Aero India show
-
ఏరో ఇండియా.. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు
బెంగళూరు: ఏరో ఇండియా షో 2025 నేపథ్యంలో బెంగళూరు మహానగరపాలక సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగర శివారులో దాదాపు ఇరవై రోజులపాటు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీల మధ్య బెంగళూరు శివారు యలహంకలో 15వ ఎడిషన్ ఎరో ఇండియా షో జరగనుంది. అయితే.. ఎయిర్‌షో జరిగే ఈ ప్రాంతం నుంచి 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ బెంగళూరు పాలక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.ಬಿಬಿಎಂಪಿ ವಲಯದ ಏರ್ಪೋರ್ಸ್ ಸ್ಟೇಷನ್ ನಿಂದ 13 ಕಿ.ಮೀ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರುವ ಎಲ್ಲಾ ಮಾಂಸ ಮಾರಾಟದ ಉದ್ದಿಮೆಗಳನ್ನು ದಿನಾಂಕ: 10.02.2025 ರಿಂದ 14.02.2025 ರವರೆಗೆ ಏರ್ಶೋ ಪ್ರದರ್ಶನದ ಪ್ರಯುಕ್ತ ಮುಚ್ಚಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ.#BBMP #BBMPCares #bbmpchiefcommissioner #Yelahanka #AeroIndia2025 #AeroIndia #airshow… pic.twitter.com/0Xuq3eA8Hd— Bruhat Bengaluru Mahanagara Palike (@BBMPofficial) January 18, 2025కారణం..ఏరో ఇండియా సందర్భంగా గగనతలంలో వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అయితే మాంసాహారం కోసం వచ్చే పక్షులు, మరీ ముఖ్యంగా కైట్స్ లాంటి పక్షుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో.. కేవలం విక్రయాలు జరిపేవాళ్లకు మాత్రమే కాదు మాంసాహారాన్ని వడ్డించే హోటల్స్, రెస్టారెంట్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. నగరంలోని చెత్తాచెదారాన్ని యలహంక పరిధిలో డంప్ చేయకూడదని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. బీబీఎంపీ యాక్ట్ 2020, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 రూల్ 91 ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది.1994 నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన విమానాలు, యుద్ధ విమానాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే సమయంలో.. రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఎరోస్పేస్ కంపెనీల నడుమ భారీ ఒప్పందాలకు ఏరో ఇండియా కేంద్రం కానుంది.🚀 The countdown begins!Hon'ble Raksha Mantri Shri #RajnathSingh launched the official #AeroIndia2025 teaser video today at the Ambassadors' Round Table.Mark your calendars for Asia's premier biennial airshow, taking flight in Bengaluru from 10th-14th February 2025!… pic.twitter.com/UCu5iXSsgN— Aero India (@AeroIndiashow) January 10, 2025 -
Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్ కూడా!
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్హిడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. -
ఏరో షోలో అమెరికా బాంబర్ జెట్ బీ1బీ
బెంగళూరు: బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా గగనతలంలో ప్రత్యేక అతిథి వచ్చి చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్ బాంబర్ జెట్ మంగళవారం బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్ వినువీధులో వీక్షకులకు కనువిందు చేసింది. అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్’ అని పిలుస్తారు. ‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ జూలియన్ చీటర్ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ అన్నారు. కాగా, సోమవారం అమెరికా ఐదోతరం సూపర్సోనిక్ ఎఫ్–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకున్న విషయం విది తమే. ఎఫ్35ఏ భారత్‌లో ల్యాండ్ అవడం ఇదే తొలిసారికావడం విశేషం. బీ–1బీ బాంబర్ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది. -
Aero India 2023: ఆసియాలోనే అతి పెద్ద ఏరో షో ను ప్రారంభించిన మోదీ (ఫొటోలు)
-
Aero India 2023: బెంగళూరులో ఎయిర్‌షోను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
రక్షణ రంగంలో మేటిగా భారత్
సాక్షి, బెంగళూరు: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ అప్రతిహత వేగంతో ముందుకు దూసుకుపోతోందని, ఈ విషయంలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన దేశంలో గత తొమ్మిదేళ్లలో రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయని ఉద్ఘాటించారు. సానుకూల ఆర్థిక విధానాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా–2023’ను ప్రధాని మోదీ సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్షణ పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు. విదేశీ పరికరాలకు మన దేశాన్ని ఒక మార్కెట్‌గా పరిగణించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. శక్తివంతమైన రక్షణ భాగస్వామిగా భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని పేర్కొన్నారు. 5 బిలియన్ డాలర్ల ఎగుమతులు రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఎన్నెన్నో ఘనతలు సాధించామని నరేంద్ర మోదీ తెలియజేశారు. మిలటరీ హార్డ్‌వేర్ ఉత్పత్తి విషయంలో మన దేశం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న ‘తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఐఎన్ఎస్ విక్రాంత్’లు రక్షణ ఉత్పత్తుల రంగంలో మన అసలైన ప్రతిభా పాటవాలకు చక్కటి ఉదాహరణలని వెల్లడించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్ సెక్టార్‌ను ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి అన్నా రు. ఏరో ఇండియా ప్రదర్శనలో వివిధ దేశాల వైమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. లైట్ కాంబాట్ హెలికాప్టర్లో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ప్రయాణించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరిగే ‘ఏరో ఇండియా’లో దాదాపు 100 దేశాల రక్షణ శాఖ మంత్రులు, ప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన 800కు పైగా డిఫెన్స్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రక్షణ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 250 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ఆకర్షణగా అమెరికా ఎఫ్–13ఏ ఫైటర్ జెట్లు ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన ఐదో తరం సూపర్‌సానిక్ మల్టీరోల్ ఎఫ్–35ఏ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎఫ్–35ఏ లైట్నింగ్–2, ఎఫ్–13ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ అమెరికాలోని ఎయిర్‌బేస్‌ల నుంచి సోమవారం బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లు భారత్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎఫ్–16 ఫైటింగ్ ఫాల్కన్, ఎఫ్/ఏ–18ఈ, ఎఫ్/ఏ–18ఎఫ్ యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి. ప్రధాని మోదీతో ప్రముఖుల భేటీ ‘ఏరో ఇండియా’ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో బెంగళూరులో పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. కన్నడ సినీ నటులు యశ్, రిషబ్ శెట్టీ, దివంగత పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినీ, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, యువ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండేతోపాటు పలు రంగాల పెద్దలు మోదీని కలుసుకున్నారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో డిన్నర్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, గుర్తింపును మరింత ఇనుమడింపజేసేందుకు దక్షిణాది సినీనటులు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు.. -
ఎయిర్ షో సందర్భంగా నాన్‌వెజ్ అమ్మకాలు బంద్!
ఏరో ఇండియా షో సందర్భంగా బెంగళూరులో నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు. ఈ మేరకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని బెంగళూరు పౌర సంస్థ ఆదేశించింది. అంతేగాదు యలహాంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సుమారు 10 కిలోమీటర్లు పరిధిలో మాంసాహార వంటకాలు అందించడం, అమ్మడంపై నిషేధం ఉంటుందని బృహత్ మహానగర పాలికే(బీబీఎంపీ) తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే బీబీఎంపీ చట్టం 2020 తోపాటు ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ రూల్ ప్రకరాం శిక్షార్హులని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నాన్‌వెజ్ ఫుడ్ చాలా స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తోందని, మరీ ముఖ్యంగా గాలి పటాలు ఎయిర్ ప్రమాదాలకు కారణమని తెలిపింది. ఈ ఎయిర్ షో కోసం దాదాపు 731 మంది ఎగ్జిబిటర్లు, 633 మంది భారతీయులు, 98 మంది విదేశీయులు నమోదు చేసుకున్నట్లు ఏరో ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏరో ఇండియా 1996 నుంచి బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లను విజయవంతంగా 13 సార్లు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక సముచిత స్థానాన్నిసంపాదించుకుంది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ) -
భారత్ లక్ష్యం.. ‘మేక్ ఫర్ వరల్డ్’
సాక్షి, బెంగళూరు: రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని సాకారం చేసిన భారత్ తదుపరి లక్ష్యం ‘మేక్ ఫర్ వరల్డ్’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక సమీపంలో బుధవారం ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగళూరులో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు యుద్ధ సామగ్రిని ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. దేశంలో రక్షణ సామగ్రి ఉత్పత్తి కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దాదాపు 500 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాల కోసం 1.3 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. దేశ సరిహద్దులతో పాటు నీరు, నేల రక్షణ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. భారత వాయుసేన తేజస్ ఎంకే1 లఘు యుద్ధ విమాన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వైమానిక దళ పాటవం అబ్బురపరిచింది. యుద్ధ హెలికాప్టర్లు, విమానాలు, సూర్యకిరణ్ జెట్ల విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఏరో ఇండియా ప్రదర్శన ద్వారా భారత ఖ్యాతి మరింత వెలుగులోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హెచ్ఏఎల్తో రూ.48వేల కోట్ల డీల్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రూ.48వేల కోట్లతో 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్సీఏ) కొను గోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఒప్పంద పత్రాలను రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు హెచ్ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు అందజేశారు. -
ఏరో ఇండియా షో : నింగినంటే సంబరం
సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనకు బెంగళూరు యలహంక వైమానిక స్థావరం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అలరించే ఈ ఆకాశ వేడుక ఈ నెల 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఏరో షో జరిగే ప్రదేశం చుట్టుపక్కల 45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రదర్శనల్లో దుర్ఘటనలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆకస్మికంగా ప్రమాదాలు, హాని జరగకుండా తప్పించేందుకు గ్రిడ్, సబ్ గ్రిడ్, మైక్రో గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ప్రదర్శనలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో విన్యాసాల సమయంలో ఢీకొని కూలిపోవడం, పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు కాలిపోవడం వంటి దుర్ఘటనలు సంభవించాయి. 600 పైగా ప్రదర్శనలు.. ఈ కార్యక్రమంలో 600లకు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. గతేడాది 22 దేశాల నుంచి ప్రదర్శనలు వచ్చాయి. కాగా కోవిడ్ కారణంగా ఈసారి 14 దేశాలకు మాత్రమే అనుమతి లభించింది. సందర్శకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. వైమానిక రంగంలో నూతన ఆవిష్కారాలను చాటేలా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. -
నింగినంటే సంబరం
సాక్షి, బెంగళూరు: ప్రతిష్టాత్మక ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనకు బెంగళూరు యలహంక వైమానిక స్థావరం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి అలరించే ఈ ఆకాశ వేడుక ఈ నెల 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఏరో షో జరిగే ప్రదేశం చుట్టుపక్కల 45 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రదర్శనల్లో దుర్ఘటనలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆకస్మికంగా ప్రమాదాలు, హాని జరగకుండా తప్పించేందుకు గ్రిడ్, సబ్ గ్రిడ్, మైక్రో గ్రిడ్లుగా విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత ప్రదర్శనలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో విన్యాసాల సమయంలో ఢీకొని కూలిపోవడం, పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి సుమారు 300 కార్లు కాలిపోవడం వంటి దుర్ఘటనలు సంభవించాయి. 600 పైగా ప్రదర్శనలు.. ఈ కార్యక్రమంలో 600లకు పైగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. గతేడాది 22 దేశాల నుంచి ప్రదర్శనలు వచ్చాయి. కాగా కోవిడ్ కారణంగా ఈసారి 14 దేశాలకు మాత్రమే అనుమతి లభించింది. సందర్శకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. వైమానిక రంగంలో నూతన ఆవిష్కారాలను చాటేలా పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. -
చెన్నైలో 200 కార్లు దగ్ధం
సాక్షి, చెన్నై: బెంగళూరు ఏరో ఇండియా షో పార్కింగ్‌లో 300 కార్లు బుగ్గిపాలైన మరుసటి రోజే చెన్నైలో అదే తరహా ప్రమాదం సంభవించింది. శివారు ప్రాంతం పోరూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి, వైద్య కళాశాల ఎదురుగా పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 200 కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ఆర్పకుండా పడేసిన సిగరెట్ పీక ఎండు గడ్డిపోచకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కార్లలో కొన్ని కొత్తవి, మరికొన్ని ఈఎంఐలు చెల్లించకపోవడంతో స్వాధీనం చేసుకున్నవి ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. అగ్ని కీలలు విస్తరించాక దట్టంగా కమ్ముకున్న పొగతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఏడు ఫైరింజన్లు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అన్ని కార్లలో ఇంధనం ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదని భావిస్తున్నారు. పార్కింగ్ చేసి ఉన్న 216 కార్లలో 184 పూర్తిగాను, 16 పాక్షికంగాను బుగ్గిపాలయ్యాయి. రూ.50 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. -
ఏరో ఇండియా షోలో భారీ అగ్నిప్రమాదం
-
బెంగళూరులో ‘కారు’ చిచ్చు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. నాలుగో రోజైన శనివారం పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి 300కుపైగా సందర్శకుల కార్లు బుగ్గిపాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాలేదు. ఎవరో సిగరెట్ కాల్చడం వల్ల మంటలు చెలరేగాయని, ఓ కారులోని సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ నెల 19న రెండు సూర్యకిరణ్ విమానాలు ఢీకొని పైలట్ మృతిచెందిన ఘటనను మరువక ముందే ఈ ప్రమాదం జరిగింది. కార్లు దగ్ధం కావడంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు. ఎండ, గాలితో వేగంగా విస్తరించి.. తొలి మూడు రోజులు అధికారులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులకు మాత్రమే పరిమితమైన ఏరో షోలో శనివారం సామాన్య ప్రజలను అనుమతించారు. నాలుగో శనివారం సెలవు దినం కావడంతో ప్రదర్శనకు భారీ ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఎయిర్‌బేస్‌లోని అన్ని గేట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో కార్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12గంటలవేళ ఐదో నంబర్ గేట్ పార్కింగ్ ప్రాంతంలో అగ్నికీలలు ప్రారంభమయ్యాయి. ఎండ, గాలి తోడవడంతో క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. పార్కింగ్ ప్రాంతంలోని ఒక్కొక్క కారుకు మంటలు అంటుకుంటూ మొత్తం 300కు పైగా కార్లు కళ్లెదుటే కాలిపోయాయి. కార్లలోని ఇంధనం అగ్నికి ఆజ్యం పోసింది. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. ప్రమాదం నేపథ్యంలో సుమారు రెండు గంటల పాటు ఏరో షోలో ప్రదర్శన, వైమానిక విన్యాసాలు, తదితర కార్యక్రమాలను అధికారులు నిలిపేశారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పునరుద్ధరించారు. విలపించిన యజమానులు.. సందర్శకుల్లో చాలామంది తమ కార్లు కళ్ల ముందే కాలిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమయ్యారు. కార్లలో ఉంచిన విలువైన వస్తువులు, పత్రాలు కూడా బూడిదైనట్లు కొందరు విలపిస్తూ చెప్పారు. అప్పులు చేసి మరీ కారు కొన్నామని, ఇప్పుడేం చేయాలో దిక్కుతోచడం లేదని కొందరు వాపోయారు. -
సిగరేట్ ముక్కతో 300 వాహనాలు దగ్ధం!
-
సిగరేట్ ముక్కతో 100 వాహనాలు దగ్ధం!
సాక్షి, బెంగళూరు : బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్ లో జరుగుతున్న 'ఏరో ఇండియా 2019' లో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 100 వాహనాలు వరకు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సిగరేటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాల్చిపారేసిన సిగరేట్ ముక్క పార్కింగ్ సమీపంలోని ఎండుగడ్డికి అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ ఎయిర్ షో..24 వ తేదీ వరకు జరగనుంది. దీంతో ఎయిర్ షోను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. -
విశాఖ టీ20 మ్యాచ్‌కు 23వేల టికెట్లు కట్..!
సాక్షి, విశాఖపట్నం : భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుండడంతో క్రికెట్ అభిమానులతో విశాఖపట్నం హోరెత్తనుంది. ఆదివారం (ఫిబ్రవరి 24) సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 23 వేల టికెట్లు అమ్ముడు పోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌కు అదనపు భద్రతను కల్పించామని, 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. బయటి నుంచి ఎలాంటి వస్తువులను స్టేడియంలోకి అనుమంతించేది లేదని స్పష్టం చేశారు. మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్టేడియం నిర్వాహక కమిటీ ప్రతినిధి, పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. రేపు (శనివారం) ఇరు జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా, రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 బెంగుళూరులో.. రెండో టీ20 విశాఖలో జరగాల్సి ఉండగా.. కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ అభ్యర్థన మేరకు వేదికల తేదీలు మారాయి. ఆదివారం రోజున బెంగుళూరులో ఏరో ఇండియా షో జరగనుండడంతో ఈ మార్పు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరుకు రానుండడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో 27,500 సీట్ల సామర్థ్యం గల విశాఖ స్టేడియం తొలి టీ20కి వేదికైంది. 27వ తేదీన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రెండో టీ20 జరుగనుంది. (బెంగళూరులోనే ఏరో షో) -
ఏరో ఇండియా - 2019 ప్రదర్శనలో తేజోస్
-
ఆకాశంలో ఢీకొట్టుకున్న రెండు విమానాలు
-
కుప్పకూలిన రెండు జెట్ విమానాలు : పైలట్ మృతి
బెంగళూరు : సైనిక వైమానిక దళ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ వద్ద రెండు ఐఏఎఫ్ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. సూర్యకిరణ్ ఏరోబేటిక్స్ బృందం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. గాలిలోనే ఈ రెండు జెట్లు కాలి బూడిదైనట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈప్రమాదంలో ఒక పైలట్ దుర్మరణం చెందగా మిలిగిన ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. #WATCH Two aircraft of the Surya Kiran Aerobatics Team crash at the Yelahanka airbase in Bengaluru, during rehearsal for #AeroIndia2019. More details awaited. pic.twitter.com/kX0V5O0n6R — ANI (@ANI) February 19, 2019 -
రాఫెల్ యుద్ధ విమానాలొచ్చేశాయ్ !
బెంగుళూరు: ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 20న జరగబోయే ఏరో ఇండియా షోలో పాల్గొనేందుకు బెంగుళూరులో ల్యాండ్ అయ్యాయి. ఈ రెండు కాకుండా మరో రాఫెల్ యుద్ధ విమానం బైన్నియల్ ఎయిర్ షో, ఏవియేషన్ ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు వస్తోంది. ఈ యుద్ధ విమానాలను టాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్లు నడపనున్నారు. ఈ యుద్ధవిమానాలను నడిపేవారి జాబితాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ వివేక్ చౌధరీ కూడా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రాఫెల్ యుద్థ విమానాల అంశమే ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రం కావడంతో ప్రస్తుతం అందరి కళ్లు వాటిపైనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నప్పటికీ రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరడం దేశ భద్రతకు మరింత అవసరం. ఫిబ్రవరి 20 నుంచి జరగబోయే ఏరో ఇండియా షోలో విమానాలను చూసేందుకు ఒక్కొక్క టిక్కెట్‌కు రూ.2750(బిజినెస్ డేస్‌లో) చెల్లించాలి. మిగతా రోజుల్లో సాధారణ సందర్శకులకు రూ.1800, ఎయిర్ డిస్ప్లే కోసం రూ.600 చార్జి చేస్తారు. ముందుగా కాకుండా అక్కడికక్కడే టిక్కెట్లు తీసుకుంటే రూ. 250 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
బెంగళూరులోనే ఏరో షో
సాక్షి బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా షో బెంగళూరులోనే జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో సమావేశమైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ షో వేదికను మార్చొద్దని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 20 నుంచి 24వరకు బెంగళూరులో ఏరో షో జరగనుంది. ఈ షోను లక్నోలో నిర్వహించాలంటూ గత నెల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంపై వివాదమవడం తెల్సిందే. గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచీ అందిన ఇలాంటి విజ్ఞాపనలను పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. వైమానిక ప్రదర్శనను బెంగళూరులోనే నిర్వహించాలని కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ఇదే వాదన వినిపించారు.ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1996 నుంచి రెండేళ్లకోసారి బెంగళూరులో జరుగుతున్న ఈ విమానాల పండుగలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధ వైమానిక సంస్థలు పాల్గొంటాయి. -
బెంగళూరులోనే ఏరో ఇండియా షో
బెంగళూరు: రెండేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ‘ఏరో ఇండియా’ ప్రదర్శన ఈ సారి కూడా ఐటీ నగరి బెంగళూరులోనే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏరో ఇండియా సంస్థ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ‘ఏరో ఇండియా-2017’ 11వ ఎడిషన్ ఏర్పాటు కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు ప్రదర్శన కొనసాగనుంది. 1996లో ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏషియా ప్రీమియర్ ఎయిర్ షోగా ప్రఖ్యాతి గాంచింది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వాయుసేన, రక్షణ విభాగాలతో పాటు నాగరిక విమానయానానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులను ఆయా దేశాలు ప్రదర్శించనున్నాయి. 2015లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో 33 దేశాలకు చెందిన 644 సంస్థలు పాల్గొన్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరగనుందని అంచనా. -
రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం
ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రధాని మోదీ భారత్ అతిపెద్ద దిగుమతిదారు అనే పేరు పోవాలి ఇక్కడ ఉత్పత్తిచేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకురావాలి బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా మారాలని, భారత్‌లో తయారీకి ముందుకు రావాలని సూచించారు. బుధవారం బెంగళూరులో 10వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ నంబర్ వన్ అన్న పేరు చెరిగిపోవాలి. అందుకు వచ్చే ఐదేళ్లలో 70 శాతం పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నాం. ఇది సాకారమైతే 1.20 లక్షల నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించవచ్చు. రక్షణ రం గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాం. అవసరమైతే దీన్ని ఇంకా పెంచుతాం’’ అని చెప్పారు. పరిశోధన, అభివృద్ధి విభాగాలకు పెద్దపీట క్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీటవేస్తోందని మోదీ తెలిపారు. రక్షణ వస్తువుల అభివృద్ధికి సంబంధించి ‘ప్రోటోటైప్’ తయారీకి అవసరమైన నిధుల్లో 80 శాతం వరకు ప్రభుత్వమే అందించేలా నూతన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామన్నారు. కొత్తగా ‘సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంతో విదేశీ కంపెనీలు మన దేశంలో వస్తు ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నాయని మోదీ తెలిపారు. ఆకట్టుకున్న ప్రదర్శన: ‘ఏరో ఇండియా-2015’లో దేశ, విదేశాలకు చెందిన దాదాపు 650 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 22 వరకు సాగే ప్రదర్శనలో కోట్లాది రూపాయల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. వివిధ దేశాల అత్యాధునిక విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ధ్రువ్, రుద్ర హెలికాప్టర్ల పనితీరును అడిగి తెలుసుకునేందుకు విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపారు.