![AMCA Aircraft Will Unveild By Rajnath Singh In Aero India Show 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/plane.png.webp?itok=oXYaTFvD)
బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా-2025 ఎగ్జిబిషన్‌లో ఈసారి హైదరాబాద్‌కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ సత్తా చాటనుంది. డీఆర్డీవోతో కలిసి వెమ్ టెక్నాలజీస్ తయారుచేసిన అత్యాధునిక అడ్వాన్స్‌డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఏరో ఇండియా షో ప్రారంభంలో భాగంగా ఫిబ్రవరి 10న ఆవిష్కరించనున్నారు.
వెమ్ టెక్నాలజీస్ ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానంలోని కీలక మాడ్యూల్స్‌ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్‌లోనే అసెంబుల్ చేసింది. యుద్ధ విమానాల ఫ్యుసిలేజ్‌లు,జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్ పేరు గాంచింది. రక్షణ రంగ విమానాలు, హెలికాప్టర్లకు అవసరమైన ఆన్ బోర్డ్ సిస్టమ్‌లను కూడా వెమ్ తయారు చేస్తోంది.
ఇండియన్ ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన పలు రకాల వెపన్ సిస్టమ్స్‌ను కూడా కంపెనీ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేస్తుండడం విశేషం. ఇటీవలే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ‘అసీబల్’ను వెమ్ అభివృద్ది చేసింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ రోజురోజుకు వృద్ధి చెందుతోందనడానికి ‘ఏఎంసీఏ’ యుద్ధ విమానం పూర్తిగా ఇక్కడ తయారవడమే నిదర్శనమని పలువురు రక్షణరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Witness the power of innovation!
The AMCA takes center stage in its first-ever full-scale display at the India Pavilion, Aero India 2025 pic.twitter.com/edDrb0Hde5— DRDO (@DRDO_India) February 9, 2025
Comments
Please login to add a commentAdd a comment