బెంగళూరు: బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా గగనతలంలో ప్రత్యేక అతిథి వచ్చి చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్ బాంబర్ జెట్ మంగళవారం బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్ వినువీధులో వీక్షకులకు కనువిందు చేసింది. అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్’ అని పిలుస్తారు.
‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ జూలియన్ చీటర్ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ అన్నారు. కాగా, సోమవారం అమెరికా ఐదోతరం సూపర్‌సోనిక్ ఎఫ్–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకున్న విషయం విది తమే. ఎఫ్35ఏ భారత్‌లో ల్యాండ్ అవడం ఇదే తొలిసారికావడం విశేషం. బీ–1బీ బాంబర్ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment