సల్మాన్ ఖాన్ 'కిక్' ట్రైలర్ విడుదల
హైదరాబాద్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'కిక్' ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు. తొలిసారి దర్శకత్వం వహించిన నిర్మాత షాజిద్ నడియాడ్వాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెప్పబోనని సల్మాన్ అన్నారు. చెబితే అభిమానులు ఎక్కువగా ఊహించుకుంటారని, అందుకే తెరపై చూడాలని చెప్పారు.
తెలుగులో విజయం సాధించిన కిక్ సినిమాకు ఇది రీమేక్. సల్మాన్ సరసన జాక్వెలెన్ ఫెర్నాండెజ్ నటించారు. జాక్వెలెన్ను అలనాటి బాలీవుడ్ తార జీనత్ అమన్తో సల్మాన్ పోల్చారు. జీనత్ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని చెప్పారు.