ఇటీవలే టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన లబుషేన్ ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడే పనిలో ఉన్నాడు. అయితే లబుషేన్‌కు ఒక అలవాటు ఉంది. ఏ మ్యాచ్ అయినా సరే అతను చూయింగ్ గమ్ లేకుండా గ్రౌండ్‌లో అడుగుపెట్టడు. ఆరోజు మ్యాచ్ ముగిసేవరకు నోటిలో చూయింగ్ గమ్‌ను నములుతూనే కనిపిస్తుంటాడు.
తాజాగా మార్నస్ లబుషేన్ చేసిన ఒక పని ఆలస్యంగా వెలుగు చూసింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో ఆట తొలిరోజు లబుషేన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎప్పటిలానే నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని వచ్చాడు. బ్రేక్ సమయంలో బ్యాటింగ్ సిద్ధమవుతున్న తరుణంలో నోటి నుంచి చూయింగ్ గమ్ కిందపడింది. మట్టిలో పడినప్పటికి దానిని తీసి మళ్లీ నోట్లోనే పెట్టుకున్నాడు.
అంపైర్ అనుమతి తీసుకొని మట్టిపాలైన చూయింగ్ గమ్‌ను కింద పడేయకుండా నోటిలో పెట్టుకోవడం ఏంటో అర్థం కాలేదు. అయితే లబుషేన్ మాత్రం చూయింగ్ గమ్‌కు మట్టి అంటినా కూడా పట్టించుకోకుండా తన స్టైల్‌లో నమలడం ఆరంభించాడు. ఇది కాస్త ఆలస్యంగా వెలుగుచూసినప్పటికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 47 పరుగులు చేశాడు.
Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72
— 🌈Stu 🇦🇺 (@stuwhy) June 29, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఇక నాథన్ లియోన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం ఆసీస్‌కు ఇబ్బంది కలిగించే అంశం. తీవ్ర గాయం కావడం.. స్రెచర్ సాయంతో నడుస్తున దృశ్యాలు బయటికి రావడంతో లియోన్ మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. దీంతో ఆసీస్ నలుగురు బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది.
Marnus Labuschagne was sleeping and then suddenly realised his turn had arrived. pic.twitter.com/pw1xOk9IeI
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023
చదవండి: Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment