17 ఏళ్ల యువకుడి చావు ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది. జూన్ 27న జరిగిన ఓ ఘటన దేశాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. పోలీసుల కాల్పుల్లో యువకుడు నాహేల్ చినపోయిన తర్వాత ఆదోళలు, నిరసలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. గత నాలుగో రోజులుగా హింసా కొనసాగుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది.
శుక్రవారం రాత్రి 1,311 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అల్లరిమూకల కారణంగా 200 మందికిపైగా పోలీసులు అధికారులు గాయపడ్డారని పేరేంది. నిరసనలు ప్రారంభమైన మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఈ స్థాయిలో అరెస్ట్‌లు జరగడం ఇదే అత్యధికం. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు.
తాజాగా ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం బయడపడింది. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దేనికైనా తెగిస్తామన్నట్టుగా ఊరేగింపుగా సాగుతున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఆందోళనలు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు కూడా పాకాయి.
How are French protesters getting their hands on heavy firearms? pic.twitter.com/k9nqO6bFfy
— Ian Miles Cheong (@stillgray) July 1, 2023
ప్రస్తుతం హింస కాస్త తగ్గిందని ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆందోళనకారుల నిరసనల్లో 1,350 వహానాలు, 234 భవనాలు తగలబడిపోయాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 45, 000 మంది పోలీసులు సాయుధ వాహనాలతో మోహరించారు. క్రాక్ పోలీస్, ఇతర భద్రతా దళాలను సైతం రప్పించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు.
ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్ మేయర్ బెనాయిట్ పాయన్, వెంటనే అదనపు దళాలను పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు.. ఫ్రాన్స్‌లోని మూడవ అతిపెద్ద నగరమైన లియోన్‌లో హెలికాప్టర్, సాయుధ సిబ్బంది క్యారియర్లు మోహరించాయి. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్‌లో కర్ఫ్యూ విధించారు.
ఇదిలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం తనిఖీల సమయంలో 17 ఏళ్ల యువకుడు నాహేల్‌ను ఓ పోలీస్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మార్సెయిల్, లియోన్‌లలో హింస, దాడులు అత్యంత దారుణ స్థాయికి చేరాయి. పారిస్ శివారు, గ్రెనోబుల్, సెయింట్-ఎటియెన్‌లోని కొన్ని ప్రాంతాల్లో హుడ్ ధరించిన నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే బస్సు, ట్రామ్ సేవలను నిలిపివేశారు. బాణసంచా అమ్మకాలను కూడ నిషేధించారు. కాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒమ్మాన్యుయేల్ మాక్రాన్ టీనెజ్ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్‌లు స్నాప్ చాట్, టిక్‌టాక్ లలో వాటిని తొలగించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణంలో నాన్‌టెర్రిలోని స్మశానవాటికలో నాహెల్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment