తలొగ్గిన సర్కార్‌.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్‌స్టాప్ | Maratha Quota Leader Ends Protest As Maharashtra Government Accepts Demands | Sakshi
Sakshi News home page

తలొగ్గిన సర్కార్‌.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్‌స్టాప్

Published Sat, Jan 27 2024 12:34 PM | Last Updated on Sat, Jan 27 2024 1:09 PM

Maratha Quota Leader Ends Protest As Maharashtra Government Accepts Demands - Sakshi

మహరాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్‌స్టాప్‌ పడింది.  మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన అన్ని చర్చలు సఫలమవ్వడంతో  మరాఠా రిజర్వేషన్ల పోరాటనేత మనోజ్‌ జరాంగే పాటిల్‌ నేడు(శనివారం) తన ఆందోళన విరమించనున్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని మహా సర్కార్‌ హామీ ఇవ్వడంతో పాటిల్‌ ఈ ఉదయం 8 గంటలకు తన నిరాహార దిక్షను విరమించారు. 

సీఎం ఏక్‌నాథ్ షిండే నవీ ముంబైలోని దీక్షా శిబిరానికి చేరుకుని మనోజ్ జరాంగే‌కి పళ్ల రసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. అలాగే, రిజర్వేషన్లపై ప్రభుత్వ హామీలకు సంబంధించిన పత్రాన్ని జరాంగేకు సీఎం అందించారు. అనంతరం సీఎం ఏక్‌నాథ్ షిండే, మనోజ్ జరాంగే ఇద్దరూ కలిసి నవీ ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చదవండి: Bihar Politics: సీఎం పదవికి నేడు నితీష్‌ కుమార్‌ రాజీనామా?

కాగా మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్‌ జరాంగే నేతృత్వంలో కొంతకాలంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీరి డిమాండ్లను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం జరాంగే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త డిమాండ్‌ వినిపించారు. 

తమ డిమాండ్లను నెరవేర్చాలని శనివారం ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వానికి మనోజ్ జరాంగే అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ముంబై నగరాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భారీ ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఆజాద్ మైదాన్ దగ్గర ఆందోళనకు మరాఠా ఉద్యమకారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కసారి అడుగు పడిందంటే వెనక్కి తిరిగి చూసేది లేదు. మా డిమాండ్‌ను సాధించుకున్నాకే తిరిగి ఇంటికి వెళ్తాం’ అని జరాంగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అయితే గత అర్థరాత్రి ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరాంగేతో చర్చలు జరిపింది. హామీలు నెరవేరుస్తామంటూ ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చింది. ఆ మేరకు ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా విడుదల చేసింది. దీంతో ఆందోళనను విరమిస్తున్నట్లు జరాంగే ప్రకటించారు. ఆయన డెడ్‌లైన్‌కు దిగివచ్చిన మహా సర్కార్‌.. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో వారు దీక్షను విరమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement