ముంబయి: మహారాష్ట్రాలో మరాఠా కోటా ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే అల్టిమేటం జారీ చేశారు. రేపు(శనివారం) ఉదయం 11 గంటల వరకు తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని గడువు విధించారు.
మరాఠా కోటా అంశంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని జరాంగే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబయిలోని ఆజాద్ మైదానంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం పొరుగున ఉన్న నవీ ముంబైలోని శివాజీ చౌక్‌లో నిరసనకారులను ఉద్దేశించి జరాంగే ప్రసంగించారు.
"నేను రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మేము ఆజాద్ మైదాన్‌కు వెళితే.. నేను దానిని వెనక్కి తీసుకోను" అని జరాంగే చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు మంజూరు చేసే వరకు నిరసనకారులు ఆందోళనను మధ్యలోనే ఆపేది లేదని ఆయన పిలుపునిచ్చారు. అయితే.. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లను ఆమోదించినట్లు మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కర్ చెప్పారు. ప్రభుత్వ విధానాల ప్రకారం వాటిని అమలు చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో నితీష్ మళ్లీ సీఎం?
Comments
Please login to add a commentAdd a comment