Comentaters
-
Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా!
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తిగా మొదలైంది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాను.. ఇంగ్లండ్ 416 పరుగుల వద్ద తొలి సెషన్లోనే ఆలౌట్ చేసింది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున సాధిస్తుండడం విశేషం. జాక్ క్రాలే 45, బెన్ డకెట్ 25 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. రెండో టెస్టు సందర్భంగా కామెంటరీ ప్యానెల్లో కామెంటేటర్లు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీరియస్‌గా మ్యాచ్ సాగుతుంటే కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీం తింటుండడం ఆసక్తి కలిగించింది. అయితే మార్క్ టేలర్ తన చేతిలో ఐస్‌క్రీం పెట్టుకొని పక్కనే ఉన్న ఇషా గుహాను ఊరించేలా చేశాడు. అయితే ఇషా గుహా మాత్రం తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా మార్క్ టేలర్ చేతిలో ఉన్న ఐస్‌క్రీం నుంచి ఒక పీస్తో క్రీం తీసుకొని రుచి చూడడం ఆసక్తి కలిగించింది. మొత్తానికి మైదానంలో జరుగుతున్న విషయాలను కామెంటరీ చేయాల్సింది పోయి ఐస్‌క్రీమ్ తింటూ బిజీగా ఉండడం ఏంటని అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక యూజర్ తన ట్విటర్లో షేర్ చేశాడు. #Ashes2023 Day 1 Commentators steal the show🤣 Ice Cream is more important 😛 pic.twitter.com/dgUC0S2NSg — SoRaD 🇮🇳❤️🇷🇺 (@risingstar_de) June 29, 2023 చదవండి: సూర్య, డివిలియర్స్నే మించిపోయాడు.. ఎవరయ్యా నువ్వు? అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ -
WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా
లండన్: టీమిండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా కార్తీక్ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లండన్ చేరుకున్న అతను క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. ఆటగాడిగా కొనసాగుతూనే కామెంటేటరీ చేయనున్న కార్తీక్ చిరస్మరణీయ మ్యాచ్‌ను గొప్పగా మలుచుకోనున్నాడు. జట్టులో ఆటగాడిగా లేకున్నా.. కామెంటేటరీ రూపంలో చారిత్రాత్మక మ్యాచ్‌లో భాగమయ్యే అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన కార్తీక్ లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌తో కలిసి దిగిన ఒక సెల్ఫీని తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. '' లాంచ్ డేట్ విత్ లెజెండ్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనిని బట్టి చూస్తే ఈ ఇద్దరు క్వారంటైన్ పీరియడ్‌ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన టెస్టు సిరీస్‌కు కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు.. కానీ ఇంట్లో నుంచి వర్చువల్ రూపంలో కామెంటరీ చేశాడు. తాజాగా సౌతాంప్టన్ వేదికగా జరగనున్న చాంపియన్‌షిప్ మ్యాచ్‌ను మాత్రం మైదానం నుంచే కామెంటరీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక కేకేఆర్ తరపున ఆడుతున్న కార్తీక్ టెస్టు చాంపియన్‌షిప్ ముగియగానే సెప్టెంబర్ 19 నుంచి మూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్‌లను ఆడనున్నాడు. మరోవైపు టీమిండియా కివీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొనడానికి యూఏఈ వెళ్లనుంది. చదవండి: చారిత్రక మ్యాచ్‌కు అంపైర్లు ఖరారు.. జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్ WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్లో Lunch date with the legend! pic.twitter.com/qhYrfRJqf3 — DK (@DineshKarthik) June 8, 2021 -
భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు రచిస్తున్నారు . గురువారం భారత్- శ్రీలంక మ్యచ్‌లో శ్రీలంక గెలుపుకు ఆ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సూచనలే కారణమని కెప్టెన్ మాథ్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు సంగక్కర శ్రీలంక ఆటగాళ్ల శిక్షణ శిభిరంలో పాల్గొని యువ ఆటగాళ్లకు బ్యాటింగ్ టిప్స్ అందించాడు. ఈ సూచనలు అమలు చేసిన లంకేయులు భారత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు ఆ దారిలోనే సఫారీలు నడుస్తున్నారు. ఇక ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో భారత్‌ను మట్టికరిపించేందుకు ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సలహాలు తీసుకుంటున్నారు. శుక్రవారం సఫారీల ప్రాక్టీస్ సెషన్లో గ్రేమ్ స్మిత్ పాల్గొన్నాడు. సుమారు 35 నిమిషాలపాటు వారి శిక్షణను గమనించాడు. ఆ జట్టు ప్రధాన కోచ్ రస్సెల్ డొమింగో, సహాయక సిబ్బందితో భారత్ మ్యాచ్‌కు అనుసరించే ప్రణాళికలపై ముచ్చటించాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకంజీతో ప్రస్తావించగా.. గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా గొప్ప కెప్టెన్ అని ఆయన సూచనలు ఆటగాళ్లకు విలువైనవని బదులిచ్చాడు. భారత్ జరిగే మ్యాచ్‌కు ఆటగాళ్లు ఎలా సిద్దం కావాలని స్మిత్ తన అభిప్రాయాలను ఆటగాళ్లతో పంచుకున్నాడని నీల్ పేర్కొన్నాడు. స్మిత్ చాంపియన్స్ ట్రోఫీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.