శివాజీనగర: బెంగళూరులో శుక్రవారం ప్రారంభమైన అమెరికా కాన్సులేట్ కార్యాలయం కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. స్థానిక జేడబ్ల్యూ మారియెట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కాన్సులేట్ ప్రారంభాన్ని ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తనకు కర్ణాటకతో విడదీయరాని అనుబంధముందని చెప్పారు. అనంతరం కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడారు.
‘ఎస్‌ఎం కృష్ణ సీఎం, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి గత 24 ఏళ్లుగా కాన్సులేట్ కార్యాలయం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయనతోపాటు నేను కూడా ఉన్నాను’అని అన్నారు. దీనిపై కరా్టటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందిస్తూ.. గతంలో ఎందరు ప్రయత్నించినప్పటికీ ప్రధానమంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాతే కాన్సులేట్‌కు మార్గం సుగమమైందంటూ ఎదురుదాడికి దిగారు. తాను కూడా అప్పటి అమెరికా రాయబారితో మాట్లాడినట్లు మాజీ సీఎం కుమారస్వామి సోషల్‌మీడియాలో అప్పటి ఫొటోలను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment