protesters
-
ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)అధినేత ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ నేతృత్వం వహించిన ఈ కవాతు సోమవారం సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది.సోమవారం రాత్రి లక్షలాది తరలి వచ్చిన ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. నిరసన కారులు రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. రహదారులను మూసివేశారు. ఇస్లామాబాద్ చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేశారు. తొలగించుకుంటూ నిరసనకారులు ముందుకు రాగా టియర్ గ్యాస్ ప్రయోగించి కట్టడి చేశారు. దీంతో ఆందోళన కారులు పోలీసులపై దాడికి పాల్పడటంతో అయిదుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు, అనేకమంది గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు చేసిన దాడిలో ఒక పోలీసు అధికారి మరణించగా, 119మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. ఆందోళనకారుల్లోనూ నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగుతుండటంతో పాక్ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. -
మణిపూర్‌లో మళ్లీ హింస... మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మైతీ వర్గానికి చెందిన వారి ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది. ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్‌లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడి చేశారు. శాసనసభ్యుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో జిరిబామ్ జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బంద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ముగ్గురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.కైషామ్‌థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు సపం నిషికాంత సింగ్‌ను తిడ్డిమ్ రోడ్‌లోని ఆయన నివాసంలో కలవడానికి నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయ భవనాన్ని లక్ష్యంగా చేసుకొనిదాడులు చేశారు.కాగా ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటంట్లు జిరిబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో భద్రతా దళాలకు, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలు శనివారం ఉదయం గుర్తించారు. -
ఇజ్రాయెల్‌లో నిరసనలు
జెరుసలేం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌ను తొలగించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తా యి. వీధుల్లోకొచ్చిన నిరసనకారులు ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని, కొత్త రక్షణ మంత్రి బందీ ఒప్పందానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెతన్యాహు దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కొందరు ఆందోళనకారులు అయలోన్ హైవేపై నిప్పు పెట్టడంతో ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్టోబర్ 7న హమాస్ బందీలుగా తీసుకున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం కూడా గెలాంట్ను తొలగించడాన్ని ఖండించింది. తొలగింపును.. విడుదల ఒప్పందాన్ని పక్కకుపెట్టే ప్రయత్నాలకు కొనసాగింపుగా పేర్కొంది. రాబోయే రక్షణ మంత్రి యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అపహరణకు గురైన వారందరినీ తక్షణమే తిరిగి తీసుకురావడానికి సమగ్ర ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాలు... ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలెంట్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చే వివాదాస్పద ప్రణాళికలపై విభేదాలు రావడంతో నెతన్యాహు 2023 మార్చిలో తొలిసారిగా గాలెంట్‌ను తొలగించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో తిరి గి నియమించారు. ఈ సంఘటన ‘గాలెంట్ నైట్’ గా ప్రసిద్ధి చెందింది. అయితే గాజాకు యుద్ధానంత ర ప్రణాళిక సమస్యను పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని ఈ ఏడాది మేలో గాలెంట్ బ హిరంగ అసహనం వ్యక్తం చేశారు. గాజాలో పౌర, సైనిక పాలనను చేపట్టే యోచన ఇజ్రాయెల్‌కు లేదని నెతన్యాహు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్ అల్ట్రా ఆర్థోడాక్స్ పౌరులను సైన్యంలో పనిచేయడం నుంచి మినహాయించే ప్రణాళికలపై గాలెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నెతన్యాహు స్పందిస్తూ ప్రత్యర్థి పాలస్తీనా గ్రూపులు హమాస్, ఫతాహ్లను ప్రస్తావిస్తూ.. హమస్తాన్ను ఫతాస్తాన్గా మార్చడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతల మధ్య విశ్వాస సంక్షోభం తొలగింపు దాకా దారితీసిందని నెతన్యాహు చెప్పారు. ఇటీవలి నెలల్లో ఆయనపై తన విశ్వాసం క్షీణించిందని, అతని స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం– గాలెంట్ కాగా, తొలగింపు అనంతరం గాలెంట్ స్పందించా రు. ఇజ్రాయెల్ భద్రత ఎప్పటికీ తన జీవిత లక్ష్యమ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు అంశాలపై విభేదాల కారణంగానే తనను పదవి నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి పూర్తి ప్రకటన విడుదల చేశారు. సైనిక సేవకు మినహాయింపులు ఉండకూడదని, పాఠాలు నేర్చుకోవాలంటే జాతీయ విచారణ అవసరమని, బందీలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గాజాపై యుద్ధంలో ఇజ్రా యెల్‌కు ప్రధాన మద్దతుదారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజునే గాలెంట్‌ను తొలగిచండం చర్చనీయాంశమైంది. నెతన్యాహు కంటే గాలెంట్కు వైట్ హౌస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంత్రి గాలెంట్ కీలక భాగస్వామిగా ఉన్నారని వైట్‌హౌ స్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు తెలిపా రు. సన్నిహిత భాగస్వాములుగా ఇజ్రాయెల్ తదుప రి రక్షణ మంత్రితో కలిసి పనిచేస్తామని చెప్పారు. -
బంగ్లాదేశ్ అల్లర్లు: షేక్ హసీనా పార్టీ నేతలే టార్గెట్!
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా చేస్తున్న అల్లర్లు కొనసాగుతున్నాయి. నిరసనకారుల అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. తన సోదరితో కలిసి భారత్‌కు వచ్చారు. అయితే ఆమె భారత్ చేరిన తర్వాత నుంచి నిరసనకారులు షేక్‌హసీనా పార్టీ నేతలను టార్గేట్ చేసి దాడులు మరింత తీవ్రం చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. దేశవ్యాప్తంగా షేక్‌హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలినట్లు స్థానిక మీడియాలో వెల్లడిస్తోంది. దేశ రాజధాని ఢాకాకు 100 కి.మీ దూరంలోని కొమిల్లా నగరంలో మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిరసనకారలు నిప్పుపెట్టారు. మంగళవారం ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్ ఇంటికి ఆందోళనకారులు గుంపు నిప్పు పెట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంట్లో, బాల్కనీల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం ఢాకాలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాలకు నిసరనకారులు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా షేక్ హసీనా పార్టీ నేతలు, మైనార్టీలైన హిందువులే లక్ష్యంగా దాడులకు తెగపడ్డారు. సోమ, మంగళవారం సుమారు 97 ప్రాంతాల్లో మైనార్టీలకు సంబంధించిన ఇళ్లు, షాప్‌లపై నిరసనకారులు దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ప్రధాన కార్యదర్శి రాణా దాస్‌గుప్తా పేర్కొన్నారు. దక్షిణ బాగర్హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయటంతో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక ఆసుపత్రి అధికారి తెలిపారు. ఖుల్నా డివిజన్లోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది సజీవదహనం అయ్యారు. ఈ హోటల్ జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది. మృతదేహాలు హోటల్లోని వేర్వేరు అంతస్తుల్లో పడి ఉన్నాయని ఖుల్నా ఫైర్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మమున్ మహమూద్ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో మొత్తం 440 మంది మరణించగా.. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలు 20 మంది ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. మరోవైపు.. షేక్ హసీనా దేశం విడిచివెళ్లిపోవటంతో మంగళవారం బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని మహ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. ఆయన ఆర్మీ, విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డాక్టర్ ముహమ్మద్ యూనస్ చీఫ్‌గా నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము’అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఆమె ఓటమి.. ప్రధాని నివాసంలో రచ్చ.. పార్లమెంట్లో ధూమపానం చేస్తూ.. (ఫొటోలు)
-
Bangladesh: నిరసనకారులకు సైన్యం మద్దతు.. చిక్కుల్లో ప్రధాని హసీనా?
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ల నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చిక్కుల్లో పడబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు.. నిరసనకారులకు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆందోళనకారులకు, పాలక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులపై ఇకపై కాల్పులు జరపబోమని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు చర్చల కోసం ప్రధాని హసీనా చేసిన ప్రతిపాదనను విద్యార్థి నాయకులు తిరస్కరించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (సీఏఎస్) ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో సమావేశమైన దరిమిలా ఇకపై నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చబోమని ప్రకటించారు. అలాగే అధికార మార్పిడి అప్రజాస్వామికంగా జరిగితే బంగ్లాదేశ్ కూడా కెన్యాలా మారుతుందని వ్యాఖ్యానించారు. 1971 తర్వాత దేశంలో ఇదే అత్యంత హింసాత్మక నిరసన అని ఆయన పేర్కొన్నారు.కాగా నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ నజ్ముల్ అహ్సాన్ కలీముల్లా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఉద్యమం తీవ్రతరమైతే, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. -
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. -
పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
మిర్పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్‌కు, 11న లాంగ్ మార్చ్‌కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్‌తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్‌లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్‌చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత
లాస్ఏంజెలిస్: పాలస్తీనా–ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్ఏంజెలెస్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్ హాల్లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్‌కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు! -
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సీఏఏ’పై నిరసనలు.. అస్సాం పోలీసుల సీరియస్ వార్నింగ్
గువహతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం(మార్చ్11) నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సీఏఏ చట్టంపై బంద్‌కు పిలుపిచ్చిన అస్సాం ప్రతిపక్ష పార్టీలకు ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఏఏ చట్టం రూల్స్ నోటిఫై చేసిన వెంటనే సోమవారం సాయంత్రం నుంచే అస్సాంలో ప్రతిపక్షపార్టీలు ఆందోళనలకు దిగాయి. రాజధాని గువహతితో పాటు చాలా ప్రాంతాల్లో సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు కాల్చివేశారు. చట్టం అమలు చేయడానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. దీంతో పోలీసులు ఈ ఆందోళలపై ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగే సర్బత్మక్ బంద్‌లో భాగంగా ఎవరైనా ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పౌరులను గాయపరచడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టాన్ని వారి నుంచే పూర్తిగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ఎక్స్(ట్విటర్)లో పోలీసులు ఒక పోస్ట్ చేశారు. ఆదివారమే ఈ విషయమై సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర హెచ్చరిక చేశారు. Guwahati police gave a legal notice to the Political parties who have called for a 'Sarbatmak Hartal' in Assam to protest against the CAA. "Any damage to public/ private property including Railway and National Highway properties or injury to any citizen caused due to 'Sarbatmak… pic.twitter.com/vnO6uin76t — ANI (@ANI) March 12, 2024 సీఏఏ చట్టం అమలుపై ఆందోళనలు చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దయ్యే చాన్స్ ఉందని సీఎం బిశ్వశర్మ హెచ్చరించారు. ఎవరికైనా చట్టం పట్ల అభ్యంతరాలుంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. కాగా, 2019 డిసెంబర్లో సీఏఏపై అస్సాంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఐదుగురు పౌరులు చనిపోయారు. ఈ చట్టం అమలు చేస్తే బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి భారీగా వలసలు ఉంటాయని పలు పార్టీలు, గ్రూపులు భావిస్తున్నాయి. ఇదే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. ఆ స్టేట్స్లో సీఏఏ చట్టం ఉండదు -
రాహుల్ గాంధీకి ఖలిస్థానీ సిక్కుల నిరసన సెగ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు బ్రేక్ ఇచ్చి ఇటీవల లండన్ పర్యటించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సీటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వెళ్లారు. అయితే రాహుల్ గాంధీకి జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఖలీస్థానీ అనుకూల సిక్కుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. అయితే బిజినెస్ స్కూల్ అధికారుల జోక్యంతో నిరసన అదుపలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోలీసులు.. ఖలీస్థానీ అనుకూల సిక్కు నిరసనకారులను జడ్జ్ బిజినెస్ స్కూల్లోకి తాము అనుమతించలేదని పేర్కొనటం గమనార్హం. పరమజిత్ సింగ్ పమ్మా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరసన తెలిపినట్లు యూకే పోలీసులు తెలిపారు. పరమజిత్ సింగ్ పమ్మా.. యూరప్‌లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కో-ఆర్డినేటర్. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అమృత్సర్ హత్యలకు కారణం గాంధీ కుంటుంబమేనంటూ నిరసన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టే పలు విదేశి పర్యటనల్లో సైతం ఆయన తమ నిరసన తప్పించుకోలేరని నిరసనకారులు సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఖలీస్థానీ అనుకూల సిక్కుల నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం అనతంరం.. యూకే పోలీసులు కల్పించిన పటిష్టమైన భద్రత నడుమ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగినట్లు తెలిసింది. అయితే ఈ నిరసన ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. -
మరాఠా రిజర్వేషన్ ఉద్యమం.. ప్రభుత్వానికి అల్టిమేటం
ముంబయి: మహారాష్ట్రాలో మరాఠా కోటా ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే అల్టిమేటం జారీ చేశారు. రేపు(శనివారం) ఉదయం 11 గంటల వరకు తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని గడువు విధించారు. మరాఠా కోటా అంశంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని జరాంగే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబయిలోని ఆజాద్ మైదానంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం పొరుగున ఉన్న నవీ ముంబైలోని శివాజీ చౌక్‌లో నిరసనకారులను ఉద్దేశించి జరాంగే ప్రసంగించారు. "నేను రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మేము ఆజాద్ మైదాన్‌కు వెళితే.. నేను దానిని వెనక్కి తీసుకోను" అని జరాంగే చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు మంజూరు చేసే వరకు నిరసనకారులు ఆందోళనను మధ్యలోనే ఆపేది లేదని ఆయన పిలుపునిచ్చారు. అయితే.. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లను ఆమోదించినట్లు మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ చెప్పారు. ప్రభుత్వ విధానాల ప్రకారం వాటిని అమలు చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం
ఇటానగర్: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు -
నాన్చకండి.. నిర్ణయం తీసుకోండి: మాజీ బీజేపీ మంత్రి
ముంబై: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ చేస్తోన్న పోరు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బీజీపీ జాతీయ సెక్రెటరీ పంకజా ముండే ఈ అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు హామీలివ్వడం కాకుండా కచ్చితమైన చర్యలు చేపట్టాలని నిరసనకారులతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలని కోరారు. కేంద్రానికి అప్పగించండి.. బీజేపీ మాజీ మంత్రి పంకజా ముండే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శివశక్తి పరాక్రమ యాత్రలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె మరాఠా రిజర్వేషన్లపై ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఎంతవరకు పెంచవచ్చన్న ప్రణాళిక ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉండే ఉంటుంది కాబట్టి నిరసనకారులతో ధైర్యంగా చర్చలు నిర్వహించాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి 50% కంటే రిజర్వేషన్ ఇవ్వలేమనిపిస్తే అప్పుడు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకుని వెళ్తే వారు రాజ్యాంగబద్ధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారని అన్నారు. హామీలొద్దు.. మరాఠా సమాజం ఇప్పటికే విసిగిపోయిందని కచ్చితమైన కార్యాచరణ కావాలని అన్నారు. అనవసరంగా మరాఠాలు ఓబీసీలకు మధ్య తగువులు పెట్టవద్దని విన్నవించారు. అదే విధంగా నిరసనకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ... మీ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆందోళనలను విరమించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్లాజ్‌ను తొలగించండి.. ఇటీవల జల్నా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 11 రోజులుగా దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే పాటిల్ దీక్షను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల ధ్రువీకరణ పత్రం పొందుకుని ఓబీసీ రిజర్వేషన్ సాధించాలంటే వంశపారపర్యం ధ్రువీకరణ పత్రం తప్పదంటూ ప్రభుత్వ చేసిన తీర్మానం(జీఆర్) నుంచి ఆ క్లాజ్‌ను తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు గడిచిన వారం రోజుల్లో మరింత ఉధృతం చేశారు నిరసనకారులు . అహ్మద్‌నగర్, , ధారాశివ్, నాందేడ్, జల్నా, హింగోలి, ఔరంగాబాద్, పర్భని జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. ఇది కూడా చదవండి: TS Election 2023: అమిత్‌షా సభ విజయవంతమైనా.. చేరికలు లేక డీలా..! -
Manipur Violence: మళ్లీ మణిపూర్‌లో హింస
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో రావణకాష్టంగా మారుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం అర్ధరాత్రిదాటాకా బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై జరిగిన దాడిలో తండ్రీకుమారుడు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. క్వాక్టా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆందోళనకారులు వీరిపై కాల్పులు జరిపి తర్వాత కత్తులతో నరికారు. చురాచాంద్‌పూర్ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. తమ వారి మరణంతో ఆగ్రహించిన స్థానికులు ప్రతీకారం తీర్చుకునేందుకు చురాచాంద్పూర్కు బయల్దేరబో యారు. వీరిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. అయితే దాడికి ప్రతీకారంగా ఉఖా తంపాక్ పట్టణంలో పలువురి ఇళ్లను నిరసనకారులు తగలబెట్టారు. శనివారం ఉదయం మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసుసహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. మళ్లీ హింసాత్మక ఘటనలు పెరగడంతో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పాలనా యంత్రాంగం కుదించింది. బంద్ ప్రశాంతం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ శాంతి నెలకొనాలంటూ 27 శాసనసభ స్థానాల సమన్వయ కమిటీ ఇచ్చిన 24 గంటల సాధారణ బంద్ ఇంఫాల్ లోయలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు, స్కూళలు మూతబడ్డాయి. అల్లర్లతో అవస్థలు పడుతున్న జనాన్ని మరింత ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ బంద్’ అని సమన్వయ కమిటీ ఎల్.వినోద్ స్పష్టంచేశారు. కుకీ మిలిటెంట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాన్నాళ్ల తర్వాత చర్చలు పునరుద్ధరించబడిన తరుణంలో అల్లర్లు మొదలవడం గమనార్హం. మరోవైపు శాంతిస్థాపనకు చర్యలు చేపట్టాలని స్థానిక తెగల నేతల ఫోరం(ఐటీఎల్ఎఫ్) విజ్ఞప్తిచేసింది. -
ఫ్రాన్స్‌లో ఐదో రోజూ అల్లర్లు
పారిస్: ఫ్రాన్స్‌లో అల్లర్లు ఐదో రోజూ కొనసాగాయి. ఆందోళనకారులు మేయర్ నివాసంపైకి మండుతున్న కారుతో దూసుకువచి్చ దాడికి యతి్నంచారు. పోలీసులతో ఆందోళనకారులు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే, గత నాలుగు రోజులతో పోలిస్తే అల్లర్ల తీవ్రత తగ్గింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు శనివారం రాత్రి మరో 719 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రెలో ట్రాఫిక్ పోలీసులు నేహల్ అనే యువకుడిని కాల్చి చంపడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నేహల్ అంత్యక్రియలు శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. శనివారం రాత్రి పారిస్‌లో చాంప్స్ ఎలిసీస్ వద్ద గుమికూడిన యువకుల గుంపును పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. ఫ్రెంచి గుయానాలో తుపాకీ బుల్లెట్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. పారిస్ ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు బాణసంచా కాల్చుతూ, రోడ్లపై అడ్డంకులు పెట్టారు. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి వారిని పోలీసులు చెదరగొట్టారు. -
పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్‌బాల్ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు కాగా మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్‌స్టాఫ్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్ ఎండ్‌లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు. కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్ స్టాప్ ఆయిల్' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్ టర్మినెల్స్ను కాపాడాలంటూ జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిస్ట్ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది. ఏమిటీ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’? పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది బ్రిటన్‌లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ప్రీమియర్‌షిప్ రగ్బీ ఫైనల్‌కు, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లలోనూ తమ నిరసన గళం వినిపించారు. ఆశ్చర్యపరిచిన బెయిర్ స్టో చర్య.. ఇదంతా సీరియస్‌గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్‌కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్ స్టో అతనికి సర్ది చెప్పాడు. కాగా బెయిర్ స్టో చర్యకు అభిమానులు షాక్ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్ స్టో తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 Good start to the 2nd test. Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023 చదవండి: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! ‘పాకిస్తాన్ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’ -
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడికిపోయిన ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది. కొన్ని జిల్లాల్లో నిరసనకారులకి, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది. -
ఫారిన్ ఏజెంట్ బిల్లుపై రణరంగంగా జార్జియా
తిబ్లిస్: జార్జియా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లు రణరంగానికి దారితీసింది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రాజధాని తిబ్లిస్లోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులకు, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జురాబ్ జపారిడ్జ్ సహా 66 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జురాబ్ను బాగా కొట్టినట్టుగా కూడా వార్తలు వెలువడ్డాయి. జార్జియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుపై స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రకారం 20 శాతానికి పైగా విదేశీ నిధులు కలిగిన స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు తమని తాము విదేశీ ఏజెంట్లుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రకటించుకోకపోతే జైలు శిక్షతో పాటుగా భారీగా జరిమానాలు విధిస్తారు. -
వణికిపోతున్న చైనీయులు.. సంచలనంగా మారిన జిన్‌పింగ్ ప్లాన్?
కొద్ది నెలల క్రితం డ్రాగన్ కంట్రీ చైనాను కరోనా వైరస్ మరోసారి వణికించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో పాటిజివ్ కేసులు, మరణాలు సంభవించడంతో చైనా ప్రభుత్వం చైనీయులపై కఠిన ఆంక్షలు విధించింది. కాగా, జిన్‌పింగ్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అయితే, కరోనా వ్యాప్తి సమయంలో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న చాలా మంది చైనీయులు కనిపించకుండా పోతున్నారు. దీంతో, ఈ విషయంతో చైనాతో పాటు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఈ విషయాన్ని విదేశీ మీడియా కనిపెట్టింది. ఇక, మిస్ అవుతున్న వారిలో ఎక్కువగా చైనా మహిళలు ఉండటం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల ప్రకారం.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై ఇప్పుడు జిన్‌పింగ్ చర్యలకు దిగుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చైనా ప్రభుత్వం ఇప్పటివరకు 100 మందిని చడీచప్పుడు చేయకుండా అదుపులోకి తీసుకుని అజ్ఞాతంలోకి తరలించిన వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా వీరంతా అమెరికా, బ్రిటన్‌లో చదువుకుని వచ్చిన రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, సంగీతకారులు ఉన్నట్లు సమాచారం. అయితే, ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులపై జిన్‌పింగ్ ప్రభుత్వం కన్నేసి ఉంచింది. వీరితో ఆందోళనలకు దిగేలా ప్రేరేపించిన వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో తనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిన్‌పింగ్ వ్యూహాల్లో భాగంగానే నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లోనూ అదే జరిగింది. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్‌తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్‌తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్‌ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్‌లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్‌ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీలంకలో మళ్లీ భగ్గుమంటున్న నిరసనలు.. ఐ డోంట్ కేర్ అంటున్న రణిల్
కొలంబో: శ్రీలంక గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహోజ్వాలలు కట్టలు తెంచుకోవడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందేమో! అనేలోపు మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక మరోవైపు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేని పార్లమెంట్‌ని రద్దు చేసి, ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. దీంతో రణిల్ ప్రతిపక్షాల డిమాండ్‌ని తిరస్కరించడమే కాకుండా పాలన మార్పు లక్ష్యంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వచ్చిన వాటిని అణిచేవేసేందకు కచ్చితంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతానని నొక్కి చెప్పారు. ముందుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు పార్లమెంట్‌ను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. అదీగాక రాజపక్స స్థానంలో వచ్చిన విక్రమిసింఘే మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేసేంతవరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు రణిల్ ప్రభుత్వానికి ఎన్నికల విశ్వసనీయత లేదంటూ ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిస్తున్నాయి. ఐతే ఆర్థిక సంక్షోభంలో రణిల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నెలక్నొన అశాంతి కాస్త రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి గత జూలై నెలలో గోటబయ రాజపక్సను వెళ్లగొట్టారు. ఆయన వెళ్లిపోయిన తదనంతరమే నిరసనలు అణిచివేసి శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విక్రమసింఘే మాట్లాడుతూ ఇలాంటి నిరసనులు మళ్లీ పునరావృతమైతే అణిచివేసేందకు సైన్యాని దింపుతానని కరాకండీగా చెప్పేశారు. తనను నియంతగా పిలచినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనివ్వనని చెప్పారు. ఒకవేళ నిరసకారులు వీధి నిరసనలు నిర్వహించాలనుకుంటే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడకుండా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దే దింపే ఏ ప్రణాళికను అనమితించనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రయత్నాలకి ఆందోళనకారులు మళ్లీ మళ్లీ తెగబడితే వాటిని ఆపేలా అత్యవసర చట్టాలను సైతం ఉపయోగిస్తానని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు రణిల్ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రవాద నిరోధక చట్టం కింద ఇప్పటికే ఇద్దరు నిసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ ఆసుపత్రిపై రష్యా సేనల దాడి.. శిశువుతో సహా ముగ్గురు మృతి) -
Hijab: నిరసనకారులకు గుణపాఠమా?!
హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన అందరికీ ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానించింది. 290 మంది సభ్యులున్న ఇరాన్ పార్లమెంటులో 227 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మసూద్ సెతాయ్షి నవంబర్ 6వ తేదీన పార్లమెంటు సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలియజేశారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 15 వేల మంది అరెస్టయ్యారు. నిర్ణయాత్మక శిక్ష అంటే మరణ శిక్షా అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇరాన్ కోర్టులు ఎలా వ్యవహరిస్తాయనేది చూడాలి. మనిషి మనుగడ పూర్తిగా ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళిపోవడం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవాంఛనీయం. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన సుమారు 15 వేల మందికి ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి నియమించిన 16 మంది మానవ హక్కుల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. నవంబర్ 11వ తేదీన ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిరసనలను, ఉద్యమాలను అణచి వేయాలనే లక్ష్యంతో ఇరాన్ ప్రభుత్వం విధించిన శిక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ప్రాథమికమైన స్వేచ్ఛను సాధించుకోవడానికి చేస్తున్న ఉద్యమాలను అణచివేసే పద్ధతిని మానుకోవాలని కోరారు. ఇప్పటికే... అంటే అక్టోబర్ 29న తెహరాన్ రాష్ట్ర పరిధిలోని ఇస్లామిక్ రివల్యూషన్ కోర్టు ఈ ఉద్యమంలో పాల్గొన్న 8 మందికి మరణశిక్షను విధించింది. ఇరాన్ చట్టం ప్రకారం ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం’ అనే నిబంధన ప్రకారం ఈ శిక్షలు విధిస్తారు. అదేవిధంగా అదే కోర్టు ప్రాసిక్యూటర్ మరో వేయిమంది పేర్లను ఈ కేసులో చేర్చారు. దీని తర్వాతనే ఇరాన్ పార్లమెంటు అన్ని కోర్టులకు ఇదే విధమైన కఠిన చర్యలను తీసుకోవాలని తీర్మానించింది. ఒక ఉద్యమంలో పాల్గొన్నందుకు మూకుమ్మడిగా ‘15 వేల మందికి’ పైగా కార్యకర్తలకు ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించాలని ఒక ప్రజాప్రతినిధుల సభ తీర్మానం చేయడం ప్రపంచ చరిత్రలోనే చాలా దుర్మార్గమైన చర్య. ఇంతమందికి గుణపాఠం నేర్పాలని ఇరాన్ ప్రభుత్వం ఎందుకు అంతగా ఉద్రేకపడుతున్నదనేది ప్రశ్న. ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఇరాన్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 638లో పేర్కొన్నదాని ప్రకారం హిజాబ్‌ను ఉల్లంఘిస్తే, పదిరోజుల నుంచి రెండు నెలల వరకు జైలు శిక్షను అనుభవించాలి. 55,500 రూపాయల జరిమానాను చెల్లించాలి. ఇంకా అవసరమైతే 74 కొరడా దెబ్బల శిక్షను కూడా అమలు చేస్తారు. కోర్టుకన్నా ముందు హిజాబ్‌ను సక్రమంగా పాటిస్తు న్నారా లేదా అని పర్యవేక్షించడానికి ‘మెరాలిటీ పోలీసు’ ప్రత్యేక విభాగమే ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న 22 ఏళ్ళ కుర్దిష్–ఇరానియన్ యువతి మహసా అమీని హిజాబ్‌ను సక్రమంగా ధరించలేదని అరెస్టు చేశారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులతో ఉంది. తెహరాన్ నగరాన్ని చూడటానికి కుటుంబ సమేతంగా వచ్చింది. అమీనీని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించుకొని, తీసుకెళ్ళారు. అదే వాహనంలో ఆమెను కొట్టి, తీవ్రంగా హింసించినట్టు ఆమె సోదరుడు చెప్పారు. ముఖం ఉబ్బిపోయి, కాళ్ళు చేతులు నల్లగా మారిపోయిన స్థితిలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పితే, వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. మూడు రోజుల తర్వాత మహసా అమీని మరణించింది. ప్రభుత్వం మాత్రం ఆమె గుండెనొప్పితో బాధపడితే కుటుంబానికి అప్పజెప్పామని ప్రకటించింది. ఈ దారుణానికి నిరసనగా, వేలమంది వీధుల్లోకి వచ్చి ‘మహిళ–జీవితం–స్వేచ్ఛ’ అంటూ యావత్ ప్రపంచమే కదలిపోయే మహిళా ప్రభంజనానికి ఊపిరిలూదారు. ప్రపంచ మహిళా ఉద్యమాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలువదగిన మహోద్యమాన్ని ప్రారంభిం చారు. పోలీసులు, భద్రతా బలగాలు తమ నిర్బంధ కాండతో ఉద్యమాన్ని అణచివేయాలని చూశాయి. నిరసన ఆరంభమైన వారం రోజులకే అంటే సెప్టెంబర్ 20న పదహారేళ్ల నికా శకరామీని అపహరించి, చంపేశారు. సెప్టెంబర్ 21న 22 ఏళ్ళ హదీస్ నజఫీ కూడా భద్రతా బలగాల చేతిలో బలైపోయింది. ఈ రెండు ఘటనలూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకూ 326 మందిని ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపినట్టు ఇరాన్ మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. ఇందులో 43 మంది పిల్లలు, 25 మంది మహిళలున్నారు. ఈ ఉద్యమంలో కేవలం మహిళలే కాకుండా, మగవారు, ప్రత్యేకించి కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు మహిళలకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కేవలం హిజాబ్‌కు వ్యతిరేక ఉద్యమం మాత్రమే కాదు, అయాతుల్లాహ్ ఖొమైనీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాల పట్ల నిరసన కూడా. ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఈనాటిది కాదు. 1935 నాటికి సాంప్రదాయికంగా అమలులో ఉన్న హిజాబ్ విధానాన్ని రజా షా ప్రభుత్వం సడలించింది. ఇది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాదని తేల్చి చెప్పింది. అయితే 1979లో ఇరాన్లో సంభవించిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మళ్ళీ హిజాబ్‌ను తప్పనిసరి చేశారు. 1983 వరకు ఇది పకడ్బందీగా అమలు జరిగింది. 1979 హిజాబ్ నిర్భంధాన్ని మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. కానీ 1983లో అది మళ్ళీ అమలులోకి తెచ్చారు. అయినా నిరసన ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ 2017లో, ఇరాన్ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. హిజాబ్‌ను సక్రమంగా ధరించకపోతే, అరెస్టులు ఉండవని చెప్పింది. చిన్న చిన్న జరిమానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణ యాన్ని పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు పాత పద్ధతిలోనే మహిళలపై వేధింపులను కొనసాగించారు. 2018లో ఫర్హాద్ మెసామీ అనే డాక్టర్ హిజాబ్ ఆంక్షలను సంపూర్ణంగా తొలగించాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ని అరెస్టు చేసి, జైలుకి పంపారు. 2019 ఏప్రిల్‌లో నస్రీన్ సోతోదేహ్ అనే మానవ హక్కుల కార్యకర్త జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని 38 సంవత్సరాల జైలు, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2019 ఆగస్ట్‌లో ఇరాన్ పౌరహక్కుల కార్యకర్త సబా కొర్ద్ అఫ్షారీ బహిరంగంగా తన హిజాబ్‌ను తొలగించినందుకు 24 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఇవన్నీ కేవలం దేశభద్రత, దైవదూషణ పేరుతో వేసిన కఠోర శి„ý లేనన్న విషయం మర్చి పోకూడదు. 2022 జూలైలో సెపిదే రష్ను అనే రచయిత్రిని కూడా హిజాబ్ నేరం కింద అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ దెబ్బ లతో ఆమె చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి నిరసనగా వందలాది మంది మహిళలు బహి రంగంగా ముఖం మీద, తలమీద ఉన్న దుస్తులను తొలగించి నిరసన తెలిపారు. 2022 ఆగస్ట్ 15న హిజాబ్ నిబంధనలను మరింత కఠిన తరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్ ధరించని మహిళలను ప్రభుత్వోద్యోగాల నుంచి తొలగించడం లాంటి కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ పరంపరలోనే సెప్టెంబర్ 13న మహసా అమీనీ అరెస్టు, తదనంతరం ఆమె మరణం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. ఇరాన్‌లోనే కాదు, చాలా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజల జీవి తాల్లోకి, వారి అలవాట్లలోకి చొరబడి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను నలిపి వేస్తున్నాయి. మన దేశంలో కొన్ని చోట్ల ఇటీవల హిజాబ్ ధరించిన ముస్లిం యువతులను వేధించే సంఘ టనలు జరిగాయి. ఇరాన్లో బలవంతంగా హిజాబ్‌ను అమలు చేయడం, భారత్‌లో తమ ఇష్టాలకు, అభిప్రాయాలకు భిన్నంగా హిజాబ్‌ను తొలగించాలని చూడడం రెండూ తప్పే. ప్రజలు తినే తిండి మీద, ధరించే దుస్తుల మీద, మాట్లాడే భాష మీద, ఆచరించే అల వాట్ల మీద ఆంక్షలు విధించడం, వేధించడం ఎంతమాత్రం వాంఛ నీయం కాదు. ప్రస్తుతం ఇరాన్లో పార్లమెంటు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనీ, ఇరాన్ మహిళల హక్కులను రక్షించాలనీ, అంతిమంగా మానవ హక్కులను పరిరక్షించాలనీ ప్రపంచ ప్రజలంతా ఇరాన్ మహిళలకు అండగా నిలబడాలి. మనమంతా ఒక్కటే అనే భావనను ఎలుగెత్తి చాటాలి. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 81063 22077