unveil
-
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ
‘తిరంగా యాత్ర’ థీంసాంగ్ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: డెబ్బై ఏళ్ల భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ’ పేరుతో రూపొందించిన ‘తిరంగా యాత్ర’ థీం సాంగ్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. గజల్ శ్రీనివాస్ రచించిన ఈ పాటను నాలుగు భాషల్లో రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
నల్లగొండలో రుద్రమదేవి విగ్రహావిష్కరణ
నకిరేకల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లాలో రుద్రమదేవి విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించనున్నారు. నకిరేకల్ మండలం చందుపట్లలో కాకతీయ సామ్రాజ్య విశేషాలకు సంబంధించిన శాసనాలు లభ్యం కావడంతో అక్కడ రుద్రమదేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొంటారు. -
సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ
నల్లగొండ (వలిగొండ) : తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆవిష్కరించున్నారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని సుంకిశాలలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చెరుకు శివయ్యగౌడ్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరు కానున్నారు. -
అల్లు రామలింగయ్య 93వ జయంతి
-
అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ
విజయవాడ: దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్ ఖాన్ 'కిక్' ట్రైలర్ విడుదల
హైదరాబాద్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'కిక్' ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. తొలిసారి దర్శకత్వం వహించిన నిర్మాత షాజిద్ నడియాడ్వాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెప్పబోనని సల్మాన్ అన్నారు. చెబితే అభిమానులు ఎక్కువగా ఊహించుకుంటారని, అందుకే తెరపై చూడాలని చెప్పారు. తెలుగులో విజయం సాధించిన కిక్ సినిమాకు ఇది రీమేక్. సల్మాన్ సరసన జాక్వెలెన్ ఫెర్నాండెజ్ నటించారు. జాక్వెలెన్ను అలనాటి బాలీవుడ్ తార జీనత్ అమన్‌తో సల్మాన్ పోల్చారు. జీనత్ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని చెప్పారు. -
‘రోబో’నందం..
టోక్యో: నడిచే రోబోలే కాదు... ఇప్పుడు న వ్వించే రోబోలు కూడా వచ్చాయి. జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీ ఇంజనీర్ల బృందం హాస్యస్ఫూర్తి కలిగి మనల్ని తన సంభాషణలతో నవ్వులతో ముంచెత్తే రోబోలను అభివృద్ధి చేసింది. ఈ రోబోను ఈము(ఈఎంఐఈడబ్ల్యూ2)గా పిలుస్తున్నారు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు స్క్రిప్ట్ ఇవ్వకున్నా ఈము తన మాటలతో మనల్ని నవ్విస్తుంది. అంతేకాదు తాను వేసిన జోక్‌కు మనం నవ్వామా... లేదా అనేది కూడా తెలుసుకొని ప్రతిస్పందిస్తుంది. మనుషుల భావోద్వేగాలను పసిగట్టే విధంగా ఈ రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. అందుకే ఈముతో ఎవరైనా మాట్లాడినప్పుడు అది జోకులు వెయ్యడమే కాదు.. మనం వాటి మాటలకు ఎలా ప్రతిస్పందిస్తున్నామో కూడా గ్రహిస్తుంది. మంగళవారం ఈమును టోక్యోలో హిటాచీ ఇంజనీర్ల బృందం అందరిముందు పరిక్షించింది కూడా. భవిష్యత్తులో ఈఎంఐఈడబ్ల్యూ-2 (ఎక్సిలెంట్ అల్టిమేట్లీ మోబిలిటీ అండ్ ఇంటరాక్టివ్ ఎగ్జిస్టెన్స్ యాస్ వర్క్‌ప్లేస్)(ఈము)ను ఇంట్లో పెంపుడు జంతువుమాదిరిగా, కంపెనీలో రెసెప్షనిస్టుగా కూడా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.