ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగులు పిండుకుని పీడకలను మిగిల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్
పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా శుక్రవారం.. ఆతిథ్య జట్టుతో నాలుగో వన్డేలో తలపడింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
27 బంతుల్లోనే
ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 312 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 63, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 87 పరుగులు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మూడు బౌండరీలు, ఏడు సిక్సర్లు బాది 62 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.
స్టార్క్‌కు పీడకల
ఇక లివింగ్‌స్టోన్ ఖాతాలోని ఏడు సిక్స్‌లలో నాలుగు స్టార్క్ బౌలింగ్‌లో బాదినవే. అది కూడా ఆఖరి ఓవర్లో కావడం విశేషం. 39వ ఓవర్లో స్టార్క్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన లివింగ్‌స్టోన్.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, మూడో బంతి నుంచి స్పీడు పెంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
186 పరుగుల తేడాతో విజయం
ఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టి కాంగరూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తదుపరి బ్రిస్టల్ వేదికగా ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగనుంది.
స్టార్క్ చెత్త రికార్డు
లివింగ్‌స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా స్టార్క్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు జేవియర్ డోహర్టి పేరిట ఉండేది. బెంగళూరులో 2013లో టీమిండియాతో మ్యాచ్‌లో అతడు 26 పరుగులు ఇచ్చుకున్నాడు.
చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣
Incredible final over hitting from Liam Livingstone 💪💥
🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024
Comments
Please login to add a commentAdd a comment