Consulate
-
కెనడాలో కాన్సులర్ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్
భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు రోజురోజుకీ దెబ్బతింటున్నాయి. ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై దాడి జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశంలో కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.‘కెనడాలోని భారత కమ్యూనిటీ క్యాంప్ నిర్వహకులకు కనీస భద్రత కల్పించలేమని అక్కడి భద్రతా ఏజెన్సీలు తెలిపాయి. అందువల్ల ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మా షెడ్యూల్ కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.కాగా ఇటీవల కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు వీరంగం సృష్టించారు. భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు.. కర్రలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. -
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అత్యవసర సేవల కోసం ఏడాది పొడవున తెరచి ఉంటుందని పేర్కొంది. ఇది ప్రజల అత్యవసర అవసరాలను పరిష్కరించడానికి వారాంతాల్లో, ఇతర సెలవులతో సహా ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని భారత కాన్సులేట్ ప్రకటించింది. మే 10 నుంచి అమలులోకి వచ్చే అన్ని సెలవు దినాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటుందని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూయార్క్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు మే 10, 2024 నుంచి సాధారణ ప్రజల అత్యవసర అవసరాలను తీర్చేందుకు అన్ని సెలవు దినాల్లో(శనివారం/ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాలతో సహా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాన్సులేట్ తెరిచి ఉంటుందని ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కోసం అని, సాదారణ కాన్సులర్ సేవల కోసం కాదని తెలిపింది. అలాగే ఏదైనా అత్యవసర సేవ కోసం కాన్సులేట్‌కు వచ్చే ముందు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్: 1-917-815-7066కు కాల్ చేయాలని భారతీయ కాన్సులేట్ దరఖాస్తుదారులకు సూచించింది. ఈ సేవలు అవసరమైన డాక్యుమెంట్ల ఆవశక్యతకు సంబంధించి, అలాగే తదుపరి పని దినానికి వాయిదా వేయలేని అత్యవసర పనులు., వంటి వాటికి వర్తిస్తాయి. ముఖ్యంగా అత్యవసర వీసా, ఎమర్జెన్సీ సర్టిఫికేట్(అదే రోజు భారతదేశానికి ప్రయాణించడం కోసం) అదే రోజు పంపబడే మృతదేహాలను రవాణా చేయడం వంటి ప్రయాణ పత్రాల అత్యవసర అవసరాల కోసం మాత్రమే. దరఖాస్తుదారు నుంచి అత్యవసర సేవా రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అత్యవసర వీసా సేవలు కూడా ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ పేర్కొంది. 📣New announcement Consulate General of India, New York to remain open 365 days for emergency services.@binaysrikant76 @MEAIndia @IndianEmbassyUS @IndianDiplomacy @ANI @PIB_India @ITVGold @tvasianetwork @CPVIndia @Newsweek pic.twitter.com/1FFvgOxiFC— India in New York (@IndiainNewYork) May 10, 2024 (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం) -
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
టీ హబ్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్, బెంగళూరు కాన్సుల్ జనరల్ థెయిరి బెర్తెలోట్ బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు కాన్సుల్ జనరల్ బెర్తెలోట్కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలోనే టీ హబ్‌లో ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఆహా్వనించారు. భేటీలో ఐటీ, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. త్వరలోనే రాష్ట్రంలో టెలి పెర్ఫార్మన్స్ సంస్థల ఏర్పాటు ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ సంస్థ ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్‌లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్‌కు అతిథిగా రావాలని ఆహా్వనించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి శ్రీధర్‌బాబుకి వివరించారు. టెలీ పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాలకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీనిచ్చారు. సమావేశంలో కంపెనీ ప్రతినిధులు శివ, ఫణింధర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు. -
శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!
అమెరికా... అందులోనూ సిలికాన్ వాలీ అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో ఆసక్తి. ఐటీ ఇండస్ట్రీకి పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి ఇప్పుడు భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా శ్రీకర్ రెడ్డి పని చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ జిల్లా యాదాద్రి మోత్కూరు మండలంలోని కొండగడప శ్రీకర్ రెడ్డి స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి మెడిసిన్ చదివిన శ్రీకర్ రెడ్డి.. యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. జర్మనీలోని బెర్లిన్‌లో పనిచేసిన శ్రీకర్‌రెడ్డి.. దిల్లీలోని ఫారిన్ అఫైర్స్‌లో కూడా సేవలందించారు. ప్రస్తుతం భారత్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (ఐఎఫ్ఎస్) శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. The Consulate General of India, San Francisco @CGISFO announces with pleasure, Dr. Srikar Reddy has assumed charge as the Consul General. pic.twitter.com/WW09HDiwPl — India in SF (@CGISFO) August 21, 2023 బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సాక్షి టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. "రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్ పోర్ట్ అధికారిగా పని చేశాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సమయంలో శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో మంది తెలుగు వారు టెకీలుగా ఈ ప్రాంతంలో ఉన్నారు. భారత్, అమెరికా ప్రభుత్వాలు రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు ప్రయత్నించడం శుభదాయకం. అమెరికా వీసాల కోసం పెరుగుతున్న టైంలైన్ను ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. విద్యార్థుల డీపోర్టేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని" శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడం తమకెంతో గర్వంగా ఉందంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. Srikar Reddy, IFS from Telangana, has been posted as CG of India at San Francisco, USA. He will be incharge of eight States there. We look forward to more trade and business promotion. Best wishes, Srikar. We are so proud of you.#TelanganaPolice pic.twitter.com/N5HOa4YTzE — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 12, 2023 (చదవండి: "మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు) -
ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్ కళాప్రాంగణంలో ప్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు. అవి.. ► ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్‌కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. ► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ► ఫ్రాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. ► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్‌లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. ► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్ -
పాక్‌కు చైనా షాక్.. కాన్సులర్ ఆఫీస్ క్లోజ్!
చైనా అనూహ్య నిర్ణయంతో పాక్‌కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కాన్సులర్ విభాగాన్ని(దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్‌లో ఉంటున్న చైనా పౌరులకు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్సైట్లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప.. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. పాక్ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా. వాస్తవానికి తాలిబన్ గ్రూప్‌తో పాక్ ప్రభుత్వం సంధి విరమించుకున్న తర్వాత ఏడాది నుంచే.. అక్కడ దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(బీఆర్ఐ)నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పాక్ ఎకనామిక్ కారిడర్(సీపెక్)లో పనిచేస్తునన్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వివిధ తీవ్రవాద గ్రూపులు తరుచుగా దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలపై చైనా, పాక్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరదల సమయంలోనూ ఈ కారణంతోనే పెద్దగా సాయం కూడా అందించలేదు చైనా. గత ఏప్రిల్‌లో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ కరాచీలో ముగ్గురు చైనా టీచర్లను, వారి స్థానిక డ్రైవర్‌తో సహా హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా, సీపెక్ అనేది చైనాను అరేబియా సముద్రాన్ని కలుపుతూ పాక్‌లోని రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, ఓడరేవులకు సంబంధించిన 65 బిలియన్ డాలర్ల నెట్వర్క్. ఈ బీఆర్ఐ అనేది తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుందని పాక్ భావిస్తోంది. (చదవండి: ఇదే భారత్ ఇమేజ్..బాధితులకు అండగా మన బీనా, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు) -
కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్ వీసా నిబంధనలను సవరించింది. కువైట్ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్‌లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్డ్ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క కువైట్‌కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్‌ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్లు కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్‌కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్ చేయండి: లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల) -
హైదరాబాద్‌లోని కొత్త అమెరికా కాన్సులేట్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం.. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది. నానక్రామ్గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడాలో 12.2 ఎకరాల్లో 297 మిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక, సాంకేతిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. హైదారాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త కాన్సులేట్ కార్యాలయంలో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. ఇదిలాఉండగా.. గత నెలలోనే బెగంపేటలోని పైగా ప్యాలెస్‌లో చివరి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్సార్ చొరవతో.. 2008 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి చెన్నై వెళ్లేవారు. చెన్నై కాన్సులేట్ లోని మొత్తం ఇంటర్వ్యూల్లో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎక్కువ కావడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వైఎస్సార్.. ఆయన్ను ఒప్పించడంతో తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. జార్జి బుష్ అమెరికా వెళ్లగానే వైఎస్సార్ కోరిక మేరకు హైదరాబాద్ కాన్సులేట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇటు వైఎస్సార్ కూడా వేగంగా స్పందించి బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్ ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న నాటి సీఎం డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత్‌లో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. ఈ కార్యాలయం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ కాన్సులేట్ -
జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...: వీడియో వైరల్
బ్రిటన్: యూకేలోని మాంచెస్టర్‌లోని చైనా దౌత్య కార్యాలయం వద్ద చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా కొంతమంది నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ఆ నిరసనకారులు రాయబార కార్యాలయం గేటు వద్ద జిన్‌పింగ్ ఫోటోతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేసి... ఒక గుంపుగా నిరసనలు చేపట్టి చోరబడేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న మాంచెస్టర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని నియంత్రించే నిమిత్తం వారిపై దాడి చేశారు. చైనాలోని పాలక కమ్యునిస్ట్ పార్టీ చైనాని నాశనం చేస్తుందంటూ విమర్శిస్తూ....కిరీటాన్ని ధరించి ఉన్న జిన్‌పింగ్ ఫోటో పోస్టర్లను పట్టుకుని నిరసనలు చేశారు. దీంతో మాంచెస్టర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అక్టోబర్16, 2022న ఆదివారం మధ్యాహ్నా 3 గం.లకు జరిగిందని తెలిపారు. ఈ విషయమై మాంచెస్టర్‌లోని చైనా దౌత్యకార్యాలయం, బీజింగ్‌లోని విదేశీ కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది. 1) Shocking video showing someone from the #China's Consulate in Manchester, UK, kicking down pro-democracy signs. A protestor then appears to have been dragged behind the Consulate gates and beaten by consulate staff. Via @McWLuke pic.twitter.com/FJ03xMm9fT — Trending News (@Trendings911) October 17, 2022 (చదవండి: ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......) -
అమూల్య ప్రతిభ
నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్ ఉమెన్ లీడర్షిప్ ప్రతినిధిగా...!! యూఎస్ కాన్సులేట్ ఎంపికలో విజేతగా!! ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్ 2022’ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది మన తెలుగుమ్మాయి అమూల్య. ఆమె సొంతూరు మహబూబ్ నగర్ జిల్లాలోని దోమలపెంట. నల్లమల అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం అది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ‘రాజ బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్’లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌లోని ఎన్ఎస్ఎస్, క్విల్స్ క్లబ్, ఐక్యూ ఏస్ క్లబ్, ఎస్‌యూసి క్లబ్‌లలో మెంబర్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో చురుగ్గా ఉండేది. నల్గొండలో స్కూల్ రోజుల నుంచి కూడా అమూల్య వక్తృత్వం, వ్యాసరచనలలో ప్రైజ్‌లు అందుకుంది. ఇవన్నీ ఆమెను సామాజికాంశాల మీద నిర్వహించే ర్యాలీల్లో ముందు వరుసలో నిలబెట్టాయి. వీటికి తోడుగా ఆమె తన ఊరి స్కూల్ కోసం, ఆడపిల్లల చదువు గురించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా తోడయ్యాయి. అమూల్య తన ఊరి కబుర్లు చెబుతూ నానమ్మ ఇమ్మడి సామ్రాజ్యం గారిని ప్రముఖంగా గుర్తు చేసుకుంది. ‘‘మా దోమలపెంటలో ఆడపిల్లలు చదువుకోవడం ఓ విచిత్రం. అలాంటిది మా నానమ్మ తన ఎనిమిది మంది కొడుకులతోపాటు కూతుర్ని కూడా చదివించింది. తాతయ్య పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నానమ్మ మీదనే పడింది. ఆమె బర్రెల పాలు అమ్మి అంతమందినీ చదివించింది. ఆడపిల్లలను బడికి పంపించని ఊరిలో, ఇన్ని ఆర్థిక కష్టాల మధ్య మా అత్తమ్మను చదివించడం అంటేనే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆమె ఎంత గట్టిగా నమ్మిందో తెలుస్తోంది. ఆ ప్రభావం మా అందరి మీదా ఉంది. పెద్ద నాన్నల నుంచి మా నాన్న చిన్నాన్నలు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లు తమ ఊరికి, స్కూల్‌కి ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. నేను కూడా ఏటా ఆగస్టు 15వ తేదీ, జనవరి 26న దోమలపెంట స్కూల్‌కి వెళ్లి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఇస్తుంటాను. స్కూలు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అమ్మాయిల ఉన్నత చదువులు ఎంత అవసరం అనే విషయాల మీద మాట్లాడేదాన్ని. నాన్న వాళ్లు మాత్రం ప్రగతిపథం అనే చారిటీతో స్కూల్‌కి వాటర్ ఫిల్టర్, ఫ్యాన్లు ఇచ్చేవాళ్లు. ఇవన్నీ నేను ఇష్టంగా చేస్తుంటాను. కొన్నేళ్ల కిందట మా ఊరిలో వీథి పక్కన పడి ఉన్న ఓ అమ్మాయిని ఓ ముసలావిడ దగ్గరకు తీసి పెంచింది. ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ చదువుతోంది. కరోనా ఆన్లైన్ క్లాసుల సమయంలో తనకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం. మంచి స్టూడెంట్ అని అప్పుడు తెలిసింది. టెన్త్ తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ ఎడ్యుకేషన్ బాధ్యత కూడా మా కుటుంబమే తీసుకుంది. ‘మనం మనకోసం చేసుకున్న పని కంటే సమాజం కోసం చేసిన పనిలో ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని నమ్ముతాను. యూఎస్ కాన్సులేట్ నన్ను ఎంపిక చేయడానికి ఇవన్నీ దోహదం చేశాయి. దశల వారీగా వడపోత మా కాలేజ్ వాళ్లు కొందరు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురినీ హైదరాబాద్‌లో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కి పంపించారు. వాళ్లను కాన్సులేట్ వాళ్లు మళ్లీ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కాన్సులేట్‌లోనే జరుగుతుంది. కానీ కరోనా కారణంగా జూమ్ ఇంటర్వ్యూ చేశారు. దేశంలో అన్ని కాన్సులేట్ల నుంచి ఇంటర్వ్యూ రికార్డులు ఢిల్లీ కాన్సులేట్‌కి పంపిస్తారు. వాళ్లు వాటన్నింటినీ పరిశీలించి ఫైనల్‌గా ముగ్గురిని ఎంపిక చేస్తారు. ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్(ఎస్యూఎస్ఐ) 2022’కి ఎంపికైన ముగ్గురిలో నాతోపాటు అహ్మదాబాద్ నుంచి ఒకమ్మాయి, చెన్నై నుంచి ఒకమ్మాయి ఉన్నారు. కాన్సులేట్‌కి ఇచ్చిన నివేదికలో ‘నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను’ అనే వివరాలు రాయాలి. అలాగే ఈ ‘ఎస్యూఎస్ఐ ప్రోగ్రామ్‌కి హాజరైన తర్వాత ఆ సమాచారంతో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను’ అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి. అందులో మన భావంతోపాటు ఇంగ్లిష్ ప్రావీణ్యత, లీడర్షిప్ క్వాలిటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు’’ అంటూ ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించింది అమూల్య. ఆమె జూన్‌నెల 23వ తేదీన యూఎస్ విమానం ఎక్కనుంది. 25వ తేదీ నుంచి యూఎస్, కాన్సాస్ రాష్ట్రంలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్’ లో మొదలయ్యే సమావేశాల్లో పాల్గొననుంది. ఆల్ ది బెస్ట్ అమూల్యా! మాకు గర్వకారణం! యూఎస్ కాన్సులేట్‌కు మేము మా విద్యార్థులను నామినేట్ చేసేటప్పుడు ‘ఆ విద్యార్థినే ఎందుకు నామినేట్ చేస్తున్నాం’ అనే అంశాన్ని సమగ్రంగా వివరించాలి. చదువులో చురుగ్గా ఉండడంతోపాటు సమాజానికి తన వంతు కంట్రిబ్యూషన్ ఇస్తున్న వారిని ఎంపిక చేయాలి. ఫౌండేషన్లు, చారిటీలు, ఎన్జీవోలతో కలిసి పని చేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. అమూల్య ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. ఆడపిల్లల చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మన భారతీయ గ్రామాల్లో అదొకటి. అలాంటి చోట నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా తనలాంటి ఆడపిల్లలందరూ ఎదగాలని కోరుకునేది. అందుకోసం గ్రామాలకు వెళ్లి ఆడపిల్లలకు ఉన్నత చదువు పట్ల అవగాహనతోపాటు, ‘ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి’ వంటి విషయాల్లో మెళకువలు చెప్తుంటుంది. ఇన్ని అర్హతలు ఉండడం వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది అప్లికేషన్ల నుంచి ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. ఒక చురుకైన అమ్మాయి తన సేవలను మరింత విస్తరింపచేయడంలో మా కాలేజ్ పాత్ర ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. – సంయుక్త, నోడల్ ఆఫీసర్, ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ – వాకా మంజులారెడ్డి -
ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది. భద్రతకు భంగం కలిగిస్తున్నారు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్లో అమెరికా కాన్సులేట్ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్ వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
అగ్ర దేశాల దౌత్య యుద్ధం
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, చైనా మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనర ల్ను మూసివేయాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశిం చడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో అగ్గి రాజుకుంది. హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం కాన్సులేట్‌ను మూసివేయాల్సిందిగా చైనాని ఆదేశించింది. అమెరికా మేధో సంపత్తిని, ప్రైవేటు సమాచారాన్ని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గా ఓర్టాగస్ మంగళవారం విలేకరులకు తెలిపారు. అయితే చైనా ఏ తరహా గూఢచర్యానికి దిగిందో ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. దెబ్బకి దెబ్బ తీస్తాం: చైనా అమెరికా నిర్ణయం అత్యంత దారుణమైనదని, అన్యాయమైనదని చైనా విరుచుకుపడింది.. అమెరికా తన తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రతీకార చర్యలు తప్పవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌హెచ్చరించారు. కాన్సులేట్ జనరల్‌లో మంటలు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని చైనా కాన్సులేట్ జనరల్‌లో మంటలు చెలరేగాయి. కార్యాలయం ఆవరణలో చైనా ప్రతినిధులు డాక్యుమెంట్లు తగులబెట్టడంతో మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కాన్సులేట్‌ని మూసివేయాలని ఆదేశాలు జారీ అయిన కాసేపటికే కాన్సులేట్‌లో మంటలు రేగాయి. కొన్ని కంటైనర్లు, డస్ట్ బిన్స్‌లో డాక్యుమెంట్లు వేసి తగులబెట్టడంతో మంటలు చెలరేగిన వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ అయ్యాయి. మంటలు ఆర్పడానికి వెళ్లే అగ్నిమాపక సిబ్బందికి కాన్సులేట్ అధికారులు అనుమతినివ్వలేదని పోలీసులు తెలిపారు. ఎందుకీ మూసివేత! అమెరికా, చైనా మధ్య కోవిడ్ వ్యాక్సిన్ అధ్యయనాల హ్యాకింగ్ చిచ్చు కాన్సులేట్ మూసివేతకు ఆదేశాల వరకు వెళ్లినట్టుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన అధ్యయన వివరాలను తస్కరించారంటూ అమెరికా న్యాయశాఖ ఇద్దరు చైనా జాతీయుల్ని వేలెత్తి చూపిన రోజే హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేతకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికాలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ అధ్యయనాలను తస్కరించడానికి ప్రయత్నించారని అమెరికా ఆరోపిస్తోంది. -
చైనా కాన్సులేట్‌లో పత్రాల కాల్చివేత
హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వాణిజ్య, దౌత్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నుంచి మంటలు, పొగలు కనిపించాయి. దీంతో అగ్ని ప్రమాదం జరుగుతోందని భావించిన స్థానికులు రాత్రి 8 గంటలకు(అక్కడి కాలమానం ప్రకారం) పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. This video shared with us by a viewer who lives next to the Consulate General of China in #Houston shows fire and activity in the courtyard of the building. DETAILS SO FAR: https://t.co/2cOeKoap96 pic.twitter.com/0myxe6HIlC — KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020 వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెర పోయారు. కాన్సులేట్ కార్యాలయ అధికారులు కావాలనే కొన్ని పత్రాలను తగులబెడుతున్నట్లు కనిపించింది. ఈమేరకు స్థానిక మీడియా కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను ప్రసారం చేసింది. అందులో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పత్రాలను తగలబెట్టడం స్పష్టమవుతోంది. అయితే వారు ఏ పత్రాలను తగులబెట్టారు? ఎందుకు వాటిని బూడిద చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. (చైనాకు షాక్: భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు) .@HoustonFire and @houstonpolice are responding to reports of documents being burned at the Consulate General of China on 3417 Montrose Boulevard. Here's what the scene looks like there right now. pic.twitter.com/grUHhqmUz4 — KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020 చదవండి: హ్యాండ్సప్.. డోంట్ షూట్! -
సీఎం జగన్‌తో జర్మన్ కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, తాడేపల్లి : భారత్,జర్మనీల మధ్య సన్నిహిత సంబంధాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ తమ దేశానికి సత్సంబంధాలున్నాయని జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టాల్ అన్నారు. సోమవారం ఆమె తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. నవరత్నాలు, వివిధ సంక్షేమపథకాలతోపాటు అవినీతి రహిత, పారదర్శక విధానాలకోసం పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను సీఎం జగన్ వివరించారు. గడిచిన 9 నెలలుగా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కెరిన్ అభినందించారు. భారత్ జర్మనీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు, సుదీర్ఘ కాలంగా జర్మనీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న బంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇండో జర్మన్ బిజినెస్ కౌన్సిల్ ఆసక్తిగా ఉందని ఆమె తెలిపారు. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు తమ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు. వీలైనంత త్వరగా ఈ సమావేశం పెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అతిపెద్ద పవన్ విద్యుత్ మేన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సీమెన్స్ – గమేసాతో పాటు జర్మనీ సహకారంతో నడుస్తున్న పలు విండ్ పవర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల గురించి కెరిన్ ప్రస్తావించారు.మరోవైపు జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేసే చర్యల్లో భాగంగా ది జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు(కేఎఫ్‌డబ్ల్యూ)– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని కెరిన్ అన్నారు. జర్మన్ సహకారంతో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులను వివరించారు. ఆంధ్రప్రదేశ్, జర్మనీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, సాంస్కృతిక మార్పిడి మరియు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేందుకు తమవంతు కృషిచేస్తామని ఆమె అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదలచిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా... సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం మహిళా సాధికారితలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను సీఎం జగన్ జర్మన్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా పనిసామర్ధ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను సీఎం ప్రస్తావించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్ధను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రస్తావించారు. మరోవైపు పాలిటెక్నిక్, బీటెక్‌లలో పాఠ్యప్రణాళికను మార్పు చేస్తున్నామని, కొత్తగా అప్రెంటిస్‌షిప్ విధానం తెచ్చామన్నారు. ఈ సమావేశంలో సయాంట్ ఎక్స్క్యూటివ్ ఛైర్మన్ బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో కజికిస్తాన్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: కజికిస్తాన్ దేశానికి సంబంధించిన కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి యెర్లాన్ అలింబాయేవ్ వెల్లడించారు. ఎంఏకే ప్రాజెక్ట్స్ ఎండీ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్‌ను గౌరవ కాన్సూల్ జనరల్‌గా నియమించనున్నట్లు తెలిపారు. గురువారం నగరాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్రంతో సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు గల అవకాశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తొలుత నగరంలోని పార్క్ హోటల్లో విలేకరులతో యెర్లాన్ మాట్లాడుతూ.. కజికిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి తెలంగాణ, ఏపీలకు అపార అవకాశాలున్నాయన్నారు. గనులు, ఆయిల్ రిఫైనరీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాల ఉత్పత్తిలో భారత్ నుంచి పెట్టుబడులను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రాంకీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి, రెడ్డీ ల్యాబ్ సీఈవో జీవీ ప్రసాద్, సినీ నిర్మాత అల్లు అరవింద్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో సమావేశమైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అలీఖాన్, కజక్ ఇన్వెస్ట్ కంపెనీ ప్రాంతీయ డైరెక్టర్ అయిగుల్ సురాలినా తదితరులు పాల్గొన్నారు. -
పాక్‌లో ఉగ్ర బీభత్సం
కరాచీ/బీజింగ్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలోని చైనా కాన్సులేట్‌పై శుక్రవారం దాడికి దిగిన సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులను అక్కడి భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు.. మొత్తం నలుగురు మరణించగా చైనాకు చెందిన కాపలాదారుడు గాయపడ్డారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి పెను విధ్వంసం సృష్టించడమే ఆ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద ఆయుధాలతోపాటు ఆహార పదార్థాలు, ఔషధాలు ఉండటంతో చైనీయులను బందీలుగా చేసుకోవడం వారి ప్రణాళికలో భాగమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దాడి తమ పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)కు, బలూచిస్తాన్‌లో చైనా సైనిక కార్యకలాపాల విస్తరణకు తాము వ్యతిరేకమని బీఎల్ఏ గతంలో పేర్కొంది. దాడి నేపథ్యంలో పాక్‌లో సీపీఈసీ కోసం పనిచేస్తున్న వేలాది మంది చైనీయులకు రక్షణ పెంచాలని పాక్‌ను చైనా కోరింది. గేటు బయటే భద్రతా దళాలు ముగ్గురు ముష్కరులను అంతమొందించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. గ్రెనేడ్లు, ఏకే–47 తుపాకులతో.. కరాచీలోని ఖరీదైన, ప్రముఖ ప్రాంతం క్లిఫ్టన్ ఏరియాలో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రముఖులు కూడా నివాసం ఉంటారు. వివిధ దేశాల కాన్సులేట్లు/రాయబార కార్యాలయాలతోపాటు కరాచీలో పేరుగాంచిన పాఠశాలలు, రెస్టారెంట్లు ఇక్కడే ఉంటాయి. మొత్తం 9 హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే–47 తుపాకులు, భారీ సంఖ్యలో బుల్లెట్లు, తుపాకీ మేగజీన్లు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఓ వాహనంలో చైనా కాన్సులేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వాహనం నుంచి దిగి, కాన్సులేట్ బయట ఉన్న సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఇద్దరు పోలీసులతోపాటు అక్కడ ఉన్న ఓ బాలుడు, అతని తండ్రి కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు. అనంతరం కాన్సులేట్ గేటు వైపుకు ఉగ్రవాదులు వస్తుండగా కార్యాలయం వద్ద ఉన్న ప్రజలు, సిబ్బందిని వెంటనే భద్రతా దళాలు లోపలకు పంపించి తలుపులు మూశాయి. తర్వాత పారామిలిటరీ దళాలు ఉగ్రవాదాలపై కాల్పులు ప్రారంభించి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం మృతదేహాల వద్ద తనిఖీలు చేయగా భారీ సంఖ్యలో ఆయుధాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు లభించాయి. చనిపోయిన ఉగ్రవాదులు తమ వారేనని బీఎల్ఏ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ‘చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. తమ ప్రాణాలను అర్పించి ఉగ్రవాదుల విజయాన్ని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ధైర్యానికి నా సెల్యూట్’ అని ఖాన్ ట్వీట్ చేశారు. మార్కెట్లో ఆత్మాహుతి దాడి... 32 మంది మృతి పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్క్వా ప్రావిన్సులో ఉగ్రవాదులు శుక్రవారం రెచ్చిపోయారు. ఒరక్జై గిరిజన జిల్లాలో షియాల పవిత్రస్థలమైన ఇమామ్బర్ఘా వద్ద రద్దీగా ఉన్న జుమ్మా మార్కెట్ లక్ష్యంగా ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సిక్కు వ్యాపారస్తులు సహా 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నిదుస్తులు కొనేందుకు ప్రజలు శుక్రవారం భారీగా మార్కెట్‌కు చేరుకున్నవేళ ఈ దాడి చోటుచేసుకుంది. ఈ విషయమై జిల్లా డీసీపీ ఖలీద్ ఇక్బాల్ మాట్లాడుతూ..‘మార్కెట్లో కూరగాయలున్న ఓ బైక్‌కు బాంబును అమర్చిన ఉగ్రవాది రిమోట్ కంట్రోల్ సాయంతో వాహనాన్ని పేల్చివేశాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిక్కు వ్యాపారులు సహా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది షియాలే ఉన్నారు’ అని తెలిపారు. ఉగ్రవాదుల్ని అణచివేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. దాడిని ఎదిరించిన ధీర వనిత సుహాయ్ సింధ్ ప్రావిన్సుకు చెందిన ఆ అధికారిణి పూర్తి పేరు సుహాయ్ అజీజ్ తాల్పూర్. నాణ్యమైన విద్య కోసం ఆమెను చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే సంప్రదాయాలను ధిక్కరిస్తున్నారంటూ వారి బంధువులు ఆమె కుటుంబంతో మాట్లాడటం మానేశారు. ఈ వెలివేతతో ఆమె కుటుంబం వేరే ఊరికి వలసవెళ్లింది. బీకాం పూర్తి చేసిన ఆమె 2013లో పాక్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ ఉద్యోగ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి పోలీసు శాఖలో ఉన్నతాధికారిణిగా ఉద్యోగం పొందింది. కాన్సులేట్‌పై దాడిని అడ్డుకున్న భద్రతా దళాల బృందానికి ఆమె నాయకత్వం వహించింది. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టి ధీర వనితగా నిలిచింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
వేళ్లు నరికి.. బాడీని ముక్కలు చేసి..
అంకారా: ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి(59) హత్యకేసులో సౌదీ అరేబియా ప్రమేయానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సౌదీకి కాబోయే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఖషోగి హత్యతో సంబంధం ఉందని టర్కీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘యెని సఫాక్’ వెల్లడించింది. ఖషోగి హత్య జరిగిన రోజు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ నుంచి సల్మాన్ అనుచరుడొకరు రాజు కార్యాలయానికి నాలుగుసార్లు ఫోన్ చేసినట్టు సదరు పత్రిక తెలిపింది. రియాద్‌లో ఉన్నతస్థాయి పెట్టుబడుల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఈ విషయం వెలుగు రావడం గమనార్హం. మరోవైపు ఖషోగి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీస్తామని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ హామీయిచ్చారు. ‘యెని సఫాక్’ వివరాల ప్రకారం... ఖషోగి తన పెళ్లికి అవసరమైన డాక్యుమెంట్ కోసం కాన్సులేట్‌కు వస్తున్నారని తెలుసుకుని 15 మంది సభ్యుల బృందం అక్టోబర్ 2న సౌదీ నుంచి ఇస్తాంబుల్‌కు వచ్చింది. ఖషోగి కాన్సులేట్‌లోకి ప్రవేశించగానే ఈ బృందం ఆయనను చుట్టుముట్టింది. ఆయన వేళ్లను నరికేసి, కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కులు చేశారు. సల్మాన్ అనుచరుడైన మహెర్ ముత్రెబ్ కాన్సులేట్ నుంచి సౌదీ నిఘావర్గాల ఉపాధ్యక్షుడు అహ్మద్ అల్ అసిరికి నాలుగుసార్లు ఫోన్ చేశాడు. మరొక ఫోన్ కాల్ అమెరికాకు చేశాడు. ఎంత వరకు నమ్మొచ్చు! ‘యెని సఫాక్’ వెల్లడించిన విషయాలను ఎంత వరకు నమ్మొచ్చు అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే టర్కీ సెక్యురిటీ వర్గాల సహాయంలో ఖషోగి హత్యకు సంబంధించిన విషయాలను ప్రభుత్వ అనుకూల దినపత్రికలు లీక్ చేస్తూ వచ్చాయి. కాన్సులేట్ బయట వేచివున్న ఖషోగి ప్రియురాలికి ఆనవాలు తెలియకుండా ఉండేందుకే ఆయన మృతదేహాన్ని ముక్కలు చేశారని గత వారమే ‘యెని సఫాక్’ వెల్లడించింది. అయితే ఈ విషయంపై అసోసియేటెడ్ ప్రెస్ ఎన్నిసార్లు ప్రశ్నించినా సౌదీ అరేబియా అధికారుల నుంచి సమాధానం రాలేదు. మహెర్ ముత్రెబ్.. ఇస్తాంబుల్‌లో ఉన్నారన్న విషయాన్ని కూడా సౌదీ అంగీకరించలేదు. ఖషోగి వచ్చిన సమయంలో ముత్రెబ్ కాన్సులేట్‌కు వచ్చిన ఫొటో బయటకు రావడంతో ఆయన అక్కడున్నట్టు తేలింది. సౌదీ రాజు సంతాపం మరోవైపు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్సౌద్, కాబోయే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం ఉదయం ఖషోగి కుమారుడి సలా ఖషోగికి ఫోన్ చేసినట్టు సౌదీ మీడియా వెల్లడించింది. ఖషోగి మృతి పట్ల వారు సంతాపం ప్రకటించారని తెలిపింది. ఖషోగి మృతదేహం ఎక్కడుందో తమకు తెలియదని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ ఆల్-జుబెయిర్ చెప్పారు. ఖషోగి హత్య ‘మూర్కపు చర్య’గా ఆయన వర్ణించారు. దీన్ని ఎంతమాత్రమూ సమర్థించబోమని స్పష్టం చేశారు. ఖండించిన ఐరోపా దేశాలు ఖషోగి హత్యను జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఖండించాయి. ఈ హత్యోదంతంపై తక్షణమే వివరణ ఇవ్వాలని సౌదీ అరేబియాను డిమాండ్ చేశాయి. జర్నలిస్టులపై దాడులను సహించబోమని స్పష్టం చేశాయి. సౌదీ ప్రత్యేక దర్యాప్తు బృందం వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరముందన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆచితూచి స్పందించారు. సౌదీతో ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న ప్రతిపాదనకు ఆయన అంగీకరించలేదు. -
'మా వాళ్లు ఉన్నారో చనిపోయారో తెలియదు'
కోల్ కతా/కఠ్మాండు: తమ కుటుంబం వాళ్లు ప్రాణాలతో ఉన్నారో.. చనిపోయారో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భారత్ లోని నేపాల్ కాన్సులేట్ అధికారులు. గత శనివారం నేపాల్ ను భారీ భూకంపం తీవ్ర నష్టంలో ముంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య నాలుగువేలు దాటింది. ఈ నేపథ్యంలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో అనే విషయం కూడా తెలియక సర్వం స్తంభించి పోయి నేపాల్ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఘటనపట్ల భారత్‌లోని నేపాల్ కాన్సులేట్ కార్యాలయంలో పనిచేసే అధికారులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పారు. మూడు రోజులుగా ఇంటికి వెళదామని తమ వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా ఎలాంటి స్పందన రావడం లేదని, తమ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందోనని, వారు బతికి ఉన్నారో, చనిపోయారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సులేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు అధికారుల కుటుంబాల జాడ తెలియడం లేదని తెలిపారు. 4,347కు పెరిగిన మృతుల సంఖ్య నేపాల్ భూకంపం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య 4,347కు పెరిగింది. ఇది పెరగవచ్చని మంగళవారం అధికారులు తెలిపారు. మొత్తం పన్నెండు రాష్ట్రాలు భూకంపం బారిన పడగా వాటిలో కఠ్మాండు, సింధుపాల్చౌక్లలో వరుసగా 1,039, 1,176 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇక గాయపడిన వారి సంఖ్య కూడా 7,500కు పెరిగింది. చాలామంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు శరవేగం కొనసాగుతున్నాయి. -
విదేశీ విద్య - వీసా ఎలా?
విదేశీ విద్య దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి దృష్టి వీసా మీదే. వీసా వస్తుందా? రాదా? మొదటి ప్రయత్నంలోనే వీసాను పొందాలంటే ఏయే విధానాలు పాటించాలి? దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? దరఖాస్తులో ఏయే అంశాలను పొందుపరచాలి.. ఇలా ఎన్నో సందేహాలు.. ఈ నేపథ్యంలో వీసా ప్రక్రియ వివరాలు.. దరఖాస్తు ఇలా యూనివర్సిటీ అడ్మిషన్ లేదా కన్ఫర్మేషన్ లెటర్ అందిన వెంటనే వీసా ప్రక్రియను ప్రారంభించాలి. వీసా మంజూరు కోసం వర్సిటీలు ఇచ్చేఅడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తప్పనిసరి. వీసా కోసం కోర్సు ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. మరికొన్ని దేశాలు ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించాయి. దరఖాస్తు చేసే ముందే సంబంధిత వివరాలన్నీ తెలుసుకోవాలి. ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్లలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా దేశాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. వీసాకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత దేశ కాన్సులేట్‌కు ఫోన్ లేదా మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. ముందుగా ఇంటర్వ్యూ వీసా కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ముందుగా ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. వీసా ప్రక్రియలో దీన్ని చాలా ముఖ్య దశగా పరిగణించాలి. ఇంటర్వ్యూ ఇంతసేపు ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. వ్యక్తులను బట్టి సమయం మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తవుతుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఇంటర్వ్యూలో సాధారణంగా అకడెమిక్ రికార్డు, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, భవిష్యత్ లక్ష్యాలు, ఎంచుకున్న కోర్సు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఈ విధంగా ఉండొచ్చు.. సంబంధిత దేశానికి (ఉదాహరణకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా) ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎక్కడ ఉంటారు? ఎవరి దగ్గర ఉంటారు? {పస్తుతం మీ వృత్తి ? ఎన్నేళ్ల అనుభవం ఉంది? కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి వెళతారా? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయా? నిర్ణయాత్మక అంశాలు వీసా ప్రాసెస్‌లో అకడెమిక్ రికార్డు కీలకపాత్ర పోషిస్తుంది. సంబంధిత ఎగ్జామ్స్‌లో చక్కని స్కోర్‌తోపాటు అకడెమిక్ రికార్డులో బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్‌లాగ్స్ కారణంగా కొన్నిసార్లు వీసా మంజూరు చేయకపోవచ్చు. వీటికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన వాదన సహేతుకంగా ఉంటే వీసా మంజూరు చేస్తారు. వీసా పొందే క్రమంలో కీలకాంశం విద్యార్థి ఆర్థిక స్థోమత. వీసా మంజూరు చేసేందుకు సదరు విద్యార్థి ఆర్థిక స్థోమతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నా రు. కోర్సు ఫీజు, సంబంధిత దేశంలో కోర్సు కాల వ్యవధిలో నివసించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయూ? లేవా? అనే విషయూలను కూడా వీసా మంజూరుకు ముందు పరిశీలిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ ముఖ్యం ఉన్నతవిద్య దిశగా.. ప్రవేశ ప్రక్రియలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో.. వీసా ఇంటర్వ్యూలో గట్టెక్కడం కూడా అంతే ముఖ్యం. ఇంట ర్వ్యూ విజయంలో బాడీ లాంగ్వేజ్ కీలకమైంది. మనం ఎంత స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇస్తున్నామనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. అందుకే ఇంటర్వ్యూలో ఎంతో అప్రమత్తంగా సమాధానాలివ్వాలి. ఆకట్టుకునే విధంగా సరళంగా, సూటిగా సమాధానం చెప్పాలి. మాట్లాడే తీరును బట్టి భాష మీద పట్టు ఉందనే విషయం స్పష్టం కావాలి. అడిగిన ప్రశ్నల పరిధి మేరకే సమాధానం చెప్పాలి. కోర్సు పూర్తయ్యాక ఉన్న అవకాశాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వస్తాం అనే సమాధానం చెప్పడం ఉత్తమం. వర్సిటీ ఎంపిక కీలకమే యూనివర్సిటీ ఎంపిక కూడా ఒక్కోసారి కీలకంగా మారుతుంది. కాబట్టి సరైన యూనివర్సిటీ, కోర్సును ఎంచుకోవాలి. ఉదాహరణకు 70 శాతం అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థి.. 55 శాతం అకడెమిక్ రికార్డును పరిగణించే యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే వీసా తప్పకుండా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం తన ప్రతిభకు సరితూగే యూనివర్సిటీని ఎంచుకోకపోవడమే. ఇటీవలి కాలంలో నకిలీ యూనివర్సిటీల భాగోతం బయటకు వస్తున్న తరుణంలో సంబంధిత ఏజెన్సీల అక్రెడిటేషన్‌ఉన్న యూనివర్సిటీలనే ఎంచుకోవాలి. ఒక్కోసారి అక్కడి యూనివర్సిటీ/ఏదైనా సంస్థ మంజూరు చేసిన స్కాలర్షిప్ లభిస్తే.. వీసా పొందడానికి ఆ అంశం కూడా అడ్వాంటేజ్‌గా ఉంటుంది. రెండోసారి ఒకసారి వీసా రిజెక్ట్ అయినా.. పరిస్థితులకనుగుణంగా డాక్యుమెంట్స్, టెస్ట్ స్కోర్స్ సంబంధిత అంశాల్లో కొన్ని మార్పులు చేసి(ఉంటేనే).. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి దరఖాస్తు చేసుకోవడం వల్ల అవకాశాలు తక్కువగా ఉంటాయని భావించడం సరికాదు. రెండోసారి కూడా మొదటిసారిగానే అవకాశాలు ఉండొచ్చు. అందుకు మొదటిసారి వీసా నిరాకరణకు గల కారణాలను సహేతుకంగా వివరించాలి. ఆ కారణాలను వీసా ఆఫీసర్ సమంజసం అని భావిస్తేనే ఇది సాధ్యం. గతంలో కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తే.. ఆ యూనివర్సిటీ ప్రవేశ పత్రంతో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు పాస్‌పోర్ట్ వీసా దరఖాస్తు అడ్మిషన్/కన్ఫర్మేషన్ లెటర్ అకడెమిక్ అర్హతల ధ్రువ పత్రాలు కోర్సు ఫీజు రసీదులు నిర్దేశిత పరీక్షల (జీఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్ తదితర) స్కోర్ కార్డులు ఆర్థిక స్థోమత ఉన్నట్లు రుజువు (ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్) సదరు విద్యార్థిని వేరే వ్యక్తులు స్పాన్సర్ చేస్తే.. సంబంధిత స్పాన్సర్ ఇచ్చే లెటర్, స్పాన్సరర్ ఐటీ స్టేట్మెంట్ ముఖ్యమైన వెబ్‌సైట్స్ www.gov.uk www.ustraveldocs.com www.ica.gov.sg www.immi.gov.au www.immigration.govt.nz www.immigration.ca/en/