Ashes 2023: Commentators Steal Ice Cream And Shows Is More Important, Video Viral - Sakshi
Sakshi News home page

Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా!

Published Thu, Jun 29 2023 7:28 PM | Last Updated on Thu, Jun 29 2023 8:01 PM

Is-Ice Cream-More important-Commentators Steal The Show-Ashes 2023 - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తిగా మొదలైంది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాను.. ఇంగ్లండ్‌ 416 పరుగుల వద్ద తొలి సెషన్‌లోనే ఆలౌట్‌ చేసింది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున సాధిస్తుండడం విశేషం. జాక్‌ క్రాలే 45, బెన్‌ డకెట్‌ 25 పరుగులతో ఆడుతున్నారు.

ఈ విషయం పక్కనబెడితే.. రెండో టెస్టు సందర్భంగా కామెంటరీ ప్యానెల్‌లో కామెంటేటర్లు చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీరియస్‌గా మ్యాచ్‌ సాగుతుంటే కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీం తింటుండడం ఆసక్తి కలిగించింది. అయితే మార్క్‌ టేలర్‌ తన చేతిలో ఐస్‌క్రీం పెట్టుకొని పక్కనే ఉన్న ఇషా గుహాను ఊరించేలా చేశాడు.

అయితే ఇషా గుహా మాత్రం తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా మార్క్‌ టేలర్‌ చేతిలో ఉన్న ఐస్‌క్రీం నుంచి ఒక పీస్‌తో క్రీం​ తీసుకొని రుచి చూడడం ఆసక్తి కలిగించింది. మొత్తానికి మైదానంలో జరుగుతున్న విషయాలను కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీమ్‌ తింటూ బిజీగా ఉండడం ఏంటని అభిమానులు కామెంట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక యూజర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

చదవండి: సూర్య, డివిలియర్స్‌నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు?

అభిమానుల డిమాండ్‌; అశ్లీల వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయిన ఫుట్‌బాలర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement