పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’ | puja thakur leads obama to marchfast, creates record | Sakshi
Sakshi News home page

పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’

Published Mon, Jan 26 2015 12:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’

పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’

త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు.

 

2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement