puja thakur
-
భార్య పాత్రలు బోర్ కొట్టవు
‘‘ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ఉంటారు. కానీ, ‘గరుడవేగ’ చిత్రంలో అలా కాదు. 10 ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర ఎక్కువ, మరో పాత్ర తక్కువ కాకుండా ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంది’’ అని కథానాయిక పూజాకుమార్ అన్నారు. రాజశేఖర్, పూజాకుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18ఎం’. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజ చెప్పిన సినిమా ముచ్చట్లు... ► నేను ఇప్పటి వరకూ చాలా స్క్రిప్ట్స్ విన్నాను. కానీ, ప్రవీణ్ సత్తారు 120 పేజీల బౌండెడ్ స్క్రిప్ట్ నాకిచ్చారు. బౌండెడ్ స్క్రిప్ట్ చదవడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అతని విజన్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ‘గరుడవేగ’ లో చేశా. ► యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. డ్రామా, ఎమోషన్స్ కూడా ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీకి మార్గం చూపే సినిమా అవుతుంది. బైక్స్, ట్రైన్స్... యాక్షన్ సీక్వెన్సులు చాలా బాగుంటాయి. సినిమాని థియేటర్లో చూసినప్పుడే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ► ఈ సినిమాలో నాది హౌస్ వైఫ్ క్యారెక్టర్. దేశం కోసం ఎక్కువ టైమ్ కేటాయించే భర్తకు ఏమవుతుందో అని ఎప్పుడూ టñ న్షన్ పడుతూ, భర్త నుంచి కేరింగ్, అటెన్షన్ కోరుకునే భార్యగా నటించా. భార్య పాత్రలు ఎప్పటికీ బోర్ కొట్టవు. పైగా ఆ పాత్రలో చాలా విశేషాలుంటాయి. ► ఈ సినిమాకి ముందు రాజశేఖర్‌గారు పోలీస్‌గా నటించిన కొన్ని సినిమాలు చూశా. అద్భుతంగా నటించారు. ఆయన ఎనర్జీ సూపర్. ‘గరుడవేగ’లో యాక్షన్స్ సన్నివేశాలు చాలా బాగా చేశారు. ► సాధారణంగా క్లైమాక్స్‌లో హీరో, విలన్ మాత్రమే ఉంటారు. కానీ, ఈ మూవీ క్లైమాక్స్‌లోని కొన్ని యాక్షన్ సీన్స్‌లో నేనూ ఉంటా. మలేషియా, జార్జియాలోనూ షూట్ చేశాం. కఠినమైన వాతావరణంలో కష్టపడి చేశాం. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి. -
పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’
త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
హైదరాబాద్ హౌస్ లో మోదీ-ఒబామా చర్చలు
న్యూఢిల్లీ: భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజ్ ఘాట్ కు చేరుకున్న ఒబామా.. అక్కడి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ కు బయల్దేరి వెళ్లారు.ప్రస్తుతం మోదీతో కలిసి ఇక్కడ చర్చలు జరుపుతున్న ఒబామా.. గం.2.45 ని.లకు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించనున్నారు. -
మహిళా అధికారికి అరుదైన అవకాశం
-
మహిళా అధికారికి దక్కిన అరుదైన అవకాశం
వింగ్ కమాండర్ పూజా ఠాకూర్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించే అరుదైన అవకాశం దక్కిన ఏకైక మహిళా సైనికాధికారిణి. రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి.. ఆయనను సైనిక వందనానికి తోడ్కొని తీసుకెళ్లిన ఏకైక అధికారిణి పూజా ఠాకూర్ మాత్రమే. ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. ఆ తర్వాత అమెరికా అధికారులు, మంత్రులు, ఇతరులతో కూడిన బృందాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా పరిచయం చేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. రాజ్‌ఘాట్‌కు బయల్దేరారు.