
నటి కస్తూరి(ఫైల్ ఫొటో)
సాక్షి, చెన్నై(పెరంబూరు): నటి కస్తూరి ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. విల్లుపురం జిల్లా, తిరుకోవిలూర్‌లో కొందరు దుండగులు ఒక ఇంట్లో చేసిన దాడిలో ఒక పసివాడు బలైయ్యాడు. దీంతో అతని తల్లి, సహోదరి తీవ్రంగా గాయాలపాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యవహారంపై నటి నటి కస్తూరి తన ట్విట్టర్‌లో సామాజిక వర్గాన్ని విమర్శించడం వివాదానికి దారి తీసింది.
కస్తూరి వ్యాఖ్యలను ఖండిస్తూ పమూహ నీది క్షత్రియ పేరవై నేత పోన్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటి కస్తూరిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక తేనాంపేటలోని నటి కస్తూరి ఇంటిని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఆ పేరవై కార్యదర్శి ఎస్‌ఎం. కుమార్‌తో పాటు మాజీ శాసన సభ్యుడు రవిరాజ్, కార్తికేయన్, మలర్ ఆర్ముగం, శశికుమార్, దినకరన్, దాస్, ముత్తు, వేలు, గౌరి 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సమాచారం అందిన పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment