఖలో హెచ్చరించారు. అందువల్ల అసలు లోకేశ్‌ను కలిసే ఆలోచనే పెట్టుకోవద్దని సూచించారు. -
ఒబామా.. ఎస్ఎంఎస్ పంపరు.. ట్వీట్ చేయరు!
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో మహా యాక్టివ్‌గా ఉంటారు. ఏ దేశానికెళ్లినా అక్కడి ఫొటోలు గానీ, అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌తో సెల్ఫీలు గానీ తీసుకుని వెంటనే ట్విట్టర్లో పెట్టేస్తారు. మరోవైపు ఆయనతో ఇటీవలే టీ పంచుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. అసలు ట్వీట్లు కాదుకదా.. కనీసం ఎస్ఎంఎస్లు కూడా పంపరట. అసలు ఆయనకు వీడియో రికార్డింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. ఆయన వద్ద ఉన్నది కేవలం బ్లాక్‌బెర్రీ మాత్రమే. అందులో ఈమెయిళ్లు మాత్రమే పంపుతానని ఒబామా చెప్పారు. భద్రతా కారణాల వల్లే రికార్డింగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ వాడేందుకు తనకు అనుమతి లేదని తెలిపారు. అయితే టీనేజిలో ఉన్న తన కూతుళ్లిద్దరు మాత్రం స్మార్ట్ ఫోన్లు వాడతారని, స్నేహితులకు ఎస్ఎంఎస్లు పంపుతారని అన్నారు. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ ఐడీని కూడా ఎవరికీ చెప్పడానికి తనకు వీల్లేదని ఆయన చెప్పారు. -
మా పోరు ఇస్లాంతో కాదు: ఒబామా
అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ ఇస్లాంకు వ్యతిరేకమనే తీవ్రాదుల వాదనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా దీటైన జవాబిచ్చారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని స్పష్టం చేశారు. గురువారం వైట్‌హౌస్‌లో తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ప్రసంగించిన ఆయన ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి సంస్థల తీరును ముస్లిం ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇస్లాం రాజ్యస్థాపన అంటూ వెర్రెత్తిపోయే ఉగ్రవాదులు.. ముస్లింల జీవన స్థితిగతులను ఏనాడూ పట్టించుకున్నపాపన పోలేదని ఒబామా విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను తృణీకరిస్తాయనే అబద్ధాన్ని యువత మెదళ్లలో నూరిపోయడం ద్వారా ఉగ్రసంస్థలు తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అమెరికా తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించాలని సదస్సులో పాల్గొన్న దాదాపు 60దేశాల ప్రతినిధులను ఆయన కోరారు. -
మా పోరు ఇస్లాంతో కాదు: ఒబామా
వాషింగ్టన్: అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ ఇస్లాంకు వ్యతిరేకమనే తీవ్రాదుల వాదనకు అమెరికా అధ్యక్షుడు ఒబామా దీటైన జవాబిచ్చారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని స్పష్టం చేశారు. గురువారం వైట్‌హౌస్‌లో తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ప్రసంగించిన ఆయన ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి సంస్థల తీరును ముస్లిం ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇస్లాం రాజ్యస్థాపన అంటూ వెర్రెత్తిపోయే ఉగ్రవాదులు.. ముస్లింల జీవన స్థితిగతులను ఏనాడూ పట్టించుకున్నపాపన పోలేదని ఒబామా విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను తృణీకరిస్తాయనే అబద్ధాన్ని యువత మెదళ్లలో నూరిపోయడం ద్వారా ఉగ్రసంస్థలు తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అమెరికా తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించాలని సదస్సులో పాల్గొన్న దాదాపు 60దేశాల ప్రతినిధులను ఆయన కోరారు. -
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా
-
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా
మహాత్మా గాంధీ బతికుంటే.. భారతదేశంలో ప్రస్తుతమున్న పరమత అసహనాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మాట్లాడుతూ మత సహనం గురించి ప్రస్తావించటం అధికార బీజేపీపై విమర్శేనన్న వాదనను శ్వేతసౌధం ఖండించింది. కాగా, తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ.. ''మిషెల్, నేను భారత్ నుంచి తిరిగివచ్చాం. అది అద్భుతమైన, అందమైన దేశం. ఘనమైన భిన్నత్వమున్న దేశం. కానీ.. అక్కడ గత కొన్నేళ్లుగా అన్ని రకాల మత విశ్వాసాల వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. కేవలం తమ సాంస్కృతిక వారసత్వం, నమ్మకాలను బలపరుచుకోవాలనే ఇలా చేస్తున్నారు. ఈ అసహన చర్యలు.. ఆ జాతిని విముక్తం చేసేందుకు దోహదపడిన గాంధీజీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవి'' అని పేర్కొన్నారు. దాదాపు 3,000 మంది అమెరికా, అంతర్జాతీయ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. హింస అనేది ఒక బందానికో, ఒక ప్రాంతానికో ప్రత్యేకం కాదని.. ఈ (మత అసహనం) సమస్యలతో మానవజాతి తన చరిత్ర అంతటా పోరాడుతూనే ఉందని వ్యాఖ్యానించారు.