బ్రిటన్: యూకేలోని మాంచెస్టర్‌లోని చైనా దౌత్య కార్యాలయం వద్ద చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా కొంతమంది నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ఆ నిరసనకారులు రాయబార కార్యాలయం గేటు వద్ద జిన్‌పింగ్ ఫోటోతో కూడిన పోస్టర్‌లను ఏర్పాటు చేసి... ఒక గుంపుగా నిరసనలు చేపట్టి చోరబడేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న మాంచెస్టర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని నియంత్రించే నిమిత్తం వారిపై దాడి చేశారు.
చైనాలోని పాలక కమ్యునిస్ట్ పార్టీ చైనాని నాశనం చేస్తుందంటూ విమర్శిస్తూ....కిరీటాన్ని ధరించి ఉన్న జిన్‌పింగ్ ఫోటో పోస్టర్‌లను పట్టుకుని నిరసనలు చేశారు. దీంతో మాంచెస్టర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అక్టోబర్16, 2022న ఆదివారం మధ్యాహ్నా 3 గం.లకు జరిగిందని తెలిపారు. ఈ విషయమై మాంచెస్టర్‌లోని చైనా దౌత్యకార్యాలయం, బీజింగ్‌లోని విదేశీ కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది.
1) Shocking video showing someone from the #China's Consulate in Manchester, UK, kicking down pro-democracy signs.
— Trending News (@Trendings911) October 17, 2022
A protestor then appears to have been dragged behind the Consulate gates and beaten by consulate staff.
Via @McWLuke pic.twitter.com/FJ03xMm9fT
(చదవండి: ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......)
Comments
Please login to add a commentAdd a comment