శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హింస చోటు చేసుకుంది. శ్రీనగర్లో మోదీ ర్యాలీకి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శన నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
శనివారం శ్రీనగర్లో బీజేపీ-పీడీపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. షేర్ ఏ కశ్మీరీ క్రికెట్ స్టేడియంలో జరిగిన సభలో మోదీ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. కాగా మోదీ ర్యాలీని వ్యతిరేకిస్తూ నిరసనకారులు వీధుల్లోకి రావడంతో హింస చెలరేగింది.
శ్రీనగర్లో ఉద్రిక్తత
Published Sat, Nov 7 2015 8:30 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement