నా నెక్ట్స్‌ మిషన్‌ ‘వెడ్డింగ్‌ ఇన్‌ ఇండియా’: ప్రధాని మోదీ | PM Modi Comments in Srinagar first since Article 370 Scrapping | Sakshi
Sakshi News home page

నా నెక్ట్స్‌ మిషన్‌ ‘వెడ్డింగ్‌ ఇన్‌ ఇండియా’: శ్రీనగర్‌లో ప్రధాని మోదీ ప్రకటన

Published Thu, Mar 7 2024 2:23 PM | Last Updated on Thu, Mar 7 2024 3:26 PM

PM Modi Comments in Srinagar first since Article 370 Scrapping - Sakshi

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన తర్వాత.. శ్రీనగర్‌లో ఇవాళ తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. బక్షి స్టేడియం వేదికగా ‘వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్మూకశ్మీర్‌’ కార్యక్రమంలో రూ.6,400 కోట్లకు పైగా  అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

అద్భుతమైన శ్రీనర్‌ ప్రజల తాను ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, వారి మనసులు గెలుచుకునేందుకు తాను శ్రీనగర్‌ వచ్చినట్లు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిందని తెలిపారు. 2023లో కశ్మీర్‌లో 2 కోట్ల మంది పర్యటించారని పేర్కొన్నారు. తన నెక్ట్స్‌ మిషన్‌ ‘వెడ్డింగ్‌ ఇన్‌ ఇండియా’ అని.. వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ హబ్‌గా జమ్మూకశ్మీర్‌ను తయారు చేయబోతున్నామన్నారు.

ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు జమ్మూకశ్మీర్‌కు తరలివస్తున్నారన్నారు ప్రధాని మోదీ. జమ్మూకశ్మీర్‌ విజయగాథ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని చెప్పారు. కశ్మీర్‌ సరస్సుల్లో ఎక్కడ చూసిన కమలం పూలు కన్పిస్తాయని..50 ఏళ్ల క్రితం ఏర్పడిన జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లోగో కూడా కమలమేనని తెలిపారు. బీజేపీ సింబల్‌ కూడా కమలమేనని అన్నారు. 

ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌, దాని భాగస్వామ్య పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు మోదీ. ఆర్టికల్‌ 370తో జమ్మూక్మర్‌ ఏం లాంభం జరిగిందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కుటుంబాలే 370తో లబ్ది పొందాయని విమర్శించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ యువత కొత్త అవకాశాలు అందుకుంటున్నారని, అందరికీ సమాన అవకాశాలు, హక్కులు లభిస్తున్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement