న్యూఢిల్లీ: వాలంటైన్స్‌డే సందర్భంగా ప్రధాని మోదీకి అనూహ్య ఆహ్వానం అందింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులు ప్రధానిని ఆహ్వానించారు. ‘ప్రేమికుల దినం నాడు కలిసి వేడుక చేసుకుందాం రండి’ అంటూ షహీన్‌బాగ్ ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. ‘ప్రధాని మోదీ, షహీన్‌బాగ్‌కు రండి. మాతో మాట్లాడి, బహుమతి పట్టుకెళ్లండి’ అని ఉన్న పోస్టర్లు, ప్రేమ గీతం సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. ‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మంత్రులెవరైనా సరే, ఇక్కడికి వచ్చి, మేం సిద్ధంగా ఉంచిన బహుమతి తీసుకెళ్లొచ్చు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం కాదని వారు మమ్మల్ని ఒప్పించగలిగితే వెంటనే నిరసనలను ఆపేస్తాం’ అని షహీన్‌బాగ్ ఆందోళనల్లో పాల్గొంటున్న సయ్యద్ తసీర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment