హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వాణిజ్య, దౌత్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నుంచి మంటలు, పొగలు కనిపించాయి. దీంతో అగ్ని ప్రమాదం జరుగుతోందని భావించిన స్థానికులు రాత్రి 8 గంటలకు(అక్కడి కాలమానం ప్రకారం) పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
This video shared with us by a viewer who lives next to the Consulate General of China in #Houston shows fire and activity in the courtyard of the building.
— KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020
DETAILS SO FAR: https://t.co/2cOeKoap96 pic.twitter.com/0myxe6HIlC
వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెర పోయారు. కాన్సులేట్ కార్యాలయ అధికారులు కావాలనే కొన్ని పత్రాలను తగులబెడుతున్నట్లు కనిపించింది. ఈమేరకు స్థానిక మీడియా కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను ప్రసారం చేసింది. అందులో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పత్రాలను తగలబెట్టడం స్పష్టమవుతోంది. అయితే వారు ఏ పత్రాలను తగులబెట్టారు? ఎందుకు వాటిని బూడిద చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. (చైనాకు షాక్: భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు)
.@HoustonFire and @houstonpolice are responding to reports of documents being burned at the Consulate General of China on 3417 Montrose Boulevard. Here's what the scene looks like there right now. pic.twitter.com/grUHhqmUz4
— KPRC2Tulsi (@KPRC2Tulsi) July 22, 2020
చదవండి: హ్యాండ్సప్.. డోంట్ షూట్!
Comments
Please login to add a commentAdd a comment