బెంగళూరు: రెండేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ‘ఏరో ఇండియా’ ప్రదర్శన ఈ సారి కూడా ఐటీ నగరి బెంగళూరులోనే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏరో ఇండియా సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ‘ఏరో ఇండియా-2017’ 11వ ఎడిషన్ ఏర్పాటు కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు ప్రదర్శన కొనసాగనుంది. 1996లో ప్రారంభమైన ఈ ప్రదర్శన ఏషియా ప్రీమియర్ ఎయిర్ షోగా ప్రఖ్యాతి గాంచింది.
భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వాయుసేన, రక్షణ విభాగాలతో పాటు నాగరిక విమానయానానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులను ఆయా దేశాలు ప్రదర్శించనున్నాయి. 2015లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ప్రదర్శనలో 33 దేశాలకు చెందిన 644 సంస్థలు పాల్గొన్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరగనుందని అంచనా.
బెంగళూరులోనే ఏరో ఇండియా షో
Published Wed, Aug 31 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
Advertisement