ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేసింది. దీనిపై దేశంలో పలు ప్రాంతాల్లో వ్యతిరేఖత కనిపిస్తోంది. కానీ ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని 'మేరీ మిల్‌బెన్' మాత్రం ఇది గొప్ప చర్య అంటూ వ్యాఖ్యానించింది.
ప్రధాని మోదీ నాయకత్వాన్ని గుర్తించాలని, భారతదేశంతో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని, ముఖ్యంగా మూడోసారి మోదీని ఎన్నుకోవాలని సూచించింది. సీఏఏ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని, దుర్బల వర్గాలకు రక్షణ మరియు ఆశ్రయాన్ని అందజేస్తుందని మేరీ మిల్‌బెన్ పేర్కొంది.
మత స్వేచ్ఛను కోరుకునే క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇదొక శాంతి మార్గం. భారతదేశం వీరందరికి నివాసం కల్పిస్తోంది. పౌరసవరణ చట్టం నిజమైన ప్రజాస్వామ్య చర్య అని మేరీ మిల్‌బెన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొంది.
భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నోటిఫికేషన్ గురించి అగ్ర రాజ్యం అమెరికా ఆందోళన చెందుతోంది. సీఏఏ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు.
@StateDept, PM @narendramodi is demonstrating compassionate leadership towards those being persecuted for their faith and providing a home to them in #India. A pathway to peace for Christians/Hindus/Sikhs/Jain/Buddhists seeking #religiousfreedom. When the PM is reelected for a… https://t.co/Y5tyuWCVAs
— Mary Millben (@MaryMillben) March 15, 2024
Comments
Please login to add a commentAdd a comment