మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం | puja thakur, the military officer gets chance to receive obama | Sakshi
Sakshi News home page

మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం

Published Sun, Jan 25 2015 12:26 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం - Sakshi

మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం

వింగ్ కమాండర్ పూజా ఠాకూర్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించే అరుదైన అవకాశం దక్కిన ఏకైక మహిళా సైనికాధికారిణి. రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి.. ఆయనను సైనిక వందనానికి తోడ్కొని తీసుకెళ్లిన ఏకైక అధికారిణి పూజా ఠాకూర్ మాత్రమే.

ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు, మంత్రులు, ఇతరులతో కూడిన బృందాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా పరిచయం చేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. రాజ్ఘాట్కు బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement