యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్‌బాల్ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.
పిచ్ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు
కాగా మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్‌స్టాఫ్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్ ఎండ్‌లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు.
కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్ స్టాప్ ఆయిల్' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్ టర్మినెల్స్‌ను కాపాడాలంటూ జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిస్ట్ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది.
ఏమిటీ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’?
పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు.
ఈ ఏడాది బ్రిటన్‌లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ప్రీమియర్‌షిప్ రగ్బీ ఫైనల్‌కు, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లలోనూ తమ నిరసన గళం వినిపించారు.
ఆశ్చర్యపరిచిన బెయిర్ స్టో చర్య..
ఇదంతా సీరియస్‌గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్‌కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్ స్టో అతనికి సర్ది చెప్పాడు.
కాగా బెయిర్ స్టో చర్యకు అభిమానులు షాక్ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్ స్టో తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023
Good start to the 2nd test.
Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr
— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023
చదవండి: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
‘పాకిస్తాన్ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’
Comments
Please login to add a commentAdd a comment