chewing gum
-
చూయింగ్ గమ్ నమిలితే బరువు తగ్గుతారా..!
చూయింగ్ గమ్ తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా..? ఇది నిజమేనా? బరువు తగ్గడంలో ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది. పూర్తిస్తాయిలో పనిచేస్తుందా? పరిశోధనలు ఏం చెప్పాయి తదితరాల గురించి చూద్దాం!. పిల్లలు, టీనేజ్ పిల్లలు చూయింగ్ గమ్‌ని ఇష్టంగా నములుతుంటారు. కానీ ఇది బరువు ఎలా తగ్గిస్తుంది. చాలామంది అనుకునేది ఇది తినడం వల్ల ఎక్కువ తినాలనే కోరిక ఉండదు కాబట్టి తెలియకుండానే తినడం మానేస్తారని అని భావిస్తారు. అలాగే అల్పాహారం తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుందని, క్యాలరీ నియంత్రణలో సమర్థవంతంగా సహాయపడుతుందని చెబుతున్నారు చాలామంది. మరికొందరూ చూయింగ్ గమ్‌ని నమలడం ద్వారా అనారోగ్యకరమైన చిరుతిండ్ల జోలికి పోకుండా ఉండగలం అని అంటున్నారు. ఇది తినడం వల్ల తెలియకుండానే ఆకలి తగ్గిపోతుంది కాబట్టి బరువు తగ్గడానికి చక్కటి మార్గం అని చాలా మంది అభిప్రాయం దీర్ఘకాలికంగా ఇది మంచిదేనా? సమగ్రంగా బరువు తగ్గాలనుకుంటే చక్కని డైట్ తగినంత వ్యాయామానికి మించిన చక్కటి మార్గం ఇంకొకటి లేదు. ఈ చుయింగ్ గమ్‌ని దీర్ఘకాలికంగా తింటే మంచి కన్నా దుష్పరిణామాలు ఫేస్ చేసే ప్రమాదమే ఎక్కువుగా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణలు. చక్కెర రహిత చుయింగ్ గమ్‌లో కృత్రిమ చక్కెర్లు ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలుంటాయని అంటున్నారు. ఇలా నములుతూ ఉండటం వల్ల దవడం సంబంధ సమస్యలు, జీర్ణ సమస్యలకు దారితీయొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. బరువు తగ్గేందుకు చూయింగ్ గమ్ ఏమి అంత ప్రభావవంతమైనది కాదనే చెబుతున్నాయి. ముఖ్యంగా ఆకలి, క్యాలరీలు వంటివి తగ్గినప్పటికీ సమగ్రంగా బరువు తగ్గుతారా అనేది సందేహమే అంటున్నాయి పరిశోధనలు. జీవనశైలి లేదా ఆహారంలో మార్పులు చేసేటప్పుడూ ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనలు మేరుకు పాటించండి అని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. (చదవండి: స్పైసీ చిప్స్ తినకూడదా? చనిపోతారా..?) -
'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య
ఇటీవలే టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన లబుషేన్ ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడే పనిలో ఉన్నాడు. అయితే లబుషేన్‌కు ఒక అలవాటు ఉంది. ఏ మ్యాచ్ అయినా సరే అతను చూయింగ్ గమ్ లేకుండా గ్రౌండ్లో అడుగుపెట్టడు. ఆరోజు మ్యాచ్ ముగిసేవరకు నోటిలో చూయింగ్ గమ్‌ను నములుతూనే కనిపిస్తుంటాడు. తాజాగా మార్నస్ లబుషేన్ చేసిన ఒక పని ఆలస్యంగా వెలుగు చూసింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో ఆట తొలిరోజు లబుషేన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎప్పటిలానే నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని వచ్చాడు. బ్రేక్ సమయంలో బ్యాటింగ్ సిద్ధమవుతున్న తరుణంలో నోటి నుంచి చూయింగ్ గమ్ కిందపడింది. మట్టిలో పడినప్పటికి దానిని తీసి మళ్లీ నోట్లోనే పెట్టుకున్నాడు. అంపైర్ అనుమతి తీసుకొని మట్టిపాలైన చూయింగ్ గమ్‌ను కింద పడేయకుండా నోటిలో పెట్టుకోవడం ఏంటో అర్థం కాలేదు. అయితే లబుషేన్ మాత్రం చూయింగ్ గమ్‌కు మట్టి అంటినా కూడా పట్టించుకోకుండా తన స్టైల్లో నమలడం ఆరంభించాడు. ఇది కాస్త ఆలస్యంగా వెలుగుచూసినప్పటికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 47 పరుగులు చేశాడు. Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72 — 🌈Stu 🇦🇺 (@stuwhy) June 29, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఇక నాథన్ లియోన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం ఆసీస్‌కు ఇబ్బంది కలిగించే అంశం. తీవ్ర గాయం కావడం.. స్రెచర్ సాయంతో నడుస్తున దృశ్యాలు బయటికి రావడంతో లియోన్ మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. దీంతో ఆసీస్ నలుగురు బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది. Marnus Labuschagne was sleeping and then suddenly realised his turn had arrived. pic.twitter.com/pw1xOk9IeI — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్! -
FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వవ్యాప్తంగా మెస్సీకి యమా క్రేజ్ ఉంది. క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా ఫ్యాన్ బేస్ కలిగిన మెస్సీ చివరి వరల్డ్‌కప్ ఆడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా జట్టుకు ఫిఫా టైటిల్ అందించాలనే లక్ష్యంతోనే మెస్సీ బరిలోకి దిగినట్లుగా అనిపిస్తుంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. మరో మూడు అడుగులు దాటితే కప్ అర్జెంటీనా సొంతం అవుతుంది. అయితే నాకౌట్ దశ కావడంతో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిబాట పట్టాల్సిందే. ఈ స్థితిలో మెస్సీ ఎలా జట్టును ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో మూడు గోల్స్ సాధించిన మెస్సీ ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది గోల్స్ నమోదు చేశాడు. ఈ విషయం పక్కనబెడితే.. ఆటలో మెస్సీ రారాజు మాత్రమే కాదు.. ప్రశాంతతకు మారుపేరు. మ్యాచ్ సమయంలో అతను సహనం కోల్పోయింది చాలా తక్కువసార్లు అని చెప్పొచ్చు. అయితే మెస్సీ కొడుకు మాత్రం అల్లరిలో కింగ్‌లా కనిపిస్తున్నాడు. శనివారం అర్థరాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌కు మెస్సీ భార్య అంటోనిలా రొక్కుజో తన కుమారుడితో హాజరయ్యింది. మ్యాచ్‌లో 35వ నిమిషంలో మెస్సీ గోల్ చేసినప్పుడు కొడుకుతో కలిసి సంతోషాన్ని పంచుకున్న అంటోనిలా మెస్సీకి ప్లైయింగ్ కిస్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కాసేపటికే మెస్సీ కొడుకు తనలోని తుంటరితనాన్ని బయటికి తీశాడు. నోటిలో ఉన్న చూయింగ్ గమ్‌ను బయటకు తీసి తన ఎదురుగా ఫ్యాన్స్‌పైకి విసిరేశాడు. ఈ చర్యతో షాక్ తిన్నా వాళ్లు వెనక్కి తిరిగి చూడగా.. చేసింది మెస్సీ కొడుకని తెలుసుకొని ఏమీ అనలేకపోయారు. అయితే తల్లి అంటోనిలా రొక్కుజో మాత్రం కొడుక్కి చివాట్లు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ఫన్నీ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ''మెస్సీ వారసుడు అంటున్నారు.. అతని లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ పిల్లాడి వల్ల చాలా ముప్పు.. వెంటనే స్కూల్‌కు పంపించేయండి.. వాళ్ల నాన్న కనిపించేసరికి అతనిపై వేద్దామనుకున్నాడు.. కానీ మిస్ అయిపోయింది..'' అంటూ పేర్కొన్నారు. ఇక ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన మెస్సీ బృందం డిసెంబర్ 10న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీ కెరీర్లో 1000వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గోల్ చేసిన మెస్సీ దిగ్గజం మారడోనా రికార్డును బద్దలు కొట్టాడు. Bro who pissed Messi's son Mateo off this much?? 😭😭 pic.twitter.com/GvK0snj7vY — mx (@MessiMX30iiii) December 4, 2022 చదవండి: 60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సిజేరియన్ అయిన అమ్మలు ఇలా చేస్తే మేలు!
సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు రోజుకు మూడుసార్లు చ్యూయింగ్ గమ్ నమిలితే పేగుల కదలికలు బాగా మెరుగుపడతాయంటున్నారు సైంటిస్టులు. సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతోపాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్దకం వంటి పేగులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే. అయితే కేవలం చ్యూయింగ్‌గమ్ నలమడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు. చ్యూయింగ్ గమ్ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిమ్యూలేషన్స్ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి. ఇక రెండోది చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: చనుబాలు ఇస్తున్నారా? అయితే.. -
ఇలాంటి వింత కోరికను ఎప్పుడైనా విన్నారా!
న్యూయార్క్ : చనిపోయేముందు చివరి కోరికలు ఏమైనా ఉంటే వాటిని తీర్చమని పెద్దలు చెప్తుంటారు. కానీ కొంతమంది చివరికోరికలు వింటే మాత్రం ఇవేం కోరికలురా బాబు ..అని అనుకుంటాం. అలాగే మనిషి చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు వారికిష్టమైన స్థలంలో జరగాలని.. అక్కడే సమాధి కూడా కట్టాలని కోరుతుంటారు. కానీ అమెరికాకు చెందిన 94 ఏళ్ల సుట్టి ఎకానమీ ఒక వింత కోరికను కోరాడు. తాను చనిపోయిన తర్వాత ఒక చూయింగ్ గమ్ కంపెనీకి చెందిన పేరును బాక్స్‌పై ఏర్పాటు చేసి అందులోనే తనను ఖననం చేయాలంటూ తెలిపాడు. మొదట అతని కోరిక వింతగా అనిపించినా.. కుటుంబసభ్యులు అతని కోరికను తీర్చేందుకు ప్రయత్నించారు. (చదవండి : రాకాసి దోమల గుంపు: జంతువులు మటాష్!) అసలు విషయానికి వెళ్తే.. సుట్టి ఎకానమీ రెండో ప్రపంచయుద్దంలో పాల్గొన్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉన్న ఆయన .. రిగ్లీ జ్యూసీ ఫ్రూట్ కంపెనీ పేరుతో బాక్స్ ఏర్పాటు చేసి ఖననం చేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులు.. ఈ విషయాన్ని సదరు కంపెనీకి తెలపగా, వారు తమ లోగోను బాక్స్‌పై వేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో శామ్యూల్ ఈ విషయాన్ని ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు భారీగా స్పందన లభించింది. సుట్టి ఎకానమీ ఆఖరి కోరిక తీర్చాలని చాలామంది నెటిజన్లు రిగ్లీ కంపెనీని అభ్యర్థించారు. చివరకు ఆ కంపెనీ వృద్ధుడి ఆఖరి కోరిక తీర్చేందుకు అంగీకరించింది. వృద్ధుడి ఇంటికి కంపెనీ నుంచి 250 ప్యాక్ గమ్ కూడా పంపించింది.(చదవండి : స్కేటింగ్ అదరగొట్టిన కుక్క పిల్ల) -
చూయింగ్ గమ్, గుట్కా, పాన్‌పై నిషేధం
హర్యానా: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హర్యానా ప్రభుత్వం చూయింగ్ గమ్ అమ్మకాలను జూన్ 30 వరకూ నిషేధించినట్లు తాజాగా ప్రకటించింది. ఉమ్మివేయడం ద్వారా కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో చూయింగ్ గమ్‌తో పాటు పాన్ మసాలా, గుట్కాపై కూడా నిషేధం విధించింది. ప్రభుత్వం ఆదేశించిన ఈ నిషేధాన్ని సమవర్థవంతాగా అమలు చేయాలని అధికారులను కోరింది. ‘కరోనా వైరస్ నోటీలోని లాలాజలంతో కూడా వ్యాపిస్తుంది. దీంతో చూయింగ్ గమ్ తినేవారు ఉమ్మివేయడం వల్ల ఆ లాలాజలం ద్వారా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంది’ అని రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ శాఖ వెల్లడించింది. (కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం) అలాగే గత ఏడాదిలో గుట్కా, పాన్ మసాలా, పోగాకుపై విధించిన నిషేధాన్ని కూడా ఏడాది పాటు అమలు చేయాలని సదరు డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సువాసన, రుచిగల పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సున్నం(చునా) పంపిణీనిలపై కూడా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. ఇక రాష్ట్రంలో కరోనా అనుమానితులు 13000 మంది ఉన్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పాన్ మసాలా తయారి, అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. (ఆ వార్డులన్నీ రెడ్ జోన్లు) -
భార్య చూయింగ్ గమ్ తినలేదని...
లక్నో: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ పై చట్టం చేసినా ఇంకా అనుకున్న మార్పు రాలేదు. ఇందుకు ఉదాహరణగా లక్నోలోని రశీద్ అనే వ్యక్తి తన భార్య సిమ్మికి చూయింగ్ గమ్ ఇవ్వగా ఆమె తిరస్కరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనిపై సిమ్మి స్పందిస్తూ తాను 2004లో సయ్యద్ రశీద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని చెప్పారు. అయితే వివాహమైనా కొద్ది రోజుల్లోనే తనను, తన కుటుంబాన్ని వరకట్నం కోసం తీవ్రంగా వేధించేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనిపై నమోదైన కేసు విచారణలో భాగంగా సివిల్ కోర్టులో వాదనలు వినిపించడానికి రాగా, భర్త తనకు చూయింగ్ గమ్ ఇచ్చాడని దీనిని తాను తిరస్కరించగా ఈ కారణంతో మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వాజిర్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం పై ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి మాట్లాడుతూ వారి కుటుంబ కలహాల అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
చూయింగ్ గమ్‌తో క్యాన్సర్!
సిడ్నీ: చూయింగ్ గమ్ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎక్కువగా తింటుంటారు. అయితే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్ గమ్ల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చూయింగ్ గమ్ వల్ల కలిగే దుష్పభ్రావాలపై పరిశోధనలు చేశారు. చూయింగ్ గమ్‌లు, మేయోన్నైస్ (గుడ్డు, వెనిగర్‌తో తయారు చేసే క్రీములు)లను నిత్యం తీసుకోవడం వల్ల కొలన్ క్యాన్సర్ (పేగులకు వచ్చే క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఎలుకలపై పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. చూయింగ్ గమ్‌లో ‘ఈ171’ (టైటానియమ్ డైఆక్సైడ్ నానోపార్టికల్స్) అనే పదార్థం ఉంటుంది. చూయింగ్ గమ్ తరచూ తినడం వల్ల వీటి నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరుతుంది. క్రమంగా అది పేగులకు హాని చేస్తూ క్యాన్సర్‌గా మారుతుందని పరిశోధనలో గుర్తించారు. ఆహారం, మందులు.. తెలుపు రంగులో ఉండేందుకు ‘ఈ171’ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే ‘ఈ171’ వాడే పదార్థాలకు దూరంగా ఉండడమే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
చూయింగ్ గమ్ నమిలారని ప్రొబెషనరీ ఐఏఎస్ సస్పెన్షన్!
సాక్షి, బెంగళూరు: కన్నడ నాడు గీతాన్ని అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారి ప్రీతి గెహ్లాట్‌ను సస్పెండ్ చేశారు. గురువారం తుమకూరు జిల్లా శిరాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కన్నడ నాడు గీతాన్ని ఆలపిస్తుండగా ప్రీతి గెహ్లాట్ చూయింగ్ గమ్ నమిలారంటూ పలు కన్నడ సంఘాలు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రత్నప్రభకు ఫిర్యాదు చేశాయి. దీంతో ప్రీతి గెహ్లాట్‌ను సస్పెండ్ చేస్తూ రత్నప్రభ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మెట్రో రూల్స్.. ఆ పని చేస్తే రూ. 200 ఫైన్
సాక్షి, బెంగళూర్ : మెట్రో రైల్ రవాణా వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచే చర్యలో భాగంగా బెంగళూర్ ‘నమ్మ మెట్రో’ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో, రైళ్లలో పాన్, గుట్కా, చూయింగ్ గమ్‌లను తినడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతిక్రమణ ఉల్లంఘిస్తే 200 రూపాయల ఫైన్ విధించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు చూయింగ్ గమ్‌లు తిని, వాటిని రైళ్లలో, స్టేషన్లలో ఎక్కడపడితే అక్కడ అంటిస్తున్నారు. పాన్లు, గుట్కాలను నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్న ఆ ఆగడాలను కట్టడి చేయలేకపోతున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని నమ్మ మెట్రో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మెట్రో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతలను ప్రయాణికులందరిపై ఉందని.. అది మరిచి పారిశుద్ధ్యాన్ని దెబ్బతీసేవారికి ఇది గుణపాఠమౌతుందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. -
సిజేరియన్ అయిన అమ్మలకు
చ్యూయింగ్ గమ్... సాఫీ విరేచనం! సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణమట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు... జస్ట్... రోజుకు మూడుసార్లు చ్యూయింగ్ గమ్ నమిలితే పేగుల కదలికలు గణనీయంగా మెరుగుపడతాయంటున్నారు. సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతో పాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే. ఇది కొందరిలో కొన్ని దుష్ప్రభావాలకు దారితీసి... ఆ తర్వాత హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితిని కూడా తెచ్చే ప్రమాదం ఉంది. అయితే కేవలం చ్యూయింగ్‌గమ్ నమలడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు. చ్యూయింగ్ గమ్ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిములేషన్స్ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి. ఇక రెండోది చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
చూయింగ్‌గమ్‌తో హుండీలో నగదు చోరీ
♦ యువకుడి అరెస్ట్ కేకేనగర్ : కర్రకు చూయింగ్ గమ్ అతికించి హుండీలో నగదు చోరిచేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేలూరు జిల్లా అరక్కోణం రైల్వేస్టేషన్ సమీపంలో చర్చి ఉంది. ఈ చర్చి హుండీ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు చాలాసేపు నిలబడి ఉన్నాడు. దీంతో అక్కడున్న వారికి అతనిపై అనుమానం కలిగింది. దీంతో చాటుగా ఉండి అతన్ని గమనించగా కర్రకు చూయింగ్‌గమ్ అతికించి హుండీలో నగదు చోరీ చేయసాగాడు. వెంటనే యువకుడిని పట్టుకుని అరక్కోణం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వద్ద విచారణ జరిపారు. అతడు తిరువళ్లువర్ సమీపం చెవ్వాపేట ప్రాంతానికి చెందిన ఆరోగ్యరాజ్ (36) అని తెలిసింది. భార్యతో ఉద్యోగం చేస్తున్నట్లు అబద్దం చెప్పి రోజూ చెవ్వాపేట నుంచి అరక్కోణం రైలులో వచ్చేవాడు. అక్కడు ఆలయ హుండీల్లో నగదు చోరీ చేసి భార్యకు ఇచ్చేవాడని తెలిసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. -
చూయింగ్ గమ్ నమిలితే రూ. 80 కోట్లు ఆదా
చూయింగ్ గమ్ నమలడం ముఖానికి మంచి వ్యాయామమని, అది ముఖ ఆకృతిని అందంగా తీర్చిదిద్దుతుందని వ్యాయామ నిపుణులు చెబుతుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆరోగ్యం కోసం వెచ్చించే సొమ్ము బోలెడు ఆదా అవుతోందట. యూకేలోని ప్లిమౌత్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్‌కు ఏటా దాదాపు రూ. 80 కోట్లు (82 లక్షల పౌండ్లు) ఆదా అవుతుందని తేలింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రతివారం 10 లక్షల మంది ఎన్హెచ్ఎస్ ద్వారా దంత సంబంధిత సేవలు పొందుతున్నారు. తద్వారా ఎన్హెచ్ఎస్పై ఏటా దాదాపు రూ. 33,634 కోట్ల భారం పడుతోంది. దంత సంబంధిత సమస్యల కారణంగా 12 ఏళ్ల లోపు పిల్లల్లో 35 శాతం మంది హాయిగా నవ్వలేకపోతున్నారని ఓ అధ్యయనంలో గుర్తించారు. దీనికి సరైన పరిష్కారం చూయింగ్ గమ్ నమలడమేనని వారు పేర్కొంటున్నారు. ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత చక్కెర రహిత చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటిలో ఉమ్ము ఉత్పత్తి అవుతుందని, అది పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించడంలో సహకరించడమే కాకుండా.. పళ్లను బలహీనపరిచే ప్లేక్ యాసిడ్స్‌ను క్రమబద్ధీకరిస్తుందని చెప్పారు. అందువల్ల పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చూయింగ్ గమ్ నమలడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ లిజ్ కే స్పష్టం చేశారు. అధ్యయనం ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ప్రజలు తమ నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ విధానం ఎంతగానో సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు ఒక సుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమిలితే ఎన్హెచ్ఎస్ కు ఏడాదికి దాదాపు రూ. 27 కోట్లు ఆదా అవుతుందని వివరించారు. అదే రోజుకు రెండు చూయింగ్ గమ్స్ తీసుకోవడం వల్ల దాదాపు రూ.32 కోట్లు, మూడు చూయింగ్ గమ్స్ వల్ల దాదాపు రూ.80 కోట్లు ఆదా చేయొచ్చని తెలిపారు. ఈ విధానాన్ని కేవలం 12 ఏళ్ల లోపు పిల్లలకే కాకుండా మిగతావారికి వర్తింపజేస్తే మరింతగా సొమ్ము ఆదా అవుతుందని పేర్కొన్నారు. -
నెట్‌ఇంట్లో
మడుగు అట్టడుగున దాగున్న దుర్యోధనుడిని రెచ్చగొట్టితే తప్ప బయటకి రాలేదు. ఇంటర్నెట్ గొప్పతనం ఏమిటంటే సరస్సు అడుగున తొమ్మిదేళ్లుగా శాశ్వత నిద్రలో ఉన్నవాడు కూడా ఇంటర్ నెట్ దృష్టిని తప్పించుకోలేదు. ఇంటర్నెట్ విచిత్రాలు ఇన్నిన్ని కావు. ఎక్కడ ఏం జరిగినా చటుక్కున పట్టేసి ప్రపంచానికి అందిస్తుంది. ఏ మూలన ఏ రహస్యం దాగున్నా చిటికలో ఛేదిస్తుంది. బాల్యం నుంచి వార్ధక్యం దాకా, పుట్టుక నుంచి చావు దాకా... ఇంటర్నెట్ నుంచి ఏమీ దాగవు. చూయింగ్ గమ్ అతికించే ప్రేమికుల గోడను శుభ్రపరచడం నుంచి, పాలెస్తీనాలోని ఓ ఇంట్లో బాలుడికి రక్తం చిందించడం నేర్పడం దాకా ఏవీ నెట్ కళ్ల నుంచి తప్పించుకోలేవు. ఇంటర్ నెట్ పశ్నలు లేవనెత్తుతుంది. సమాధానాలనిస్తుంది. కుదుపుతుంది. కుదుటపరుస్తుంది. ఆ నెట్టింటి కబుర్లు మీ కోసం... గోడ-గోడు (చూయింగ్ గమ్‌లాంటి లవ్‌స్టోరీ) చూయింగ్ గమ్‌కి ప్రేమకి సంబంధం ఏమిటి? చూయింగ్ గమ్‌లా ప్రేమ కూడా ఎంత సేపైనా కొనసా....గుతుందనా? లేక రెండు హృదయాలు అతుక్కుపోతాయనా? ఏమో తెలియదు కానీ ప్రేమికులకు చూయింగ్ గమ్‌కి ఉన్న సంబంధం తెలియాలంటే అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న గమ్ వాల్కి వెళ్లాల్సిందే. అక్కడ ప్రేమికులు తమ హృదయాలను గమ్ వాల్కి చూయింగ్ గమ్ రూపంలో అతికించేసుకుంటారు. వివిధ రంగులు, వివిధ ఆకారాలున్న లక్షలాది చూయింగ్ గమ్‌లను దశాబ్దాలుగా అతికించేసుకుంటున్నారు. ఓ రకంగా ఆ గోడ ప్రేమ చరితకు మౌన సాక్షి అన్న మాట. అందుకే ఎక్కడెక్కడి వాళ్లు అమెరికాలోని సియాటిల్‌కి వెళితే తప్పకుండా గమ్ వాల్ని చూసేందుకు వెళ్తారు. అయితే ఈ గమ్స్‌ను ఎలుకలు తెగ ప్రేమించేసుకుంటున్నాయట. దాంతో ఎలుకల్ని తరిమేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రేమ చూయింగ్ గమ్‌లను ఇప్పుడు అధికారులు తొలగిస్తున్నారట. ఆ ఒక్క గోడకు 2000 పౌండ్ల బరువున్న చూయింగ్ గమ్ ఉందట మరి. అయితే ఇలా తమ ప్రేమ గుర్తులన్నీ కొట్టుకుపోతాయని ప్రేమికులు తెగ బాధపడిపోన్నారట. గూగుల్ డిటెక్షన్ నెట్ నిజాల్ని తవ్వి తోడి తీస్తుంది. మిస్టరీలను ఛేదిస్తుంది. అలా ఓ గూగుల్ మ్యాప్ తొమ్మిదేళ్ల మిస్సింగ్ మిస్టరీని ఛేదించింది. ఇంటర్నెట్ ఇన్నేళ్ల రహస్యాన్ని బహిర్గతం చేసింది.తొమ్మిదేళ్ల క్రితం 72 ఏళ్ల డేవిడ్ లీ నైల్స్ చనిపోయాడు. 2006 అక్టోబర్‌లో క్యాన్సర్ బాధితుడైన నైల్స్ ఒక మిత్రుడి ఇంటి నుంచి ఉన్నట్లుండి బయలుదేరాడు. ఆ తరువాత ఆయన అజా అయిపూ లేకుండా పోయాడు. అప్పట్నుంచీ అతని కోసం ఎంతో వెతికారు. కానీ జాడ తెలియలేదు. చివరికి తొమ్మిదేళ్ల తరువాత గూగుల్ మ్యాప్స్‌లో ఆయన ఇంటికి దగ్గర్లో ఉన్న మిషిగన్ బైరాన్ టౌన్ షిప్‌లోని ప్రాంతాన్ని మిత్రుడొకరు చూస్తుంటే అందులో ఒక చెరువులో ఒక కారు జాడ కనిపించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్‌లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధుని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్... మిచిగన్.. బైరాన్ టౌన్ షిప్ లోని.. జేక్స్ బార్ అనే చెరువులో కనిపించాడు. చివరికి వెతికితే అందులోంచి నైల్స్ కారు, కారులో అతని అస్థిపంజరం లభించింది. అతని దంతాల సాయంతో అతడిని గుర్తించారు. గూగుల్ మ్యాప్స్ చిత్రంలో కారు పై భాగం స్పష్టంగా కనిపించింది. ఇలా తొమ్మిదేళ్ల తరువాత నైల్స్ అస్థిపంజరానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అతని సమాధిపై ‘డేవిడ్ లీ నైల్స్... ఎప్పుడు ఎలా చనిపోయాడో తెలియదు’ అని ఆయన బంధువులు రాశారు. ఇలా గూగుల్ మ్యాప్స్ క్రైమ్ డిటెక్షన్లోనూ పనిచేస్తోంది. మేక్ ఏ విష్ పట్టుమని ఇరవై ఎనిమిదేళ్లు లేవు. ప్రాణం తీసే క్యాన్సర్ పట్టుకుంది. ఆఖరి ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ కుర్రాడు తన తీరని కోరిక గురించి మిత్రులకు చెప్పాడు. అదేమిటంటే పెళ్లి చేసుకోవాలి. అయితే మృత్యువు చేరువలో ఉన్న వాడినెవరు చేసుకుంటారు? అందుకే మనిషి రూపంలో, మనిషి సైజులో ఉన్న డాల్ని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అంతే... మిత్రులు ఓ డాల్‌ను తెచ్చిచ్చారు. ఆ బొమ్మను పెళ్లికూతురులా అలంకరించారు. మనోడు పెళ్లికొడుకైపోయాడు. బొమ్మకు ఫీలింగ్సేమ ఉండవు కానీ, మనోడు మాత్రం పెళ్లిని ఒరిజినల్ పెళ్లిలానే ఫీలై అమ్మాయికి.. కాదు కాదు బొమ్మాయికి ఫుల్‌గా మేకప్ వేయించాడు. మోకాలిపై కూర్చుని నన్ను పెళ్లిచేకొమ్మని బొమ్మను అడిగాడు. వేలికి ఉంగరం తొడిగాడు. ముద్దు కూడా పెట్టుకున్నాడు. అరటి చెట్టుకి, కుక్కకీ ఇచ్చి పెళ్లి చేసే ఆచారాలున్న మనకు ఇందులో అంత ఆశ్చర్యం ఏమీ కనిపించకపోవచ్చు కానీ, పాశ్చాత్యులకు మాత్రం ఇది పరమ వింతగా కనిపిస్తోంది. నెట్ మహిమ!! నెట్టింట్లో ఏవి ఎందుకు షేర్ అవుతాయో చెప్పడం కష్టం. ఒకచోట వెండి తెర తారలు వైరల్ అయితే కొండొకచో బార్బర్ షాప్ యజమానీ వేననవేలుగా వైరల్ కావచ్చు. పోర్ట్ టాల్బట్ కి చెందిన జేమ్స్ విలియమ్స్ అనే బార్బర్ ఆటిజం వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడికి హెయిర్ కట్ చేశాడు. ఆ బాలుడి కోసం అతను పడ్డ అష్టకష్టాలు ఎవరో చూసి వీడియోలు తీసి, ఫోటో చేసి ఫేస్ బుక్‌లో పెట్టారు. అంతే.. ప్రజలకు ఎందుకు నచ్చిందో తెలియదు కానీ, తెగ షేర్ చేసేశారు. మేసన్ అనే కుర్రాడికి ఆటిజం వ్యాధి ఉంది. చెవి దగ్గరికి కత్తెర రానీయడు. దాంతో అతనితో ఆటలాడి, సెల్ ఫోన్ ఇచ్చి బిజీగా ఉంచి ఎలాగోలా పని కానిచ్చేశాడు. కూర్చుని, పడుకుని, పాకుతూ, దేకుతూ హెయిర్ కట్ చేశాడు. దీన్ని ఆయనకు తెలియకుండానే ఎవరో ఫేస్బుక్లో షేర్ చేశారు. అది అలా అలా అంతటా పాకిపోయింది. ‘థ్యాంక్స్ జిమ్ ఫర్ ది ట్రిమ్’ అని ఆ పిల్లవాడి తండ్రి కామెంట్ చేశాడు. నా కొడుకు నీ దగ్గరకే వస్తానంటున్నాడు అని కూడా అన్నాడు. ఇప్పుడు జేమ్స్ విలియమ్స్ ఓర్పును, నేర్పును మెచ్చిన ఇతర తల్లిదండ్రులు కూడా జేమ్స్ విలియమ్స్ దగ్గర క్యూ కడుతున్నారట. నెట్ మహిమ మరి!! కొత్త గాలి వీస్తోంది కాలం మారింది. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించండి అని ఈ యాడ్ చెబుతోంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఒక సినిమాని చూస్తుంటారు. కాస్త పాతకాలం ఆయన ‘‘ఫరవాలేదు. సినిమాకి యూ సర్టిఫికేట్ ఇచ్చేయండి’’ అంటాడు. కొత్తతరం ప్రతినిధి మాత్రం ‘‘లేదండీ ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వాలి’’ అంటాడు. ‘‘ఇందులో ఎక్స్పోజింగ్ ఏముంది’’ అంటారు వాళ్లు ఆశ్చర్యంగా. ‘‘హీరో ఈ సినిమాలో ఏడు సార్లు టాప్ లెస్‌గా కనిపించాడు’’ అంటాడు మన కుర్రాడు. అంతా నవ్వుతారు. ‘‘అదేమిటండీ... అమ్మాయి టాప్ లెస్ అయితే న్యూడ్... అబ్బాయి టాప్ లెస్ అయితే డ్యూడ్ ఎలా అవుతాడు’’ అని ప్రశ్నిస్తాడు. నిజమే కదా... మనలోనూ ఆలోచనను రేకెత్తించే యాడ్ ఇది. ఇది కొత్త గాలి వీస్తోందని చెప్పే ఓ ఫ్యాన్ యాడ్ అయినా మనల్ని షేక్ చేసే ఓ సీరియస్ పశ్న వేసి, మన ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపుతుంది. -
పూజాఠాకూర్.. తొలి ‘లీడర్’
త్రివిధ దళాల సైనిక వందనం కార్యక్రమానికి దేశంలోనే తొలిసారిగా ఒక మహిళా అధికారి నేతృత్వం వహించింది. అది కూడా అమెరికా అధ్యక్షుడికి గౌరవసూచకంగా నిర్వహించిన కార్యక్రమంతో.. ఆ అధికారి వైమానిక దళంలో వింగ్ కమాండర్ పూజాఠాకూర్. కాగా ఈ అవకాశం లభించడంపై ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పూజాఠాకూర్ పేర్కొన్నారు. ‘‘పురుషులైనా, మహిళలైనా ఒకేలా శిక్షణ ఇస్తారు. ఇద్దరూ సమానమే. కానీ సైనిక వందనానికి నేతృత్వం వహించే అవకాశం రావడం, అది కూడా ఒబామా కార్యక్రమానికి కావడం గర్వంగా ఉంది..’’ అని ఆమె చెప్పారు. 2000వ సంవత్సరంలో భారత వైమానిక దళంలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చేరిన పూజాఠాకూర్ ప్రస్తుతం వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డెరైక్టరేట్ ఆఫ్ పర్సనల్ ఆఫీసర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
కెమిస్ట్రీ పండింది..!
ఒబామా, మోదీల మధ్య కుదిరిన సాన్నిహిత్యం, పెరిగిన అనుబంధం ఒబామా పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఇరువురు కలిసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో పేలిన చమత్కారాల్లో అది మరింత స్పష్టమైంది. భారతీయులకు ‘మేరా ప్యార్ భరా నమస్కార్’ అంటూ హిందీలో శుభాకాంక్షలు తెలిపిన ఒబామా.. మోదీతో తన సాన్నిహిత్యంపై జోక్స్ కూడా వేశారు. ‘హైదరాబాద్ హౌస్ లాన్లో ఈ రోజు.. రోజులో ఎంతసేపు నిద్రపోతాం అనే విషయం సహాచాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాకన్నా మోదీ చాలా తక్కువగా నిద్రపోతారు. అయినా ఆయనింకా అధికారానికి కొత్త కదా! అధికారంలో ఇంకో ఐదారేళ్లు ఉంటే ఇంకో గంట అదనంగా నిద్రపోతారు’ అంటూ ఒబామా చమత్కరించారు. ‘చాయ్ పే’కు థాంక్యూ! 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు మోదీని దగ్గర చేసిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని ఆదివారం మోదీతో కలిసి పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఒబామా ప్రస్తావించడం విశేషం. అంతకుముందే హైదరాబాద్ హౌస్ గార్డెన్లో ఒబామాకు మోదీ స్వయంగా టీ కలిపి ఇచ్చిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘ప్రైమ్ మినిస్టర్ మోదీ.. థాంక్యూ.. నాతో జరిపిన చాయ్ పే చర్చ సహా నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్యూ’ అన్నారు. ఇలాంటి చాయ్ పే చర్చ కార్యక్రమాలు చాలా వాషింగ్టన్లోనూ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. -
బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
-
బరాక్ ఒబామా.. చ్యూయింగ్ గమ్
ఒకవైపు సైనిక దళాలు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తోంది. అయితే.. ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. వేడుకలు చూస్తూ చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. మధ్యమధ్యలో దాన్ని బయటకు తీసి, మళ్లీ నోట్లోకి పెట్టుకుంటూ ఫొటోలకు దొరికేశారు. రంగురంగుల తలపాగా ధరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కనే నల్లటి సూటులో వచ్చిన ఒబామా కూర్చున్నారు. ఇంతకుముందు బీజింగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సమితి (అపెక్) సమావేశాల సమయంలో కూడా ఒబామా ఇదే తరహాలో చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రేగింది. ఆ సదస్సులో పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు చ్యూయింగ్ గమ్ నములుతూ, తీస్తూ కనిపించారని, సదస్సుకు వచ్చేటప్పుడు కూడా అలాగే చేశారని ఇంగ్లండ్ పత్రిక 'ద ఇండిపెండెంట్' అప్పట్లో విమర్శించింది. -
జపాన్‌లో సుదీప్ ‘చ్యూయింగ్ గమ్’
మన భారతీయ నటుల్లో జపనీయుల అభిమానం సంపాదించుకున్న తొలి నటుడు రజనీకాంత్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా జపాన్‌లో ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ చానల్స్‌లో ఎన్టీఆర్ డాన్సులు చూసి, ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడీ జాబితాలో కన్నడ నటుడు సుదీప్ చేరారు. ఆయన జపనీయుల అభిమానం సంపాదించుకోవడానికి కారణం తెలుగు చిత్రం ‘ఈగ’. ఈ బహు భాషా చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. జపాన్‌లో కూడా ఈ చిత్రం విడుదలైంది. ఇందులో సుదీప్ నటనకు జపాన్‌లో అభిమానులు ఏర్పడ్డారు. ఓ చ్యూయింగ్ గమ్ ఉత్పత్తిదారుడైతే, సుదీప్ ఫోటోని ఉపయోగించుకున్నాడు. చ్యూయింగ్ గమ్‌కి సంబంధించిన కవర్‌పై సుదీప్ ఫొటోని ముద్రించాడు. మామూలుగా అయితే ఈ విషయం సుదీప్‌కి తెలిసి ఉండేది కాదు. కానీ, ఒక్క జపాన్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఇటీవల సుదీప్ బ్యాంకాక్‌లో షూటింగ్ చేస్తుండగా, ఈ చ్యూయింగ్ గమ్స్ ఆయన కంటపడ్డాయి. ‘స్వీట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది’ అని అంటున్నారు సుదీప్. దేశం కాని దేశంలో ఇలాంటి అభిమానం దక్కినందుకు ఆనందంగా ఉందని, జపాన్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. -
ఈ నోటి దుర్వాసన అందుకేనా?
నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు టెన్షన్ తెలియకుండా, చాక్లెట్లు, చ్యూయింగ్ గమ్‌లు నములుతుండటం అలవాటయింది. ఈ మధ్య నా స్నేహితులు నా నోటినుంచి దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. - కృష్ణకౌశిక్, సికిందరాబాద్ ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందే. పని చేస్తున్నప్పుడు కొందరు చాక్లెట్లు, పిప్పరమెంట్లు, చ్యూయింగ్ గమ్ వంటివి నములుతూ ఉంటారు. వీటిలో ఉండే చక్కెర పదార్థాలు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సహజంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ప్రమాద స్థాయిలో పెరిగిపోతుంది. దాంతో లాలాజలం పీహెచ్ వాల్యూలో ఆమ్లస్వభావం పెరిగిపోయి, సులభంగా పంటిజబ్బులు వస్తాయి. వీటిలో పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. పంటికి అతుక్కుపోయే ఆహార పదార్థాల వల్ల పళ్లసందుల్లో పాచి పేరుకుపోయి, చిగుళ్ల జబ్బులూ వస్తాయి. అందుకే బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చాలామంది అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికే ఖరీదైన టూత్పేస్ట్లు వాడితే నోటి దుర్వాసన పోతుందనుకుంటారు. అలాగే మంచి బ్రష్‌లు వాడటం లేదా నోరు పుక్కిలించే మౌత్ వాష్‌లు, నోటిస్ప్రేలు వాడటం, మరికొందరయితే ఆయిల్ పుల్లింగ్ లాంటి సొంతవైద్యాలూ చేస్తూ ఉంటారు. అందరూ తెలుసుకోవలసింది ఒకటే... పైన చెప్పినటువంటి ఏ ప్రయత్నాల వల్లా నోటి దుర్వాసనను శాశ్వతంగా పోగొట్టలేరు. నోటి దుర్వాసన అనేది పళ్లు లేదా చిగుళ్ల జబ్బులకు సంబంధించిన ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనికి సరైన చికిత్స జరగాలే తప్ప మరే ప్రయత్నాలూ ఫలించవు. అదే సమయంలో ఎక్కువ కాలం నిర్లక్ష్యం మంచిది కాదు. ఒకవేళ చిగుళ్ల జబ్బులు ఉండి ఉంటే నిర్లక్ష్యం వల్ల జబ్బు మరింత పెరిగి, చిన్న వయసులోనే పళ్లు వదులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెంటనే స్పెషలిస్టును కలిసి, వారి సలహా మేరకు చికిత్స చేయించుకోవడం మంచిది. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్