పారిస్: ఫ్రాన్స్‌లో అల్లర్లు ఐదో రోజూ కొనసాగాయి. ఆందోళనకారులు మేయర్ నివాసంపైకి మండుతున్న కారుతో దూసుకువచి్చ దాడికి యతి్నంచారు. పోలీసులతో ఆందోళనకారులు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే, గత నాలుగు రోజులతో పోలిస్తే అల్లర్ల తీవ్రత తగ్గింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు శనివారం రాత్రి మరో 719 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు.
మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రెలో ట్రాఫిక్ పోలీసులు నేహల్ అనే యువకుడిని కాల్చి చంపడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నేహల్ అంత్యక్రియలు శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. శనివారం రాత్రి పారిస్‌లో చాంప్స్ ఎలిసీస్ వద్ద గుమికూడిన యువకుల గుంపును పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. ఫ్రెంచి గుయానాలో తుపాకీ బుల్లెట్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. పారిస్ ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు బాణసంచా కాల్చుతూ, రోడ్లపై అడ్డంకులు పెట్టారు. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి వారిని పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment