90 ఏళ్ల నిరీక్షణకు ముగింపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖాతాలో మరో రికార్డు చేరనుంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకొని చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆయన తాజాగా క్యూబా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వచ్చే మార్చిలో క్యూబా రాజధాని హవానాలో పర్యటించనున్నారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు మరోసారి క్యూబా గడ్డపై అడుగుపెడుతున్నారు.
అమెరికా 30వ అధ్యక్షుడైన కావిన్ కూలిడ్జ్ 1928లో పర్యటించారు. ఒబమా పర్యటన ప్రదర్శన ఉద్దేశం ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడమే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయి దాదాపు 54 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ ప్రతిష్టంభనకు ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, ఒబామా కలిసి 2014 డిసెంబర్లో చరమగీతం పాడారు. మరికొద్ది రోజుల్లో బబామా పదవి ముగియనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.